Don't Miss!
- News
Budget 2023: ధరలు తగ్గే- పెరిగే వస్తువులు ఇవే: వారికి బిగ్ షాక్..!!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Finance
Stock Market: మార్కెట్ల బడ్జెట్ దూకుడు.. నష్టపోయిన స్టాక్స్.. లాభపడిన స్టాక్స్ ఇవే..
- Lifestyle
షుగర్ పేషంట్స్ ఉదయాన్నే ఈ ఆహారాలను తినకూడదు.. తింటే షుగర్ లెవల్స్ పెరిగి, ప్రాణాలకే ప్రమాదం...
- Technology
Samsung కొత్త ఫోన్లు లాంచ్ ఈ రోజే! లైవ్ ఈవెంట్ ఎలా చూడాలి,వివరాలు!
- Sports
వికెట్ తీసిన తర్వాత అతి చేష్టలు.. స్టార్ ఆల్‌రౌండర్‌పై అంపైర్ గుస్సా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Karthikeya 3: మరో హీరో కూడా.. యూనివర్స్ తరహాలో డైరెక్టర్ ప్లాన్: నిఖిల్ క్లారిటీ
ఈ ఏడాది బాక్స్ ఆఫీస్ వద్ద అత్యధిక స్థాయిలో కలెక్షన్స్ అందుకున్న సినిమాల్లో కార్తికేయ 2 సినిమా ఒకటి. టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ నటించిన ఈ సినిమా దాదాపు అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. శ్రీకృష్ణ మిస్టరీ నేపథ్యంలో తెరపైకి వచ్చిన ఈ సినిమాకు చందు మొండేటి దర్శకత్వం వహించాడు.
ఇక ఈ కార్తికేయ తదుపరి ఫ్రాంఛైజ్ కూడా ఉంటుందని ఇదివరకే క్లారిటీ ఇవ్వడంతో ఫ్యాన్స్ అప్డేట్ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే కార్తికేయ సినిమాపై హీరో నిఖిల్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక క్లారిటీ ఇచ్చాడు. ఆ వివరాల్లోకి వెళితే..

18 పెజెస్ గ్రాండ్ రిలీజ్
నిఖిల్ సిద్దార్థ్ ఎంతో కష్టపడి ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్నాడు. అతనికి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకపోయినప్పటికీ విభిన్నమైన సినిమాలు చేస్తూ ఉండడంతో ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు దక్కింది. అతని నుంచి తదుపరి సినిమా 18 పేజెస్ డిసెంబర్ 23న గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పుష్ప టీమ్ కూడా పాల్గొన్న విషయం తెలిసిందే.

ఫుల్ డిమాండ్
అయితే కార్తికేయ 2 సినిమా తో నిఖిల్ 100 కోట్ల మార్కెట్ను కూడా సొంతం చేసుకున్నాడు. అయితే ఆ ప్రభావం వలన ఇప్పుడు అతనికి మంచి డిమాండ్ ఏర్పడింది. పవర్ఫుల్ ఆఫర్స్ వస్తున్నాయి. కానీ నిఖిల్ తొందరపడకుండా మంచి కంటెంట్ ఉన్న సినిమాలను చేయాలని అనుకుంటున్నాడు. అయితే 18 పేజేస్ సినిమాను కూడా హిందీలో విడుదల చేస్తే బాగుంటుంది అని నార్త్ ఆడియన్స్ నుంచి కూడా డిమాండ్ వస్తోంది అని నిఖిల్ తెలిపాడు.

ఫ్యాన్స్ అడగడంతో..
అయితే కార్తికేయ 3 సినిమా గురించి ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోవడంతో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ అందరూ కూడా ఆ సినిమా గురించి అడుగుతున్నారు. ఇక మొత్తానికి ఆ విషయంలో నిఖిల్ ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. తప్పకుండా అందుకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు అయితే జరుగుతున్నాయి అని దర్శకుడు చందు ఈ ఫ్రాంఛైజ్ ను ఇలాగే కొనసాగించే ఆలోచనతోనే ఉన్నాడు అని చెప్పాడు.

కార్తికేయ 3లో మరో స్టార్
కార్తికేయ 2 సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది కాబట్టి ఇప్పుడు దానికి కొనసాగింపుగా మరో సినిమా రావాలి అంటే స్టోరీ స్క్రిప్ట్ కూడా అంచనాలకు తగ్గట్టుగానే ఉండాలి. కాబట్టి ఆ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే దర్శకుడు చందు నాకు ఒక స్టోరీ లైన్ గురించి చెప్పాడు. అలాగే ఈ సినిమాలో మరో హీరో ఉండవచ్చు. లేదా మల్టివర్స్ అనే తరహాలో కూడా రావచ్చు.. అని నిఖిల్ చెప్పాడు.

అప్పుడే మొదలవ్వచ్చు
ప్రస్తుతం దర్శకుడు చందు చందు గీత ఆర్ట్స్ లోనే ఒక సినిమా చేయాల్సి ఉంది. అయితే కథ గురించి నాకు కేవలం మెయిన్ పాయింట్ మాత్రమే చెప్పాడు. అది నాకు చాలా బాగా నచ్చడంతో ఇంకా చెప్పాలని అడిగినప్పటికీ అతన్ని చెప్పలేదు. దుబాయ్ తీసుకువెళ్ళు అక్కడ మాట్లాడుకుందాం అని అన్నాడు. తప్పకుండా అని నేను సమాధానం ఇచ్చాను. బహుశా అన్ని కుదిరితే వచ్చే ఏడాది చివరలో కార్తికేయ 3 సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశం కూడా ఉండవచ్చు.. అని నిఖిల్ వివరణ ఇచ్చాడు.