For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Balakrishna Advertisement: కమర్షియల్ యాడ్‌లో బాలయ్య.. కెరీర్‌లోనే తొలిసారి.. ఆ డబ్బు ఏం చేస్తారంటే!

  |

  వయసుతో సంబంధం లేకుండా ఇప్పటికీ సరికొత్త ప్రయోగాలు చేస్తూ తనలోని ప్రత్యేకతను ఎప్పటికప్పుడు నిరూపించుకుంటూనే ఉన్నారు నటసింహా నందమూరి బాలకృష్ణ. దీనికితోడు గత ఏడాది భారీ విజయాన్ని అందుకున్న ఈ సీనియర్ హీరో.. మరింత ఉత్సాహంతో కనిపిస్తున్నారు. దీంతో మరింత జోష్‌తో సరికొత్త ప్రయోగాలు చేస్తూ ముందుకు వెళ్తూ ఫ్యాన్స్‌ను మరింత ఖుషీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే బాలయ్య తొలిసారి ఓ వ్యాపార ప్రకటనలో నటించినట్లు తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఇంతకీ ఆయన ఏ సంస్థకు చేశారు. ఆ వివరాలేంటో మీరే చూడండి!

   అఖండ హిట్‌తో దూకుడుగా

  అఖండ హిట్‌తో దూకుడుగా


  గత ఏడాది నందమూరి బాలకృష్ణ 'అఖండ' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. బోయపాటి శ్రీను రూపొందించిన ఈ ప్రతిష్టాత్మక సినిమా భారీ అంచనాలతో వచ్చి సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో బాలయ్య మరోసారి హిట్ ట్రాక్ ఎక్కారు. అంతేకాదు, ఈ చిత్రంతో కలెక్షన్ల పరంగానూ ఈ నందమూరి హీరో ఎన్నో రికార్డులను క్రియేట్ చేసి సత్తాను చాటుకున్నారు.

  పబ్లిక్ ప్లేస్‌లో రెచ్చిపోయిన శ్రీయ: అతడి నోట్లో నోరు పెట్టేసి మరీ!

  వీర సింహా రెడ్డిగా బాలయ్య

  వీర సింహా రెడ్డిగా బాలయ్య


  'అఖండ' తర్వాత నటసింహా బాలకృష్ణ మరింత జోష్‌తో కనిపిస్తున్నారు. దీంతో ఫ్యూచర్ ప్రాజెక్టులను సైతం లైన్‌లో పెట్టుకున్నారు. ఇందులో 'క్రాక్' మూవీ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో ప్రస్తుతం 'వీర సింహా రెడ్డి' అనే సినిమా చేస్తున్నారు. పల్నాడు ఫ్యాక్షన్ నేపథ్యంతో తెరకెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.

   అనిల్ రావిపూడితో సినిమా

  అనిల్ రావిపూడితో సినిమా

  నటసింహా నందమూరి బాలకృష్ణ టాలీవుడ్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడితో ప్రాజెక్టును కూడా లైన్‌లో పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. షైన్ స్క్రీన్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీశ్ పెద్ది ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దీనికి ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

  బాత్‌టబ్‌లో బట్టలు లేకుండా సమీరా రెడ్డి.. అబ్బా ఏం ట్విస్ట్ ఇచ్చింది గురూ!

   హోస్టుగానూ ఫిదా చేసేసి

  హోస్టుగానూ ఫిదా చేసేసి

  దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో ఉన్న బాలకృష్ణ ఏ షోనూ హోస్ట్ చేయలేదు. కానీ, 'Unstoppable with NBK' షోకు మాత్రం ఆయన అదిరిపోయే హోస్టింగ్ చేశారు. తొలి ప్రయత్నమే అయినా వచ్చిన గెస్టులతో పాటు ప్రేక్షకులను అలరించారు. దీంతో మొదటి సీజన్‌లోని ఎపిసోడ్స్ అన్నీ సూపర్ హిట్ అయ్యాయి. దీంతో ఇప్పుడు రెండో సీజన్ చేస్తున్నారు.

  కమర్షియల్ యాడ్‌ లేదుగా

  కమర్షియల్ యాడ్‌ లేదుగా

  సుదీర్ఘ కాలంగా టాలీవుడ్‌లో స్టార్ హీరోగా సత్తా చాటుతోన్న నటసింహా నందమూరి బాలకృష్ణ.. ఎన్నో రకాల ప్రయోగాలను చేస్తూ వచ్చారు. కానీ, ఎందుకనో అసలు వ్యాపార ప్రకటనల్లో మాత్రం నటించలేదు. కావాల్సినంత స్టార్‌డమ్, బ్రాండ్ వ్యాల్యూ ఉన్నా ఈ నందమూరి హీరో ఆ దిశగా అడుగులు వేయలేదు. దీనిపై మాత్రం ఆయన అభిమానులకు నిరాశగానే ఉండిపోయారు.

  బెడ్‌పై బ్రాతో దారుణంగా హీరోయిన్: ఈ అరాచకాన్ని చూశారంటే!

  కమర్షియల్ యాడ్‌కు ఓకే

  కమర్షియల్ యాడ్‌కు ఓకే


  ఈ మధ్య కాలంలో ఎన్నో ప్రయోగాలు చేస్తూ ముందుకు సాగిపోతోన్న నటసింహా నందమూరి బాలకృష్ణ.. దాదాపు 48 ఏళ్ల కెరీర్‌లో తొలిసారిగా ఓ కమర్షియల్ యాడ్‌లో నటించేందుకు ఒప్పుకున్నారని తెలిసింది. అంతేకాదు, ఇప్పటికే ఓ యంగ్ డైరెక్టర్ రూపకల్పనలో ఆ యాడ్‌లో నటించారని తెలిసింది. దీన్ని అతి త్వరలోనే విడుదల చేయబోతున్నారని సమాచారం.

  ఆ సంస్థకే.. డబ్బులు అలా

  ఆ సంస్థకే.. డబ్బులు అలా


  తాజాగా నందమూరి బాలకృష్ణ 'సాయి ప్రియ కన్‌స్ట్రక్షన్ లిమిటెడ్' అనే రియల్ ఎస్టేట్ సంస్థ కోసం చేసిన వ్యాపార ప్రకటనలో నటించారని తెలిసింది. దీని ద్వారా ఆయనకు లభించే డబ్బులను బసవ తారకం క్యాన్సర్ ఆస్పత్రికి ఇవ్వబోతున్నట్లు కూడా తెలిసింది. దీంతో ఇప్పుడీ న్యూస్ అటు సినీ వర్గాల్లో, ఇటు వ్యాపార వర్గాల్లో తెగ హాట్ టాపిక్ అయిపోతుంది.

  English summary
  Nandamuri Balakrishna Doing Several Projects at a Time. Now He Signs for First Ever Commercial Advertisement.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X