For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఇద్దరం దొంగ నా కొడుకులం.. రవితేజతో చిరంజీవి షాకింగ్ కామెంట్స్.. అసలేం జరిగిందంటే?

  |

  మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజ్ రవితేజ, అందాల భామ శృతిహాసన్ కాంబినేషన్‌లో వచ్చిన వాల్తేరు వీరయ్య చిత్రం బాక్సాఫీస్ వద్ద మోత మోగిస్తున్నది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో రూపొందిన ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహించారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకు హైలెట్‌గా మారింది. ఈ చిత్రం ఘన విజయం వైపు దూసుకెళ్తున్న నేపథ్యంలో మెగా మాస్ బ్లాక్ బస్టర్ అనే టైటిల్‌తో హైదరాబాద్‌లో చిత్ర యూనిట్ థ్యాంక్యూ మీట్ నిర్వహించింది. ఈ వేడుకకు చిరంజీవి, రవితేజ, దేవీ శ్రీ ప్రసాద్, బాబీ, చంద్రబోస్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రవితేజ స్పీచ్‌కు మెగా స్టార్ చిరంజీవి ఇచ్చిన పంచ్‌లు వైరల్ అవుతున్నాయి. రవితేజ్ స్పీచ్ వివరాల్లోకి వెళితే..

   నిర్మాత నవీన్‌పై రవితేజ ఎమోషనల్‌గా

  నిర్మాత నవీన్‌పై రవితేజ ఎమోషనల్‌గా


  నిర్మాతలు నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలికి బిగ్ థ్యాంక్స్. వారిద్దరూ కలెక్షన్లు లెక్కించుకొనే పనిలో ఉన్నారు. సినిమా భారీగా కలెక్షన్లు రాబడుతుండటంతో రవి శంకర్ బాడీ లాంగ్వేజ్ కూడా మారిపోయింది. అయితే నవీన్‌ వ్యక్తిత్వం, మనస్తత్వం, మంచితనం నాకు బాగా ఇష్టం. ఎప్పుడు పాజిటివ్‌తో ఉంటాడు. తనకు అబద్ధం ఆడటం రాదు. అబద్దం మాట్లాడటం రాదు. అవతలి వాడిని ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించడు. ఎవడైనా సరే అబద్దం ఆడడు. చిరంజీవి గానీ, నేనైనా అబద్దం ఆడడు. మీరు ఇలాగే బ్లాక్‌బస్టర్లను కొనసాగించాలి అని రవితేజ అన్నారు.

  నీ బీజీఎంతో నెక్ట్స్ లెవెల్

  నీ బీజీఎంతో నెక్ట్స్ లెవెల్


  వాల్తేరు వీరయ్య సినిమా మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్‌పై రవితేజ ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సినిమాను ఓ లెవెల్ వరకు తీసుకెళ్లడం సరే. నీ బీజీఎం మరో లెవెల్‌కు తీసుకెళ్లింది. ఈ సినిమాను థియేటర్‌లో ఫుల్ సౌండ్‌తో చూడాలి. అదే విషయాన్ని బాబీతో చెప్పాను. త్వరలో ఈ సినిమాను థియేటర్‌లో చూద్దాం. బిగ్ కంగ్రాట్స్ అని రవితేజ చెప్పారు.

  బాబీ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చినందుకు

  బాబీ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చినందుకు


  వాల్తేర్ వీరయ్య సినిమా కెప్టెన్ ఆఫ్ షిప్ బాబీకి నా కంగ్రాట్స్. ఈ సినిమా విషయంలో నేను చాలా హ్యాపీ. ఎప్పుడు ఏది జరగాలో అప్పుడే జరుగుతుంది. నీకు బిగ్ కంగ్రాట్స్. ఇది కాదు.. ఇంకా ఈ సినిమాకు లాంగ్ రన్ ఉంది. ఈ మూవీ కలెక్షన్లు ఎక్కడ వరకు వెళ్తాయో.. ఎక్కడ ఆగుతుందో చూడాలి అని రవితేజ తెలిపారు.

  అన్నయ్య నా హ్యాపీ మామూలుగా లేదు

  అన్నయ్య నా హ్యాపీ మామూలుగా లేదు


  ఇక చిరంజీవి గురించి మాట్లాడుతూ.. అన్నయ్య.. వాల్తేరు వీరయ్య విజయం చూసి నా సంతోషం మామూలుగా లేదు. ఇంతకు ముందు మీతో ఆజ్ కా గూండారాజ్, అన్నయ్య సినిమాలు చేశాను. కానీ ఈ గోల వేరు. సినిమా చూసిన తర్వాత చిన్న పిల్లలు చాలా ఎమోషనల్ అయి ఏడుస్తున్నారు. అలాగే పునకాలు లోడింగ్ పాటకు డ్యాన్స్ చేస్తున్నారు. ఈ జనరేషన్ సినిమాకు బాగా కనెక్ట్ అయ్యారు అని రవితేజ చెప్పారు.

  చిరంజీవితో ఫుల్ లెంగ్త్ సినిమా

  చిరంజీవితో ఫుల్ లెంగ్త్ సినిమా

  వాల్తేరు వీరయ్య విషయాన్ని పక్కన పెడితే.. అన్నయ్య నీతో ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీ చేయాలి. మొదటి నుంచి చివరి సీన్ వరకు గోల గోలతో థియేటర్ అంతా దద్దరిల్లాలి. మా ఇద్దరికి ప్రాపర్గా ఉండేలలా సినిమా రావాలి. బాబీ ఆ ప్రయత్నం ఏదైనా ఉంటే చూడు అని రవితేజ అన్నారు.
  మనమిద్దరం దొంగనా కొడుకులమే..

  మనమిద్దరం దొంగనా కొడుకులమే..


  రవితేజ మాట్లాడుతుండగా.. మనిద్దరం మరోసారి కలిసి నటించాల్సిందే. మనమిద్దరం దొంగ నా కొడుకులం. మన ఇద్దరిని మంచి నా కొడుకులుగా ఎవరు నమ్మరు. మనం మ్యాచ్ కూడా కాము అని చిరంజీవి అనగానే.. స్టేజ్ మీద ఉన్న రవితేజతోపాటు అందరూ నవ్వుల్లో మునిగిపోయారు.

  మీ ఇద్దరి సినిమాకు నిర్మాతను నేనేనా?

  మీ ఇద్దరి సినిమాకు నిర్మాతను నేనేనా?


  అయితే రవితేజ, చిరంజీవి మధ్య సరదాగా సాగిన సంభాషణ వింటున్న నిర్మాత రవిప్రకాశ్ వెంటనే స్పందిస్తూ.. మీ ఇద్దరి మల్టీ స్టారర్ సినిమాకు మేమే నిర్మాతలం కదా.. అని అనగానే.. అందరూ నవ్వుల్లో మునిగారు. అయితే ఆ సినిమాకు మీరే నిర్మాతలు అని చెప్పగానే.. అయితే రెమ్యునరేషన్ భారీగా ఇస్తారు కదా అని చిరంజీవి అనడంతో నవ్వుల పూలు పూచాయి. ఈవెంట్ ఆద్యంతం సరదాగా సాగిపోయింది.

  English summary
  Chiranjeevi's Waltair Veerayya going good at box office. This movie hits the Screens on January 13th. In this occassion, Movie Unit organised Waltair Veerayya Mega Mass Blockbuster Meet
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X