Don't Miss!
- Sports
INDvsNZ : పృథ్వీ షాకు నో ఛాన్స్!.. పాండ్యాకు మూడో టీ20లో అగ్ని పరీక్ష!
- News
సింహంలా మీ బిడ్డ ఒక్కడే - పొత్తులపై గర్జించిన సీఎం జగన్ : అదే నా ధైర్యం..!!
- Finance
SBI: లోన్ తీసుకుంటే వడ్డీ డిస్కౌంట్.. అబ్బా SBI బలే ఆఫర్.. పూర్తి వివరాలు
- Technology
OnePlus నుండి కొత్త స్మార్ట్ ఫోన్ మరియు స్మార్ట్ టీవీ ! లాంచ్ తేదీ ,స్పెసిఫికేషన్లు!
- Automobiles
సీరియల్స్ చేస్తూ ఖరీదైన బెంజ్ కారు కొనేసి రూపాలి గంగూలీ.. ధర ఎంతో తెలుసా?
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
- Lifestyle
Chanakya Niti: జీవితంలో ఈ సుఖాలు అనుభవించాలంటే మంచి కర్మలు చేసుండాలి, అవేంటంటే..
మహేష్ బాబు మాటలతో కళ్లలో నీళ్లు తిరిగాయి.. ఆ నిర్మాతల టార్చర్.. హిట్ 2 సక్సెస్ మీట్‌లో అడివిశేష్
'హిట్ ది ఫస్ట్ కేస్' అనే క్రైమ్ థ్రిల్లర్‌తో దర్శకుడిగా తెరంగేట్రం చేసిన శైలేష్ కొలను భారీ హిట్ సాధించారు. హిట్ సినిమాకు ఫ్రాంచైజీగా రూపొందిన మరో చిత్రం 'హిట్ 2 ది సెకండ్ కేస్'. హిట్ కేస్ 1లో విశ్వక్ సేన్ హీరోగా నటించగా.. హిట్ 2లో అడివి శేష్ హీరోగా నటించారు. నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి త్రిపిర్‌నేని నిర్మిస్తోన్న హిట్ 2 మూవీ డిసెంబర్ 2న విడుదలై భారీ విజయాన్ని అందుకొన్నది. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్‌లో అడివి శేష్ మాట్లాడుతూ..

యాంటీ ఫ్యాన్స్.. రాడ్ అంటూ
హిట్ 2 సినిమా రిలీజ్‌కు ముందు అన్నపూర్ణ స్టూడియోలో ఫ్రెండ్స్, ఫ్యామిలీకి షో వేశాం. సినిమా ముగిసిన తర్వాత ఎలా రియాక్ట్ అవుతారో అనే సందేహంలో ఉన్నాను. కానీ వాళ్లు సినిమా చూసిన తర్వాత వారి రియాక్షన్ చూసి.. చాలా హైలోకి వెళ్లాను. సాధారణంగా యాంటీ ఫ్యాన్స్.. రాడ్ అంటారు.. ఫ్యాన్స్ సూపర్ అంటారు. యూఎస్‌లో ప్రీమియర్స్ మొదలైన తర్వాత టకటకా అప్‌డేట్స్ ఇస్తున్నారు. కానీ లక్కీగా ఎలాంటి ట్విస్టులు రివీల్ చేయలేదు అని అడివి శేష్ అన్నారు.

మహేష్ బాబు అన్నిసార్లు కాల్ చేయడంతో
అమెరికాలో షోస్ నడుస్తున్నాయ్ కదా.. రివ్యూలు రావడానికి టైమ్ పడుతుందని కాస్త నిద్రపోయాను. కానీ అంతలోనే వరుసగా ఫోన్లు మోగుతూనే ఉన్నాయి. ఫోన్ చూసే సరికి మహేష్ బాబు సార్.. నుంచి మూడు మిస్ కాల్స్ ఉన్నాయి. మిస్డ్ కాల్ చూడగానే.. నాకు ఏమీ అర్ధం కాలేదు. వెంటనే ఫోన్ చేయగానే.. ఐయామ్ ఫ్రౌడ్ ఆఫ్ యూ అని మహేష్ అనగానే.. ఏమీ చెప్పాలో తెలియలేదు. ఆల్ ఓకేనా అన్నాను.. దాంతో ఫ్రౌడ్ ఆఫ్ యూ అనగానే.. కళ్లలో నీళ్లు తిరిగాయి. అక్కడ నా ఆనందం మొదలైంది అని అడివి శేష్ తెలిపారు.

మహేష్ బాబుకు చిన్న తమ్ముడిని..
మహేష్ బాబుతో మాట్లాడుతూ నేను ఎమోషనల్ అయ్యాను. మీ ఫ్యామిలీలో ఒకే సంవత్సరం ముగ్గురు దూరమయ్యారు. మీరు అనుభవించిన పరిస్థితి చాలా కష్టం. మీ చుట్టూ మీకు ఎంతో మంది ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఉన్నారు. కానీ మీ కోసం ఓ చిన్న తమ్ముడు ఉన్నాడని గుర్తుంచుకోండని అన్నాను అని అడివి శేష్ తెలిపారు.

నా సినిమాకు నేను ఆలస్యంగా
యూఎస్‌లో షోలు ముగిసిన తర్వాత హిట్ టాక్ వచ్చింది. ఉదయమే లేచి నేను ప్రసాద్ ఐమాక్స్‌కు వెళ్లాను. అక్కడ ట్రాఫిక్ జామ్ కావడంతో నా సినిమాకు నేనే ఆలస్యంగా వెళ్లాల్సి వచ్చింది. నా జీవితంలో నేను మరిచిపోలేని మెమొరీ. ఆ తర్వాత నా కెరీర్‌లో అతిపెద్ద బ్లాక్‌బస్టర్ అని తెలిసిపోయింది. రకరకాల ప్రశంసలతో తడిసిముద్దయ్యాను అని అడివి శేష్ అన్నారు.

మనశ్శాంతితో బ్లాక్‌బస్టర్ కొట్టాను..
నేను ఇప్పటి వరకు పనిచేసిన సినిమాల విషయానికి వస్తే.. చాలా నిజాయితీతో, స్నేహపూర్వకంగా ఉన్న బ్యానర్ ఇది. నానీ, ప్రశాంతి చూపించిన ప్రేమ మాటల్లో చెప్పలేను. చాలాసార్లు కొందరు బిత్తిరి బిత్తిరి నిర్మాతలతో పనిచేసి వేధింపులకు గురయ్యాను. అలాగని కొందరు మంచి నిర్మాతలు ఉన్నారు. సినిమా రిలీజ్‌కు ముందు టార్చర్ ఉండేది. మనశ్శాంతి కోల్పోయేవాడిని. కానీ ఫస్ట్ టైమ్.. మనశ్శాంతితో బ్లాక్‌బస్టర్ కొట్టడం ఇదే మొదటిసారి. గుడ్ ఫిల్మ్స్ ఆర్ లక్.. హిట్ ఫిల్మ్స్ ఆర్ మిరాకిల్. త్వరలోనే ఈ సినిమా మరికొన్ని రికార్డులను తిరగరాస్తాయి అని అడివి శేష్ తెలిపారు.