Just In
Don't Miss!
- Lifestyle
శుక్రవారం దినఫలాలు : ఓ రాశి వారు ఈరోజు చాలా శక్తివంతంగా ఉంటారు...!
- News
పాకిస్తాన్‌కు ఎఫ్ఏటీఎఫ్ షాక్... మళ్లీ గ్రే జాబితాలోనే... కొత్త డెడ్ లైన్ ఎప్పటివరకంటే...
- Finance
Gold price@రూ.46,150: రూ.10,000 కంటే ఎక్కువ తగ్గిన పసిడి ధరలు
- Sports
India vs England: చెలరేగిన స్పిన్నర్లు.. భారత్ ఘన విజయం!
- Automobiles
50,000వ ఎమ్‌జి హెక్టర్ విడుదల; దీనిని తయారు చేసిన వారంతా మహిళలే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
‘RRR’ తర్వాత రామ్ చరణ్ చేసేది ఆయనతోనే.. చిరంజీవి సలహా వల్లే ఈ నిర్ణయం.!
తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా వెలుగొందుతున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. మెగాస్టార్ చిరంజీవి కుమారుడిగా సినీ రంగ ప్రవేశం చేసినప్పటికీ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడీ యంగ్ హీరో. చేసింది తక్కువ సినిమాలే అయినా ఎక్కువ పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నాడు. దీంతో అనతి కాలంలోనే బడా హీరోగా ఎదిగిపోయాడు. అతడు ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న 'RRR' అనే సినిమాలో నటిస్తున్నాడు. దీని తర్వాత చరణ్ నటించే సినిమా గురించి ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే...

టాలీవుడ్‌లోనే బడా సినిమా చేస్తున్నాడు
రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి ‘RRR'లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో అతడు అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా 2020 జూలై 30న విడుదల కాబోతోంది.

ఒకటి కాదు రెండు సినిమాలు
‘RRR' పట్టాలపై ఉండగానే రామ్ చరణ్ తన తండ్రి మెగాస్టార్ చిరంజీవితో ‘సైరా: నరసింహారెడ్డి' అనే సినిమాను నిర్మించాడు. ఇది మంచి టాక్ సంపాదించుకున్నప్పటికీ, కలెక్షన్లు రాబట్టడంలో మాత్రం విఫలం అయింది. దీని తర్వాత మెగాస్టార్.. కొరటాల శివతో సినిమా చేస్తున్నారు. దీన్ని కూడా రామ్ చరణే నిర్మిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉంది.

‘RRR' కోసం ప్రత్యేకంగా చరణ్
తెలుగు సినీ ఇండస్ట్రీలోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న RRR కోసం రామ్ చరణ్ ప్రత్యేకంగా వ్యవహరిస్తున్నాడు. లుక్కు, ఫిజిక్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ముఖ్యంగా కోర మీసంతో అతడి స్టైల్ ఆకట్టుకుంటోంది. అలాగే, డేట్స్ అడ్జస్ట్ చేసే విషయంలోనూ ఆయన చిత్ర యూనిట్‌కు సహకరిస్తున్నాడు.

అప్పటి వరకు రామ్ చరణ్ బుక్
‘RRR' 2020 జూలై 30న విడుదల కాబోతున్నట్లు చిత్ర యూనిట్ గతంలోనే ప్రకటించింది. అంటే.. సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత కూడా డబ్బింగ్, ప్రమోషన్ కార్యక్రమాలు సహా కొన్ని పనులు ఉంటాయి. దీంతో రామ్ చరణ్ అప్పటి వరకు ఖాళీ అయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. అందుకే ఇవి పూర్తయిన తర్వాతనే మరో సినిమా మొదలు పెడతాడని తెలుస్తోంది.

చిరు సలహాతో డైరెక్టర్ ఫిక్స్
‘RRR' తర్వాత చరణ్ ఏ దర్శకుడితో పని చేస్తాడన్న విషయంపై తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. ‘అర్జున్ రెడ్డి' సినిమాతో దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయిన సందీప్ రెడ్డి వంగాతో రామ్ చరణ్ సినిమా చేయబోతున్నాడనేదే ఆ వార్త సారాంశం. చిరంజీవి ఇచ్చిన సలహా మేరకే ఈ సినిమాను మెగా పవర్ స్టార్ ఓకే చేశాడని అంటున్నారు.

కొడుకు కోసం సూపర్ ప్లాన్ వేసిన చిరు
తనకు ప్రతిష్టాత్మకమైన సినిమాను అందించిన కొడుకు కోసం చిరంజీవి సూపర్ ప్లాన్ వేశారని ప్రచారం జరుగుతోంది. సందీప్ రెడ్డి ‘కబీర్ సింగ్' సినిమాతో బాలీవుడ్‌లో బాగా పేరు సంపాదించుకున్నాడు. అందుకే ఆయనతో సినిమా చేస్తే చరణ్ మార్కెట్ పెరుగుతుందని చిరంజీవి భావిస్తున్నట్లు తెలుస్తోంది. సందీప్ ప్రస్తుతం బాలీవుడ్‌లో చేస్తున్న సినిమా తర్వాత ఇది స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని టాక్.