Don't Miss!
- News
రంగంలోకి ప్రధాని మోదీ - షా : తెలంగాణలో త్రిముఖ వ్యూహం..!!
- Finance
fpi: ఇండియన్ మార్కెట్ల నుంచి FPIల నిష్క్రమణ.. ఒక్క నెలలోనే అన్ని కోట్లా ??
- Lifestyle
శృంగార కోరికలు తగ్గడానికి ఈ 3 హార్మోన్లే కారణం... దీన్ని వెంటనే పరిష్కరించండి...!
- Sports
పని పాట లేని వెదవలు క్రియేట్ చేసే స్టోరీలు.. బాబర్ నాకు కొడుకుతో సమానం: వసీం అక్రమ్
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
- Technology
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
కరోనా ఎఫెక్ట్.. ఎంతోమందికి స్ఫూర్తినిచ్చేలా.. రక్తదానం చేసిన మెగాస్టార్
కరోనా వైరస్ ధాటికి ప్రపంచం మొత్తం వణికిపోతోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 23 లక్షల మంది కరోనా బారిన పడ్డారు. అందులో లక్షకు పైగా దుర్మరణం చెందారు. ఇక మనదేశంలోనూ కరోనా విజృంభిస్తోంది. ఇప్పటికే పదిహేను వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. దాదాపు ఆరు వందలకు పైగా మరణాలు సంభవించాయి. కరోనా కట్టడికి మన దేశంలో లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ లాక్ డౌన్ కారణంగా ఎన్ని సమస్యలు ఏర్పడుతున్నా.. కరోనాపై పోరాడేందుకు ఇదే ఉత్తమమైన మార్గమని ప్రపంచ దేశాలు కూడా నొక్కి చెబుతున్నాయి.

కఠినతరంగా లాక్ డౌన్..
మన దేశంలో రెండో విడత లాక్ డౌన్ నడుస్తోంది. మొదటగా 21 రోజుల పాటు విధించిన లాక్ డౌన్ ఏప్రిల్ 14న ముగిసింది. కరోనా వైరస్ తీవ్రత ఇంకా పెరగడంతో మరో 19 రోజులు మే 3 వరకు లాక్ డౌన్‌ను పొడిగించారు. అయితే లాక్ డౌన్ వల్ల ఎంతోమంది ఉపాధి కోల్పోవాల్సి వచ్చింది.

రక్తం నిల్వలు కూడా..
అయితే లాక్ డౌన్ విధించడం వల్ల రక్తం నిల్వలు తగ్గిపోయాయి. రాష్ట్రంలోని అన్ని బ్లడ్ బ్యాంక్‌లో రక్తం లేదని తెలుస్తోంది. ప్రజలెవరూ బయటకు రాకపోవడం, అందరూ ఇంటి పట్టునే ఉండాలనే ఆదేశాలుండటంతో రక్తం ధానం చేసేందుకు ఎవ్వరూ ముందుకు రావడం లేదు.

తలసేమియా వ్యాధిగ్రస్తులకు..
అయితే నిత్యం రక్త మార్పిడి చేయాల్సిన రోగుల పరిస్థితి దారుణంగా ఉందని సమాచారం. ముఖ్యంగా చిన్న పిల్లలు, తలసేమియా వ్యాధి గ్రస్తుల పరిస్థితి ఆందోళన కరంగా ఉంది. రక్తం లేకపోవడంతో ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వస్తోంది. దాతలు ముందుకు రావాలని, రక్తాన్ని ఇచ్చి ప్రాణాలను కాపాడాలని కోరుతున్నారు.
|
ముందుకు వచ్చిన నాని..
న్యాచురల్ స్టార్ నాని తన వంతుగా వచ్చి రక్తధానం చేసి ప్రజలకు అవగాహన కలిగించారు. బయటకు రండి అంటూ రక్త దానం చేయమని ప్రజలకు పిలుపునిచ్చాడు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంకుకు వెళ్లిన నాని అక్కడ రక్తదానం చేశాడు. అనంతరం అభిమానులకు సందేశాన్ని ఇచ్చాడు.
Recommended Video

రక్తదానం చేసిన మెగాస్టార్..
మెగాస్టార్ చిరంజీవి ముందు నుంచి రక్తదానం, నేత్రదానం గురించి అందరికీ అవగాహన కలిగిస్తూనే ఉన్నాడు. ఇలాంటి విపత్కర సమయంలోనూ మెగాస్టార్ చిరంజీవి ముందుకు వచ్చి.. తన బ్లడ్ బ్యాంక్‌లో రక్తదానం చేశాడు. ఈ మేరకు ఫ్యాన్స్‌కు కూడా పిలుపునిచ్చాడు.