కంటతడి పెట్టిన బాలకృష్ణ.. నన్ను తల్లిలా పెంచిన ఆమె దూరం కావడం అంటూ
నందమూరి కుటుంబంలో విషాద సంఘటన అందర్నీ కలిచి వేసింది. తమ కుటుంబానికి పెద్ద దిక్కుగా మారిన స్వర్గీయ ఎన్టీఆర్ పెద్ద కుమారుడు జయకృష్ణకు సతీ వియోగం జరగడం అందర్నీ విషాదంలోకి నెట్టింది. నందమూరి కుటుంబంలో చోటు చేసుకొన్న విషాద సంఘటన తెలియగానే కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, సన్నిహితులు వ్యక్తిగతంగాను, అలాగే సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలిపారు. అయితే అంత్యక్రియల సందర్భంగా బాలకృష్ణ భావోద్వేగానికి, ఉద్వేగానికి గురి కావడం అందర్నీ విషాదంలోకి నెట్టింది. బాలకృష్ణ కంటతడి వెనుక ఉన్న కారణం ఏమిటనే వివరాల్లోకి వెళితే..
నందమూరి బాలకృష్ణ పెద్దన్నయ్య జయకృష్ణ అంటే నందమూరి కుటుంబంలో అందరికి అభిమానం. కుటుంబంలో పెద్ద వదినగా అందరికి ఇష్టంగా ఉండే పద్మజ కొద్ది రోజులుగా శ్వాస సంబంధింత సమస్యతో బాధపడుతున్నారు. మంగళవారం ఆగస్టు 19వ తేదీ ఉదయం తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో హాస్పిటల్‌కు తరలించారు. అయితే హాస్పిటల్‌కు చేరుకొనేలోపే ఆమె తుది శ్వాస విడిచారని వైద్యులు ధృవీకరించారని తెలిపారు.

అయితే జయకృష్ణ సతీమణి పద్మజ విషయానికి వస్తే.. బాలకృష్ణ పెద్దబావ దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు స్వయానా సోదరి. పద్మజ అంటే నందమూరి కుటుంబ సభ్యులకు అమితమైన ఇష్టం. తనకు తల్లిలా ఆదరించిన ఆమె అంటే బాలకృష్ణకు ప్రత్యేకమైన అభిమానం. అలాంటి వ్యక్తి భౌతికంగా దూరం కావడంతో బాలకృష్ణ తట్టుకోలేకపోయారు. ఎలాంటి సందర్భంలోనైనా గంభీరంగా, ధైర్యంగా ఉండే బాలకృష్ణ ఒక్కసారిగా అంత్యక్రియల సందర్భంగా ఎమోషనల్ అయ్యారు.
అంత్యక్రియలు నిర్వహిస్తుండగా.. తన బావ దగ్గుబాటి వెంకటేశ్వరరావు పక్కనే ఉన్న బాలయ్య కంటతడి పెడుతూ కనిపించారు. భాలకృష్ణ ఉద్వేగానికి గురైన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. ఆ వీడియోను చూసిన అభిమానులు.. మా హీరోను అలా చూడలేం. మీరు మానసికంగా చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి అని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. మా హీరోను ఇలా చూడటం మొదటిసారి. ప్రేమాభిమానాలకు ఎంత విలువ ఇస్తాడో ఆయన పరిస్థితి చూస్తే అర్దం అవుతుంది అని నెటిజన్లు తమ పోస్టుల్లో పేర్కొన్నారు.
వదిన పద్మజ గురించి బాలకృష్ణ మాట్లాడుతూ.. మా నాన్న గారు సినిమా షూటింగులో బిజీగా చెన్నైలో ఉండేవారు. ఆ సమయంలో మా నాన్నగారిని అమ్మగారు చూసుకొనే వారు. ఆ సమయంలో మేమంత చిన్నవాళ్లం. మమ్మల్ని ఓ తల్లి మాదిరిగా పెంచారు. మా సంరక్షణ బాధ్యతలను హైదరాబాద్‌లో చూసుకొనే వారు. అలాంటి వ్యక్తి మాకు దూరం కావడం చాలా బాధాకరం.. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాం అని బాలకృష్ణ అన్నారు.
ఇదిలా ఉండగా, జయకృష్ణ సతీమణి పద్మజ మరణ వార్త తెలుసుకోగానే.. విజయవాడ నుంచి చంద్రబాబు నాయుడు సతీసమేతంగా హైదరాబాద్ చేరుకొన్నారు. అలాగే ఢిల్లీలో ఉన్న పురంధేశ్వరి, బాలయ్య కుటుంబ సభ్యులు జయకృష్ణ ఇంటికి చేరుకొన్నారు. బాలయ్య కూతురు తేజస్విని, బ్రహ్మణి ఇతర కుటుంబ సభ్యులు విషాదంలో పాలుపంచుకొన్నారు.
Can't see my hero like this. Stay strong Balayya 🥲💔#NandamuriBalakrishna pic.twitter.com/CrS3HMoZQQ
— NBK Cult (@iam_NBKCult) August 19, 2025


Click it and Unblock the Notifications











