For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Waltair Veerayya రవితేజను మరిచిన మెగాస్టార్.. అలా వెలితి అంటూ చిరంజీవి ఎమోషనల్

  |

  మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబినేషన్‌లో వస్తున్న వాల్తేరు వీరయ్య సంక్రాంతి కానుకగా రిలీజ్‌కు సిద్దమైంది. మైత్రీ మూవీస్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన మీడియా ఇంటరాక్షన్, ప్రెస్ మీట్‌ను వాల్తేరు వీరయ్య కోసం వేసిన ప్రత్యేకమైన సెట్‌లో నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్‌లో చిరంజీవి తన యూనిట్ సభ్యుల గురించి మాట్లాడుతూ హుషారెత్తించారు. అయితే అందరి గురించి మాట్లాడిన ఆయన రవితేజ గురించి వేదికపై ప్రస్తావించకపోవడాన్ని గుర్తు చేసుకొని వివరణ ఇచ్చారు. చిరంజీవి చెప్పిన విషయాలు, ఆయన ట్వీట్ చేసిన విషయాల్లోకి వెళితే..

  దర్శకుడు బాబీకే ఆ క్రెడిట్

  దర్శకుడు బాబీకే ఆ క్రెడిట్


  వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నాలోని భావాలను క్లుప్తంగా చెప్పుకొంటాను. కానీ ఒకసారి మాట్లాడటం మొదలుపెడితే.. మనసులోని చాలా విషయాలు తన్నుకొస్తాయి. అయితే ఈ వేదిక మీద ఉన్న నటులు డబ్బులు తీసుకొని చేయలేదు. ప్రేమను పొంది.. ప్రేమను ఇచ్చి ఈ సినిమా చేశాం. వారంతా లేకపోతే వాల్తేరు వీరయ్య లేదు. ఈ సినిమాకు ఏదైనా క్రెడిట్ ఇవ్వాలంటే.. బాబీకే ఇవ్వాలి అని చిరంజీవి అన్నారు. ఈ ప్రెస్ మీట్ చూస్తే ఇక వాల్తేరు వీరయ్యకు ప్రీ రిలీజ్ అవసరమా అనే ఫీలింగ్ కలుగుతున్నది అని అన్నారు.

  అభిమాని డైరెక్టర్ అయితే..

  అభిమాని డైరెక్టర్ అయితే..

  బాబీ కథ చెప్పినప్పుడు బాగుంది. కథను విస్తరించి తీసుకురా అని చెప్పాను. అప్పుడే ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని నమ్మాను. ఆ క్రమంలో కథను బాగా తయారు చేసి మైత్రీ మూవీస్‌తో కలిసి ఈ సినిమా చేయడం జరిగింది. నాకు ఒక సీనియర్ నటుడు చెప్పినదేమిటంటే.. ఎవరైనా అభిమాని డైరెక్టర్ అయి.. తమను ఎలా తెరపైన చూపించాలనే తపన ఉంటుందో అలాంటి వారితో పనిచేయి అని అన్నారు. బాబీ, బాబీ నాన్న నాకు పెద్ద అభిమానులు. కాబట్టే.. నేను ఊహించని విధంగా సినిమాను రూపొందించారు. అందుకు హార్టీ కంగ్రాట్స్.. అడ్వాన్స్. ఎక్కువ చెబితే అంచనాలు పెరిగిపోతాయి. కానీ అలాంటి అంచనాలకు మించే సినిమా ఉంటుంది అని చిరంజీవి అన్నారు.

  దేవీ శ్రీ ప్రసాద్, ప్రకాశ్ పనితీరు గురించి

  దేవీ శ్రీ ప్రసాద్, ప్రకాశ్ పనితీరు గురించి

  దేవీ శ్రీ ప్రసాద్ గురించి మాట్లాడుతూ.. నాతో సినిమా అంటే ఆయనలో హుషారు మాములుగా ఉండదు. ఆయన ఇచ్చే ఇన్‌పుట్స్ చాలా వ్యాల్యూ ఉంటాయి. చిన్న పిల్లాడిలా గెంతులు వేస్తుంటాడు. నాకు మాస్, క్లాస్ కలబోసిన పాటలను ఇచ్చాడు. చంద్రబోస్ అద్బుతంగా లిరిక్స్ రాశారు. వీరిద్దరే కాదు. ప్రతీ ఒక్కరు ప్రేమను పంచి ఈ సినిమాలో నటించారు. రామ్ లక్ష్మణ్ అద్బుతంగా ఫైట్స్ కంపోజ్ చేశారు. వారి నడవడిక, చేసే యోగా, ఫ్యామిలీ వ్యాల్యూ పాటించడం నాకు చాలా ఇష్టం. ఆర్ట్ డైరెక్టర్ ప్రకాశ్ డీటేయిల్‌గా సెట్స్ వేశారు. శేఖర్ మాస్టర్ నా స్టయిల్‌ను పూర్తిగా పట్టేశాడు అని చిరంజీవి అన్నారు.

  బాబీకి ముద్దులు పెట్టిన చిరంజీవి

  బాబీకి ముద్దులు పెట్టిన చిరంజీవి

  బాబీ మాట్లాడుతూ తాను చిరంజీవికి ఎంత పెద్ద ఫ్యాన్ అనే విషయాన్ని చెప్పాడు. చిరంజీవితో నవ్వుతూ ఫోటో దిగాలనే కోరిక ఉండేది. కానీ అది తీరలేదు అని అంటే.. చిరంజీవి వెంటనే వచ్చి బాబీ భుజం మీద చేయి వేసి నవ్వుతూ ఫోటోలకు ఫోజిచ్చాడు. అంతేకాకుండా కౌగిలించుకొని ముద్దులు పెట్టాడు. దాంతో బాబీ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.

  ప్రీ రిలీజ్ ఈవెంట్ మాదిరిగా అంటూ

  ప్రీ రిలీజ్ ఈవెంట్ మాదిరిగా అంటూ

  అయితే వేదికపైన ప్రతీ ఒక్కరిని అభినందించిన మెగాస్టార్ చిరంజీవి రవితే గురించి మాట్లాడకపోవడం జరిగింది. అయితే ప్రెస్ మీట్ తర్వాత ఆ విషయం తెలుసుకొన్న చిరంజీవి ట్విట్టర్ ద్వారా స్పందించారు. వాల్తేరు వీరయ్య టీం అందరితో, మీడియా మిత్రులందరి కోసం ఏర్పాటు చేసిన ఈ నాటి ప్రెస్ మీట్ ఎంతో ఆహ్లదంగా జరిగింది. చిత్రం విడుదలకు ఎంతో ముందు జరిగినా.. టీం అందరూ ఎంతో సంతోషంగా, ఈ జర్నీలో వాళ్ల వాళ్ల అనుభూతులను పంచుకోవడంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించినంత సంతృప్తిగా జరిగింది అని చిరంజీవి చెప్పారు.

  రవితేజతో మళ్లీ ఇన్నాళ్లకు అంటూ

  అయితే వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను దృష్టిలో పెట్టుకొని క్లుప్తంగా మాట్లాడదామని అనుకోవడంలో, చిత్రంగా నా తమ్ముడు, వీరయ్యకు అతి ముఖ్యుడు. రవితేజ గురించి చెప్పడం మరిచిపోయాను. ప్రెస్ మీట్ నుంచి తిరిగి వచ్చేటప్పుడు అంతా ఈ విషయంపై వెలితిగా ఫీలయ్యాను. అందుకే ఈ ట్వీట్ చేస్తున్నాను. వాల్తేరు వీరయ్య ప్రాజెక్ట్ గురించి చెప్పగానే.. అన్నయ్య సినిమాలో చేయాలని రవి వెంటనే ఒప్పుకోవడం దగ్గర్నుంచి కలిసి షూట్ చేసిన ప్రతీ రోజు ఎన్నో విషయాలు షేర్ చేసుకొన్నాం. రవితేజతో మళ్లీ ఇన్నేళ్లకు చేయడం నాకెంతో ఆనందంగా అనిపించింది. ఒక్క మాటలో చెప్పాలంటే.. రవితేజ చేయకపోయి ఉంటే.. వాల్తేరు వీరయ్య అసంపూర్ణంగా ఉండేది. డైరెక్టర్ బాబీ అంటున్న పూనకాలు లోడింగ్‌లో రవితేజ పాత్ర చాలా చాలా ఉంది. ఈ విషయాలు త్వరలో మాట్లాడుకొందాం అని చిరంజీవి ట్వీట్‌లో పేర్కొన్నారు.

  English summary
  Mega Star Chiranjeevi's Latest movie Waltair Veerayya set to release on 13 January 2023. In this occassion, Unit has conducted press meet and media Interaction. He is the Chiranjeevi clarification about ignoring Ravi Teja at Stage of press meet.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X