twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప‌థ‌కాలు అద్భుతం.. ప్రతిష్ఠ మరింత పెరుగాలి.. మెగాస్టార్ చిరంజీవి

    |

    మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ఇటీవ‌లే కొత్త ప‌థ‌కాల్ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఆ మేర‌కు మా అధ్య‌క్ష‌కార్య‌ద‌ర్శ‌కులు శివాజీ రాజా, సీనియ‌ర్ న‌రేష్ ఈ ప‌థ‌కాల వివ‌రాల్ని అందించారు. మా డైరీ ఆవిష్క‌ర‌ణ‌లో సూప‌ర్‌స్టార్ కృష్ణ‌- విజ‌య నిర్మ‌ల, రెబ‌ల్‌స్టార్ కృష్ణంరాజు- శ్యామ‌లా దేవి దంప‌తులు ఈ ప‌థ‌కాల్ని ప్ర‌శంసించి త‌మ‌వంతు సాయాన్ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఈ ప‌థ‌కాల‌కు ప్ర‌త్యేకించి మా అసోసియేష‌న్ విడివిడిగా నామ‌క‌ర‌ణం చేసింది. వాటికి సంబంధించిన వివరాలు ఇవే..

    మా అసోసియేషన్ చేపట్టిన పథకాలు

    మా అసోసియేషన్ చేపట్టిన పథకాలు

    మా అసోసియేషన్ చేపట్టిన ప‌థ‌కాలు అద్భుతంగా ఉన్నాయి. మూవీ ఆర్టిస్టుల సంఘం మంచి ప‌నులు చేసేందుకు ప్ర‌తిసారీ ముందుకొస్తున్నది అని మెగాస్టార్ చిరంజీవి అభినందించారు. మా అధ్య‌క్షుడు శివాజీరాజా, ఇత‌ర స‌భ్యుల కృషిని ప్ర‌త్యేకంగా అభినందించారు. మా అసోసియేషన్ ప్రతిష్ఠ మరింత పెరుగాలని ఆకాంక్షించారు.

    మీ చేతుల్లో సినీ తారల ప్రతిష్ఠ.. ఉత్తమ నటీనటులను, దర్శకులకు ఓటేయండి..మీ చేతుల్లో సినీ తారల ప్రతిష్ఠ.. ఉత్తమ నటీనటులను, దర్శకులకు ఓటేయండి..

    చిరంజీవి కల్యాణ లక్ష్మి

    చిరంజీవి కల్యాణ లక్ష్మి

    2019 జ‌న‌వ‌రి -1 నుంచి `మా అసోసియేష‌న్‌` త‌మ మెంబ‌ర్స్ కోసం ప్ర‌వేశ‌పెట్టిన ప‌థ‌కాల వివ‌రాలివి. `డా.చిరంజీవి మా క‌ళ్యాణ ల‌క్ష్మి ప‌థ‌కం` పేరుతో రూ.1,16,000 మొత్తాన్ని పెళ్లి చేసుకునే ఆడ‌పిల్ల‌కు అంద‌జేస్తారు. `డా.ఏఎన్నార్ మా విద్యా ప‌థ‌కం` పేరుతో 80శాతం స్కోర్ చేసిన పిల్ల‌ల‌కు రూ.1,00,000 అంద‌జేస్తారు.

    డా. విజయ నిర్మల ఫించన్

    డా. విజయ నిర్మల ఫించన్

    డా. విజ‌య‌నిర్మ‌ల మా చేయూత ప‌థ‌కం పేరుతో వృద్ధుల‌కు నెల‌వారీ ఫించ‌ను రూ.5000 చొప్పున అందిస్తారు. ఇదివ‌ర‌కూ రూ.2000గా ఉన్న ఫించ‌నును రూ.5000కు పెంచారు. 35 మంది స‌భ్యుల‌కు ఈ ఫించ‌ను అంద‌నుంది.

     హీరో శ్రీకాంత్ ఎల్ఐసీ పథకం

    హీరో శ్రీకాంత్ ఎల్ఐసీ పథకం

    `శ్రీ‌కాంత్ మా మాన‌వ‌తా ఎల్ఐసీ ప‌థ‌కం` పేరుతో రూ.3,00,000 ఇన్సూరెన్స్ స‌దుపాయం మెంబ‌ర్స్ కి క‌ల‌గ‌నుంది. ఇలాంటి ఉధాత్త‌మైన‌ ప‌థ‌కాలు భార‌త‌దేశంలోనే వేరొక సినీప‌రిశ్రమ‌లో ఎక్క‌డా అమ‌లు చేయ‌లేదని పరిశ్రమ ప్రముఖులు ప్రశంసలు కురిపించడం విశేషం.

    English summary
    Megastar Chiranjeevi appreciated the Movie artists association schemes which started on 2019 January 1st. He said, MAA schemes are very good. MAA team doing fantastic job.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X