Unstoppable మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్ ఎందుకు రాలేదు? బాలకృష్ణ రెమ్యునరేషన్ ఎంతంటే?

నట సింహ నందమూరి బాలకృష్ణ అఖండ చిత్రంతోనే కాకుండా Unstoppable టాక్ షోతో దేశవ్యాప్తంగా మరింత పాపులారిటిని సంపాదించారు. ఆహా ఓటీటీలో ఆయన హోస్ట్‌గా వ్యవహరిస్తున్న టాక్ షో టాప్ రేటింగ్‌ను సొంతం చేసుకొన్నది. అయితే బాలయ్య బాబు హోస్ట్‌గా Unstoppable టాక్ షో తొలి సీజన్‌ను ఘనంగా ముగించుకోబోతున్నది. ఈ ఈ టాక్ షోకు రచయితగా వ్యవహరిస్తున్న బీవీఎస్ రవి ఇటీవల పలు యూట్యూబ్ ఛానెల్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ఆయన చెప్పిన విషయాలు ఏమిటంటే..

 దేశవ్యాప్తంగా టాప్ రేటింగ్‌తో

దేశవ్యాప్తంగా టాప్ రేటింగ్‌తో

తెలుగు వినోద రంగంలో విభిన్నమైన కంటెంట్‌తో ముందుకెళ్తున్న ఆహా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ఎవరూ ఊహించని విధంగా నందమూరి బాలకృష్ణతో టాక్ షోను ప్రారంభిస్తున్నామని ప్రకటన చేయగానే అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. బాలకృష్ణ ప్రారంభించిన టాక్‌షోకు మంచి రెస్పాన్స్ లభించింది. దేశవ్యాప్తంగా టాప్ టీఆర్పీని సాధించింది. జాతీయ ఛానెల్‌లో టాప్ రేటింగ్ సాధిస్తున్న ది కపిల్ శర్మ షోతో పోటీ పడింది.

 మహేష్ బాబుతో చివరి ఎపిసోడ్

మహేష్ బాబుతో చివరి ఎపిసోడ్

Unstoppable Show టాప్ రేటింగ్‌తో దూసుకెళ్తూ పది ఎపిసోడ్స్ పూర్తి చేసుకొన్నది. ఈ షో చివరి ఎపిసోడ్‌లో సూపర్ స్టార్ మహేష్ బాబు అతిథిగా రాబోతున్నారు. ఈ ఎపిసోడ్ ఫిబ్రవరి 4వ తేదీన స్ట్రీమింగ్ కానున్నది. ఇప్పటికే ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో రికార్డు స్థాయిలో నాలుగు మిలియన్లకుపైగా వ్యూస్ సాధించింది. దాంతో సీజన్ 1 చివరి ఎపిసోడ్‌లో బాలయ్య, మహేష్ బాబు మధ్య జరిగిన సంభాషణ గురించి ఎప్పుడెప్పుడూ చూద్దామా అని ఎదురు చూస్తున్నారు.

వెంకటేష్ ఎందుకు రాలేదంటే?

వెంకటేష్ ఎందుకు రాలేదంటే?

Unstoppable Show గురించిన తెర వెనుక విషయాలను వెల్లడిస్తూ.. చిరంజీవిని, వెంకటేష్‌ను తాము ఆహ్వానించాం. కొందరికి వీలు అయిది. మరికొందరికి వీలు కాలేదు. కానీ బాలకృష్ణ గాయం కారణంగా వెంకటేష్ షోకు రాలేకపోయారు. ఆ తర్వాత వెంకటేష్ వెబ్ సిరీస్‌లో నటించడం కారణంగా మళ్లీ షోకు రావడానికి వీలు కాలేదు. వాస్తవానికి రానా, వెంకటేష్ కలిసి ఫోలో పాల్గొనాలి. వీలు కాకపోవడం వల్ల వెంకటేష్ మరోసారి ఈ షోలో పాల్గొనే అవకాశం ఉంది అని బీవీఎస్ రవి తెలిపారు.

 సీజన్ 2 ఎపిసోడ్‌లో చిరంజీవి

సీజన్ 2 ఎపిసోడ్‌లో చిరంజీవి


ఇక బాలయ్య షోలో చిరంజీవి కూడా పాల్గొనడానికి చాలా ఆసక్తిగా ఉన్నారు. కాకపోతే ఆచార్య డబ్బింగ్, ప్యాచ్ వర్క్, భోళా శంకరుడు, గాడ్‌ఫాదర్ సినిమా షూటింగులతో బిజీగా ఉన్నారు. అన్నీ కుదిరితే.. సీజన్ 2లో ఫస్ట్ ఎపిపోడ్‌లో చిరంజీవి పాల్గొనే అవకాశం ఉంది. ఇందుకోసం భారీగా కసరత్తు జరుగుతున్నది. వారిద్దరి మధ్య సంభాషణ కోసం ప్రశ్నల గురించి రీసెర్చ్ చేస్తున్నాం అని బీవీఎస్ రవి అన్నారు.

 బాలయ్య రెమ్యునరేషన్ ఎంతంటే?

బాలయ్య రెమ్యునరేషన్ ఎంతంటే?

అలాగే Unstoppable Show లో పాల్గొన్నందుకు బాలకృష్ణకు ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారనే విషయం నాకు తెలియదు. కానీ బాలయ్యతో షో చేసినందుకు ఆహాకు మంచి బెనిఫిట్ లభించింది. రేటింగ్ పెరగడంతోపాటు.. భారీగా సబ్‌
స్క్రిప్షన్ వచ్చాయి. ఈ షోతో ఆహాలోని ఇతర కంటెంట్‌, సినిమాల వ్యూస్ భారీగా పెరిగాయి. బాలయ్యతో మంచి మ్యాజిక్ వర్కవుట్ అయింది అని బీవీఎస్ రవి పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X