For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Waltair Veerayyaలో చిరంజీవి హై రిస్కీ షాట్.. డూప్ కి నో చెప్పి మరి తుపానులో గంటలపాటు!

  |

  మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇటీవలే గాడ్ ఫాదర్ సినిమాతో మంచి టాక్ అందుకున్న ఆయన మరో చిత్రంతో అభిమానులను, ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నారు. బాబీ అలియాస్ కేఎస్ రవీంద్ర దర్శకత్వంలో మెగాస్టార్ నటించిన చిత్రం వాల్తేరు వీరయ్య. ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ ఏసీపీ విక్రమ్ గా అలరించనున్న విషయం తెలిసిందే.

  టాలీవుడ్ బాడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ మూవీలో చిరంజీవి హై రిస్కీ షాట్ చేశారట. డూప్ తో చేద్దామని చెప్పిన వినకుండా గంటలపాటు ఆ సీన్ కోసం కష్టపడ్డారట మెగాస్టార్. ఆ సీన్ ఎందుకోసమనే వివరాల్లోకి వెళితే..

  బడా నిర్మాణ సంస్థతో..

  బడా నిర్మాణ సంస్థతో..

  మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో ఫుల్ ఫామ్ లో ఉన్నారు. ఈ వయులోను యంగ్ ఏజ్ హీరోలకు సరిసమానంగా పోటీ ఇస్తూ జోష్ చూపిస్తున్నారు. ఆచార్యతో డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న వెంటనే గాడ్ ఫాదర్ సినిమాతో కమ్ బ్యాక్ హిట్ కొట్టారు.

  ఇప్పుడు త్వరలో వాల్తేరు వీరయ్యగా రాబోతున్నారు మెగాస్టార్ చిరంజీవి. టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో రూపొందుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

  చిరంజీవితోపాటు రవితేజ..

  చిరంజీవితోపాటు రవితేజ..

  వాల్తేరు వీరయ్యగా మరోసారి మాస్ అవతారంతో మెస్మరైజ్ చేసేందుకు మెగాస్టార్ చిరు రెడీగా ఉన్నారు. ఈ సినిమాలో చిరంజీవితో పాటు మాస్ మహారాజా రవితేజ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. సుమారు 22 ఏళ్ల తర్వాత వీరిద్దరు కలిసి నటించిన ఈ వాల్తేరు వీరయ్య మూవీ సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 13న ప్రేక్షకులు ముందుకు రానుంది. బాబీ అలియాస్ కేఎస్ రవీంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై అభిమానులు భారీగానే హోప్స్ పెట్టుకున్నారు.

  పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ తో..

  పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ తో..

  అభిమానుల అంచనాలకు తగినట్లుగానే వాల్తేరు వీరయ్యను పక్కా మాస్, కమర్షియల్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కినట్లు తెలుస్తోంది. అందుకోసం రిస్కీ షాట్స్ కూడా చేసేందుకు చిరంజీవి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ సమస్యలపై రియాక్ట్ అయి తనవంతుగా సహాయం చేసే చిరు అనేక చిత్రాలకు సపోర్టింగ్ గా తన వాయిస్ ను ఇస్తుంటారు. ఇక చిరంజీవి అదిరిపోయే డ్యాన్స్ లకు, క్రేజీ ఫైట్స్ కు పెట్టింది పేరు.

  ఫెస్టివల్ ట్రీట్..

  ఫెస్టివల్ ట్రీట్..

  ఇప్పుడు వాల్తేరు వీరయ్యలో మరోసారి తన స్టెప్పులు, ఫైట్స్ తో అభిమానులకు సంక్రాంతి పండుగ ట్రీట్ ఇవ్వనున్నారు చిరు. అందుకోసం డూప్ లేకుండా రిస్కీ షాట్స్ చేసేందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ దాదాపుగా పూర్తి అయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నట్లు సమాచారం. తాజాగా ఈ సినిమా ఇంట్రడక్షన్ సీన్ గురించి చెబుతూ మెగాస్టార్ చిరంజీవిపై ప్రశంసలు కురిపించారు డైరెక్టర్ బాబీ.

  రిస్క్ ఉన్న కూడా..

  రిస్క్ ఉన్న కూడా..

  వాల్తేరు వీరయ్య సినిమాలో చిరంజీవి ఇంట్రడక్షన్ సన్నివేశాన్ని తుపానులో చాలా గ్రాండ్ గా ప్లాన్ చేశారట డైరెక్టర్ బాబీ. బోరున వర్షం, ఆకాశంలో మెరుపులతోపాటు సముద్రంలోని అలల మధ్య చిరు నాటు పడవలో ఎంట్రీ ఇవ్వనున్నాడట. ఈ సీన్ ను డూప్ తో తీయాలని డైరెక్టర్ బాబీ అనుకున్నారట. కానీ చిరంజీవి మాత్రం అందుకు అంగీకరించకుండా.. రిస్క్ ఉన్న కూడా షాట్ కంప్లీట్ చేశారని బాబీ చెప్పుకొచ్చారు.

  గూస్ బంప్స్ పక్కా..

  గూస్ బంప్స్ పక్కా..

  చిరంజీవి చేసిన షాట్ గురించి డైరెక్టర్ బాబీ మాట్లాడుతూ "చిరంజీవి ఇంట్రడక్షన్ సీన్ ను మేము తుపానులో ప్లాన్ చేశాం. ఆ సన్నివేశాన్ని డూప్ తో తీయాలని అనుకున్నాం. కానీ అందుకు చిరంజీవి ఒప్పుకోలేదు. అలల తాకిడి కారణంగా యూనిట్ మెంబర్స్ అంతా తడిచిపోయారు. మళ్లీ ఇంకా వర్షం ఉండటంతో అందరం చలికి వణుకుతున్నాం.

  అప్పుడు కూడా చిరంజీవి కారవాన్ లోకి వెళ్లకుండా షాట్ ముగిసే వరకు అలానే తడిచిన బట్టలతో లొకేషన్ లో ఉండిపోయారు. అందుకే ఆయన మెగాస్టార్ అయ్యారు. ఆ సన్నివేశాన్ని థియేటర్ లో చూస్తే ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ పక్కా" అని తెలిపారు.

  English summary
  Waltair Veerayya Movie Director Reveals About Megastar Chiranjeevi High Risk Shot In Introduction Scene Without Dupe
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X