twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టెన్త్ క్లాస్ లోనే లవ్ లెటర్స్.. వారం వారం వంతులేసుకుని మరీ.. సీక్రెట్స్ బయటపెట్టిన చిరు స్నేహితుడు !

    |

    మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు టాలీవుడ్ లో టాప్ పొజిషన్ లో ఉన్నారు కానీ ఒకప్పుడు తనతో పాటు సైకిల్ మీదే తిరిగేవాడు అంటున్నారు ఆయన స్నేహితుడు డాక్టర్ సత్య ప్రసాద్. ఎవరు ఈయన అనుకుంటున్నారా ? ఆయన మరెవరో కాదు చిరంజీవితో పాఠశాల రోజుల నుంచి కాలేజీ వరకు కలిసి చదువుకున్న స్నేహితుడు.

    మొగల్తూరుకు చెందిన ఆయన డాక్టర్ విద్యనభ్యసించి ప్రస్తుతానికి భీమవరంలో ఒక హాస్పిటల్ నడుపుతున్నారు. తనకు ఉన్న ఏకైక స్నేహితుడు సత్యప్రసాద్ అని ఒకానొక సందర్భంలో చిరంజీవి చెప్పుకొచ్చారు. తాజాగా తమ స్కూల్ కాలేజీ రోజుల గురించి సత్య ప్రసాద్ ఒక ఇంటర్వ్యూలో కొన్ని వివరాలు వెల్లడించారు. ఆ వివరాలు మీకోసం..

    మొగల్తూరుతో అనుబంధం

    మొగల్తూరుతో అనుబంధం

    మెగాస్టార్ చిరంజీవి తండ్రి ఉద్యోగరీత్యా అనేక ప్రాంతాల్లో తిరగాల్సి వచ్చేది. అందుకే ఆయనను అమ్మమ్మ గారి ఊరు మొగల్తూరులో ఉంచి చదివించేవారు. అందులో భాగంగా చిరంజీవి ఒంగోలులో 6,8,9 తరగతుల చదవగా మొగల్తూరులో 7, 10 తరగతులు చదివారు. మధ్యలో ఇంటర్మీడియట్ కోసం మళ్ళీ ఒంగోలు వెళ్లారు. అది పూర్తయ్యాక డిగ్రీ మాత్రం నరసాపురంలోని శ్రీ వై ఎన్ కళాశాలలో చదివారు. తండ్రి ఉద్యోగ రీత్యా అనేక ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ అవుతూ ఉన్న కారణంగా చిరంజీవి ఎక్కువగా మొగల్తూరు లోని అమ్మమ్మ గారి ఇంటి వద్ద ఉండేవారు. దీంతో ఆయనకు ఆ ప్రాంతంతోనే ఎక్కువ అనుబంధం ఉండేదని సత్యప్రసాద్ చెప్పుకొచ్చారు.

    బేబీ టీచర్ మాటతో ఫ్రెండ్షిప్

    బేబీ టీచర్ మాటతో ఫ్రెండ్షిప్

    చిరంజీవిని ఏడవ తరగతిలో మొగల్తూరు స్కూల్లో చేర్చిన సమయంలో బేబీ అనే టీచర్ శంకర్ బాబును(చిరంజీవిని అప్పట్లో అలానే పిలిచేవారు) తీసుకువెళ్లి సత్యప్రసాద్ పక్కన కూర్చో పెట్టారు. కూర్చోబెట్టి సత్యప్రసాద్ ఇక నుంచి శంకర్ బాబు నీ స్నేహితుడు అని చెప్పారట. అలా ఏడవ తరగతి లో మొదలైన మా ప్రయాణం ఇప్పటికీ స్నేహితులుగా కొనసాగుతూనే ఉందని ఆయన చెప్పుకొచ్చారు. దానికి తగ్గట్టు సత్యప్రసాద్ అక్కయ్యలు చిరంజీవి పిన్ని నాగమణి అనే ఆవిడ స్నేహితురాళ్ళు కావడంతో ఈ రెండు కుటుంబాలు మరింత దగ్గరయ్యాయి. చిరంజీవి తండ్రి వెంకట్రావుకి కూడా సత్య ప్రసాద్ అంటే చాలా ఇష్టమట. చిన్నప్పుడు చిరంజీవికి ఏవైతే తెచ్చేవారో సత్యప్రసాద్ కూడా అవే తీసుకువచ్చారని ఆయన వెల్లడించారు.

    అప్పట్లోనే ప్రేమ లేఖలు..

    అప్పట్లోనే ప్రేమ లేఖలు..

    ఇక చిరంజీవి కి వచ్చిన ప్రేమ లేఖల గురించి ఆయన కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. కాలేజీలో చదివే సమయంలోనే కాక పదో తరగతిలోనే చిరంజీవికి ప్రేమలేఖలు వచ్చేవట. ఆ ప్రేమలేఖలను చిరంజీవి సత్యప్రసాద్ ఇద్దరూ కలిసి చదివి నవ్వుకునేవారట. కానీ ప్రేమ లేఖలు వచ్చినా సరే ఎప్పుడూ చిరంజీవి ఆడపిల్లలకు వద్దకు వెళ్లి ఇలా ఎందుకు రాశారు అని అడిగిన సందర్భం లేదట. అలా అడిగితే సున్నిత మనస్కులు అయిన ఆ ఆడపిల్లలు బాధ పడతారు అని ఆ వయసులోనే చిరంజీవి గొప్పగా ఆలోచించేవారు అని సత్యప్రసాద్ పేర్కొన్నారు.

    Recommended Video

    Potti Veeraiah ఇక లేరు | అప్పట్లో శోభన్ బాబు సలహాతో..!! || Filmibeat Telugu
    వారం వారం వంతులు వేసుకుని

    వారం వారం వంతులు వేసుకుని

    ఇక కాలేజీకి వెళ్ళే రోజుల్లో మొగల్తూరు నుంచి నరసాపురం సైకిల్ మీద వెళ్లే వాళ్ళమని, కొన్ని రోజుల పాటు ఇద్దరూ చెరో సైకిల్ మీద వెళ్లి వస్తుంటే ఒక రోజు చిరంజీవి ఒక ఉపాయం చెప్పారట. ఇలా రెండు సైకిళ్ళు వేసుకుని వెళ్ళడం వృధా అని ఒక వారం ఒక సైకిల్ మీద మరో వారం మరొక సైకిల్ మీద వెళ్లాలని తీర్మానం చేశారట. దానికి ఉన్న షరతు ఏమిటంటే ఎవరి సైకిల్ మీద వెళుతుంటే వాళ్లు సైకిల్ తొక్కే పనిలేదు వెనక కూర్చోవాలి, సైకిల్ లేని వ్యక్తి సైకిల్ తొక్కాలి అన్నమాట. అలా నిబంధనలు, షరతులు పెట్టుకుని సరదాగా ఇద్దరు మాటలు చెప్పుకుంటూ కాలేజీకి వెళ్ళే వాళ్ళం అని ఆయన చెప్పుకొచ్చారు.

    English summary
    Megastar Chiranjeevi's close friend Dr. Satya Prasad shares his bond with chiranjeevi. He revealed chiranjeevi used to get love letters even in his class X days. He shares some more information about their college days also.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X