twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    GodFather మూవీ నిశ్శబ్ద విస్పోటనం.. గాడ్‌ఫాదర్‌ కు ప్రధాన కారణం రాంచరణ్.. చిరంజీవి ఎమోషనల్

    |

    మెగాస్టార్ చిరంజీవి, సల్మాన్ ఖాన్ నటించిన గాడ్ ఫాదర్ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ అనంతపురంలోని ఆర్ట్స్ కాలేజీలో జరిగింది. ఈ వేడుకలో చిరంజీవి ఎమోషనల్‌గా మాట్లాడారు. ఈవెంట్ జరుగుతున్న సమయంలో భారీ వర్షం కురిసింది. వర్షాన్ని లెక్క చేయకుండా చిరంజీవి మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. అనంతపూర్‌లో బ్యూటీఫుల్ ఈవెనింగ్. నేను ఎప్పుడు రాయలసీమకు వచ్చినా నేల తడుస్తుంది. ఈ రోజు చాలా ఆశ్చర్యంగా ఉంది. నేను ప్రజారాజ్యం పార్టీ పెట్టి పులివెందులలో ప్రచారం చేసినప్పుడు వర్షం పడింది. అలాగే ఇంద్ర సినిమా షూటింగ్ చేసినప్పుడు కూడా వర్షం కురిసింది. ఈ రోజు కూడా వర్షం పడటం శుభపరిణామం అనిపిస్తున్నది. థ్యాంక్యూ వరుణదేవుడా అని చిరంజీవి తన ప్రసంగాన్ని ప్రారంభించారు. తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ..

    లూసీఫర్ రీమేక్ మీరే చేయాలని

    లూసీఫర్ రీమేక్ మీరే చేయాలని

    లూసిఫర్ సినిమా మలయాళంలో రిలీజ్ అయింది. ఈ సినిమాను గాడ్‌ఫాదర్‌గా చేయడానికి ప్రధాన కారణం రాంచరణ్. ఈ సినిమా చూసిన తర్వాత బాగుంటుందని అనుకొన్నాను. ఈ సినిమాను తీయడానికి ఎవరు ధైర్యం చేస్తారని అనుకొన్నాను. ఆ సమయంలో రాంచరణ్ ముందుకు వచ్చి.. ఈ సినిమా మీరు చేయాలి. ఈ టైమ్‌లో మీరు చేయాల్సిన సినిమా అని రాంచరణ్ అన్నాడు. అంతేకాకుండా ఈ సినిమాను నేను నిర్మిస్తాను అని చరణ్ ముందుకు వచ్చాడు. ఈ సినిమాకు దర్శకుడు ఎవరని ఆలోచిస్తుండగా.. ధ్రువను తమిళంలో చేసిన మోహన్ రాజా అయితే బాగుంటుదని రాంచరణ్ చెప్పాడు. అలా గాడ్ ఫాదర్ సినిమాకు మోహన్ రాజకు అప్పజెప్పడం జరిగింది.

    అభిమానులంతా గర్వపడేలా గాడ్‌ఫాదర్

    అభిమానులంతా గర్వపడేలా గాడ్‌ఫాదర్


    గాడ్ ఫాదర్ సినిమాను మనమంతా గర్వపడేలా తీశాడు మోహన్ రాజా. ఈ సినిమా కోసం ఏడాదిపాటు సత్యానంద్, నేను అందరం కలిసి తయారు చేశాం. పక్కాగా సినిమా స్క్రీన్ ప్లే తయారు చేశాడు. ఈ సినిమా ప్రారంభానికి ముందు ఈ సినిమాలో కీలక పాత్రకు, నా సమానంగా ఉండే పాత్ర కోసం ఎవరైతే బాగుంటుందని అనుకొంటుంటే.. సల్మాన్ ఖాన్ అయితే బాగుంటుందని డైరెక్టర్ మోహన్ రాజా పెద్ద కోరిక కోరాడు.

    నయనతారను ఒప్పించింది ఆయనే..

    నయనతారను ఒప్పించింది ఆయనే..


    ఇక గాడ్‌ఫాదర్ సినిమాలో కీలకమైన పాత్ర కోసం ఎవరైతే బాగుంటుందని అనుకొంటుంటే.. నయనతార పాత్ర అయితే బాగుంటుందని డైరెక్టర్ మోహన్ రాజా మళ్లీ పెద్ద కోరిక కోరాడు. అయితే లేడి సూపర్ స్టార్ నయనతారను మోహన్ రాజా ఒప్పించి ఈ సినిమాలో పవర్‌ఫుల్ రోల్‌ను చేసేలా మెప్పించాడు. ఈ సినిమాలో మురళీశర్మ, సముద్రఖని అద్బుతమైన పాత్రలను చేశాడు. సునీల్, గెటప్ శ్రీను, షఫీ, బ్రహ్మాజీ లాంటి నటులు మంచిగా నటించారు.

    సత్యదేవ్‌పై చిరు ప్రశంసల వర్షం

    సత్యదేవ్‌పై చిరు ప్రశంసల వర్షం


    ఇక గాడ్ ఫాదర్ సినిమాలో నన్ను ఎదిరించే పాత్రను సత్యదేవ్ చేశాడు. జయదేవ్ పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. సత్యదేవ్ ఈ పాత్రకు పూర్తిగా న్యాయం చేస్తాడని నమ్మాను. ఇటీవల ఆయన నటించిన సినిమాలు చూశాను. ప్రతీ సినిమాలో వైవిధ్యం కనిపించింది. తెలుగులో ఉన్న మంచి నటుల్లో ఒకరు. గాడ్ ఫాదర్ తర్వాత పేపర్లు, మీడియా కూడా రాస్తుంది. అతడిలోని టాలెంట్‌ను నేను గుర్తించినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఆ పాత్రను మరో రేంజ్‌కు తీసుకెళ్తాడు. రానున్న కాలంలో సూపర్ స్టార్ అయ్యే అవకాశం ఉంది అని చిరంజీవి ప్రశంసల వర్షం కురిపించారు.

    పూరీ జగన్నాథ్ యూట్యూబర్‌గా

    పూరీ జగన్నాథ్ యూట్యూబర్‌గా


    గాడ్‌ఫాదర్ సినిమా. కథలోని సంఘటనలను చక్కగా విశ్లేషించే ఓ పాత్రకు ఎవరు బాగుంటారని అనుకొంటుండగా.. పూరీ జగన్నాథ్ అయితే బాగుంటారని డైరెక్టర్ మోహన్ రాజా చెప్పారు. ఈ సినిమాలో య్యూటూబర్‌గా, జర్నలిస్టుగా నటించాడు. ఈ మధ్యకాలంలో పూరీ జగన్నాథ్ ప్రాడ్ కాస్ట్, వీడియోలు చూశాను. నాకు అవి బాగా నచ్చాయి. దాంతో పూరీకి ఫోన్ చేయగానే.. ఆ పాత్ర చేస్తానని అన్నాడు. ఆ తర్వాత ఆయన అద్బుతంగా నటించడంతో సినిమా చాలా ఫ్రెష్‌గా కనిపించింది అని చిరంజీవి అన్నారు.

    అనంతపురంలో ఎందుకంటే?

    అనంతపురంలో ఎందుకంటే?


    నేను అనంతపురం సినిమాకు వచ్చి చాలా రోజులైంది. ఈ సినిమా వేడుకను ఇక్కడే జరుపకోవాలని చిత్ర యూనిట్ అనుకొన్నాం. అందుకే గాడ్ ఫాదర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఇక్కడే చేసుకోవాలని అనుకొన్నాం. మీ ఆదరణ అలలుగా.. తెలుగు వాళ్లు ఎక్కడున్నా ఇలాంటి అనుభూతి ఉంటుంది. ఈ సినిమాకు మీ ఆశీస్సులు అందిస్తారని అనుకొంటున్నాం. విజయదశమి మీ జీవితంలో సుఖసంతోషాలు నింపాలని కోరుకొంటున్నాను అని చిరంజీవి అన్నారు.

    నాగార్జున ఘోస్ట్‌ను విజయవంతం చేయాలని

    నాగార్జున ఘోస్ట్‌ను విజయవంతం చేయాలని


    గాడ్ ఫాదర్ రిలీజ్ రోజున అంటే..అక్టోబర్ 5వ తేదీన నా మిత్రుడు నాగార్జున నటించిన ది ఘోస్ట్ సినిమా రిలీజ్ అవుతున్నది. అదే రోజున బెల్లంకొండ గణేష్ నటించిన స్వాతిముత్యం సినిమా రిలీజ్ అవుతున్నది. పెద్దా, చిన్న సినిమాలు విజయవంతమైతే తెలుగు పరిశ్రమ పచ్చగా ఉంటుంది అని చిరంజీవి అన్నారు.

    Read more about: chiranjeevi godfather
    English summary
    godfather pre release event photos: Chiranjeevi's GodFather movie is coming on October 5th. Part of the promotion, Pre release event is organised at Ananthapur's ANP Arts College Ground. Here is the Chiranjeevi's emotional speech.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X