Pawan Kalyan హరిహర వీరమల్లు గురించి నిధి అగర్వాల్ క్రేజీ అప్‌డేట్.. నా కెరీర్‌లోనే బిగ్గెస్ట్ అంటూ

టాలీవుడ్‌లో నిధి అగర్వాల్ సుస్థిరమైన స్థానం సంపాదించుకొనేందుకు ప్రయత్నిస్తున్నది. యువ హీరోలతోపాటు పవన్ కల్యాణ్ లాంటి టాప్ హీరోలతో జతకడుతూ అభిమానులను భారీగా సంపాదించుకొంటున్నది. గల్లా అశోక్ హీరోగా పరిచయమవుతున్న హీరో సినిమాలో నిధి హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాతోపాటు పవన్ కల్యాణ్ గురించి.. హరి హరవీరమల్లు సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడిస్తూ..

నాకు తెలుగు ఇండస్ట్రీయే మోస్ట్ కంఫర్ట్‌బుల్. తెలుగు ప్రేక్షకులంటే నాకు ఓ రకమైన ప్రేమ ఉంది. నేను హైదరాబాద్‌లో పుట్టడం వలన నాకు చాలా మంచి కంఫర్ట్ ఉంది. తెలుగు మీడియాతో నాకు మంచి రిలేషన్ ఉంది.

Actress Nidhhi Agerwal about Pawan Kalyan and Hari Hara Veera Mallu

నాకు యాక్షన్ చిత్రాలు చేయాలని అనుకొంటున్నాను. హరిహర మల్లు సినిమాలో నాకు కొన్ని యాక్షన్ సీన్లు ఉంటాయి. ఈ సినిమా ఫస్టాప్ పూర్తయింది. సెకండాఫ్ పూర్తికావాలి. నా కెరీర్‌లో గొప్ప సినిమాగా ఉంటుంది. హరిహర మల్లు నా కెరీర్‌లో బిగ్గెస్ట్ మూవీ. నా కెరీర్ ఆరంభంలో అంత మంచి అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమా కంప్లీట్‌గా పీరియడ్ ఫిలిం. ఈ సినిమా ఆరంభం నుంచి చివరి వరకు కనిపిస్తాను. నా కెరీర్‌లో బెస్ట్ అవుతుంది అని నిధి అగర్వాల్ తెలిపారు.

పవన్ కల్యాణ్ నటించే అవకాశం రావడం లక్కీ. ఆయనలో చాలా పాజిటివ్ విషయాలు ఉన్నాయి. ఇప్పుడు ఆయన గురించి చెప్పాలంటే చాలా టైమ్ పడుతుంది. ముఖ్యంగా హరి హర వీరమల్లు సినిమా అద్బుతంగా వస్తున్నది.

ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తున్నాను. హిందీలో ఓ ప్రాజెక్ట్ త్వరలో ప్రారంభం అవుతుంది. తమిళంలో రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఉదయనిధి స్టాలిన్‌తో సినిమా చేస్తున్నాను. మరో సినిమాను కూడా అంగీకరించాను. అవి త్వరలోనే రిలీజ్ అవుతాయి. కొన్ని ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయి. తమిళంలో నా కెరీర్ బాగుంది. 2022లో చాలా బిజీగా ఉన్నాను. చాలా సినిమాలు రిలీజ్ అవుతాయి.

లాక్ డౌన్‌లో రెండు కేజీలు పెరిగాను. నేను ముఖ్యంగా శాఖాహారం తీసుకొంటాను. పెద్దగా నేను భోజనం తినను. పరిమితంగా భోజనం తీసుకొంటాను. మూడు పూటల తింటాను. ప్రతీ రోజు 20 నిమిషాలకుపైగా వర్కవుట్ చేస్తాను. అంతకంటే నేను పెద్దగా ఏమీ చేయను అని నిధి అగర్వాల్ చెప్పారు.

ఇక సోషల్ మీడియాలో నేను యాక్టివ్‌గా ఉంటాను. నేను హీరోయిన్‌గా కాకముందే నాకు మిలియన్ మంది ఫాలోవర్స్ ఉన్నారు. సోషల్ మీడియాలో ఫోటోలు పోస్టు చేయడం ఒక పబ్లిక్ రిలేషన్ లాంటి టాస్క్. నా గురించి అభిమానులు తెలుసుకొనే అవకాశం ఉంటుంది అని నిధి అగర్వాల్ చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X