For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Happy birthday Nagarjuna: ఒకే ఫ్రేమ్ లో అక్కినేని హీరోలు.. అఖిల్ లుక్ మామూలుగా లేదుగా..

  |

  కింగ్ గా నవ మన్మథుడిగా ప్రస్తుతం లేటు వయసులో కూడా తన వన్నెతరగని అందంతో దూసుకుపోతున్నారు అక్కినేని నాగార్జున. ప్రస్తుతం తన తనయులు ఇద్దరూ కూడా హీరోలుగా కొనసాగుతున్నప్పటికీ కూడా నాగార్జున మాత్రం రోజు రోజుకు తన వయసుని మరింతగా తగ్గించుకుంటున్నారు. నిత్యం ఎంతో యంగ్ గా కనపడే నాగార్జున నేటితరం యువకులకు ఒక చాలెంజ్ విసురుతున్నారని చెప్పవచ్చు. ఇక ఎలాంటి ఇంటర్వ్యూ ఇచ్చినా కూడా ఇండస్ట్రీలో ఎక్కువ కాలం నిలబడాలి అంటే ఎక్కువగా మన శరీరం మీద శ్రద్ద పెట్టాలని అంటుంటారు. ఇటీవల కెరీర్ పరంగా వరుసగా పరాజయాలతో సతమతం అవుతూ అభిమానులను కొంత నిరాశ పరిచిన నాగార్జున ప్రస్తుతం రెండు ఇంట్రెస్టింగ్ మూవీస్ తో ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని చూస్తున్నారు.

  వాటిలో ఒకటి ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లింగ్ మూవీ ది ఘోస్ట్ కాగా.. మరొకటి సోగ్గాడే చిన్ని నాయన మూవీకి కొనసాగింపుగా రూపొందుతున్న బంగార్రాజు మూవీ. ఇక ఘోస్ట్ మూవీలో కాజల్ హీరోయిన్ గా నటిస్తుండగా శరత్ మరార్, ఏషియన్ సునీల్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇక బంగార్రాజులో తనయుడు నాగచైనత్యతో కలిసి నటిస్తున్న నాగార్జున, దీనిని సొంతంగా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఇటీవల ది ఘోస్ట్ షూట్ ప్రారంభించి పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు. ఇక ప్రస్తుతం దానిని వేగవంతంగా పూర్తి చేస్తుండడంతో పాటు మరోవైపు రెండు రోజుల క్రితం తనయుడు నాగ చైతన్య తో కలిసి నటిస్తున్న బంగార్రాజు షూట్ లో కూడా పాల్గొంటున్నారు.

  Akhil akkineni latest look with akkineni nagarjuna and naga chaitanya

  ఇక నేడు నాగార్జున జన్మదినం కావడంతో పలువురు ప్రేక్షకాభిమానులు నాగ్ కి తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియ చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితం ఆయన తనయులు నాగ చైతన్య, అఖిల్ ఇద్దరూ కూడా ప్రత్యేకంగా తండ్రికి విషెస్ తెలియజేశారు. 'మీతో గడిపిన సమయం ఎంతో విలువైనది, మీరు చిరకాలం వర్ధిల్లాలి, రెండవ సారి మీతో కలిసి బంగార్రాజు మూవీలో చేస్తుండడం ఎంతో ఆనందంగా ఉంది అంటూ బంగార్రాజు మూవీ లోని నాగార్జున లేటెస్ట్ స్టిల్ ని నాగ చైతన్య పోస్ట్ చేసారు.

  'మీ నుండి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను, మీరే నాకు అన్నింటా ఆదర్శం, మీతో గడిపిన ప్రతి క్షణం నేను ఎప్పటికీ మర్చిపోలేను మీరు ఈ ఏడాది అంతా ఎంతో ఆనందంగా గడపాలి నాన్న' అంటూ అఖిల్ ట్వీట్ చేశాడు. అంతే కాకుండా నాగచైతన్య, నాగార్జున లతో కలిసి దిగిన లేటెస్ట్ పిక్ కు కూడా పోస్ట్ చేసారు. ఇక అఖిల్ ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఆ సినిమాకు సంబంధించిన లుక్ తోనే దర్శనమిచ్చిన అఖిల్ తప్పకుండా ఈసారి బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టేలా ఉన్నట్లు అర్ధమవుతోంది. ఎందుకంటే ఆ లుక్ కూడా చాలా భిన్నంగా ఉంది. మరి సినిమా ఏ స్థాయిలో వినాయన్ని అందుకుంటుందో చూడాలి.

  English summary
  Akhil akkineni latest look with akkineni nagarjuna and naga chaitanya.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X