Ajith Kumar: నాలుగు గంటలు కూడా కష్టమే.. అరుదైన వ్యాధితో బాధపడుతున్న హీరో అజిత్

Ajith Kumar: తమిళ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరో అజిత్ కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సౌత్ మాత్రమే కాకుండా నార్త్‌లో కూడా ఫ్యాన్ బేస్ కలిగి ఉన్న అజిత్, తన సినిమాలతోనే కాదు, అద్భుతమైన యాక్షన్ సీన్స్‌తో కూడా అభిమానులను అలరిస్తూనే ఉన్నారు. వయసు పెరిగినా యంగ్ హీరోలకు పోటీగా సినిమాలు చేస్తూ, ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటున్నారు. సినిమాలకే కాకుండా మోటార్ స్పోర్ట్స్, బైక్ & కార్ రేసింగ్ పట్ల కూడా అజిత్‌కు అమితమైన ఇష్టం. రేసింగ్‌లో పలుమార్లు ప్రమాదాలకు గురైనా ఆయన వెనకడుగు వేయలేదు. రేసింగ్ పట్ల ఉన్న ప్యాషన్ వల్లే ఈ మధ్యకాలంలో కూడా పూర్తి ఉత్సాహంతో పోటీల్లో పాల్గొంటున్నారు.

అరుదైన వ్యాధితో అజిత్ పోరాటం
ఇటీవల ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అజిత్ కుమార్ తన ఆరోగ్య సమస్య గురించి బహిరంగంగా మాట్లాడారు. తాను స్లీపింగ్ డిసార్డర్ (నిద్రలేమి వ్యాధి)తో బాధపడుతున్నానని, దీని వల్ల రోజుకు గరిష్టంగా 4 గంటలపాటు మాత్రమే నిద్రపోగలుగుతున్నానని చెప్పారు. "నాకు సినిమాలు, కథలు అంటే ఇష్టం. కానీ నా లైఫ్‌స్టైల్‌ కారణంగా సినిమాలు లేదా సిరీస్‌లు చూసే సమయం దొరకదు. నేను కేవలం విమాన ప్రయాణాల్లోనే కొంత విశ్రాంతి తీసుకుంటాను. అయినా నిద్ర సమస్య వల్ల ఎక్కువలో ఎక్కువ 4 గంటలే నిద్రపోతాను. నన్ను నిద్రలోకి నెట్టడం చాలా కష్టం" అని అజిత్ అన్నారు. ఈ సమస్య కారణంగా తన హెల్త్, డైలీ రొటీన్పై తీవ్ర ప్రభావం చూపుతోందని, అనేక పనుల కంటే విశ్రాంతిని ప్రాధాన్యం ఇవ్వాల్సి వస్తోందని ఆయన వివరించారు.

Ajith Kumar Opens Up on Sleeping Disorder Racing Risks and Life Beyond Stardom

సోషల్ మీడియాపై అజిత్ అభిప్రాయం
సినిమా, స్పోర్ట్స్ ప్రమోషన్‌లో సోషల్ మీడియా పాత్ర గురించి అజిత్ మాట్లాడుతూ, అది సరైన చేతుల్లో ఉంటే గొప్ప సాధనమని చెప్పారు. "సోషల్ మీడియా ద్వారా భారతీయ ప్రేక్షకులు మోటర్‌స్పోర్ట్స్‌ను మరింతగా అర్థం చేసుకోవాలి. అంతర్జాతీయ స్థాయిలో కూడా మన సినిమాలు, సిరీస్‌లు వెళ్ళాలి. కొరియన్ కంటెంట్ ఎలా ప్రపంచాన్ని ఆకర్షించిందో, మనం కూడా ఆ దిశగా కృషి చేయాలి"అని అజిత్ సూచించారు.

రేసింగ్ రిస్కులు
తన రేసింగ్ కెరీర్‌లో ఎదుర్కొన్న ప్రమాదాల గురించి మాట్లాడుతూ అజిత్, అవి క్రీడలో సహజమని చెప్పారు.'ప్రతీ డ్రైవర్, ప్రతీ టీమ్ చెబుతుంది ప్రమాదాలు మోటార్‌స్పోర్ట్స్‌లో భాగమే. అవును, అవి భయంకరమే కానీ ఈ కార్లు ప్రత్యేకంగా అలాంటి సిట్యుయేషన్ల కోసం డిజైన్ అవుతాయి. డ్రైవర్ సేఫ్టీకి ప్రాధాన్యం ఇస్తారు. ప్రాణ నష్టం చాలా అరుదుగా జరుగుతుంది. కానీ కార్, డ్రైవర్ లిమిట్స్‌ని పుష్ చేస్తే ప్రమాదాలు తప్పవు 'అని అజిత్ వెల్లడించారు.

స్టార్‌డమ్ వెనుకున్న వాస్తవం
తమిళ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరో అజిత్ కుమార్ తన స్లీపింగ్ డిసార్డర్, హెల్త్ ఇష్యూస్ గురించి బహిరంగంగా చెప్పడం, స్టార్‌డమ్ వెనుక ఉన్న కష్టాలను అభిమానులు అర్థం చేసుకునేలా చేసింది. బయటకు హీరోలా కనిపించే అజిత్, అసలు జీవితంలో ఆరోగ్య సమస్యలతో పోరాడుతున్నాడనే విషయం అభిమానులను షాక్‌కు గురి చేస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X