Just In
- 14 min ago
అల్లు అర్జున్ ‘పుష్ప’ రిలీజ్ డేట్ ప్రకటన: అదిరిపోయిన కొత్త పోస్టర్.. ఆ రూమర్లకు కూడా చెక్
- 34 min ago
‘రాధే శ్యామ్’ టీజర్ డేట్ ఫిక్స్: అదిరిపోయే స్పెషల్ డేను లాక్ చేసిన ప్రభాస్
- 46 min ago
ప్రభాస్ 'సలార్' హీరోయిన్ ఫిక్స్.. పుట్టినరోజు కానుకగా అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చిన టీమ్
- 1 hr ago
2021 మొత్తం మెగా హీరోలదే హవా.. నెవర్ బిఫోర్ అనేలా బాక్సాఫీస్ పై దండయాత్ర
Don't Miss!
- News
జగ్గంపేటలో ఘోర ప్రమాదం .. మంటల్లో ఇద్దరు సజీవ దహనం , ముగ్గురికి గాయాలు
- Finance
Gold prices today: వరుసగా 5వ రోజు తగ్గిన బంగారం ధరలు, రూ.7500 తక్కువ
- Sports
ఓ ఇంటివాడైన విజయ్ శంకర్
- Lifestyle
తక్కువ సమయంలో చర్మాన్ని క్లియర్ చేయడానికి ఉపయోగించే ముందు ఇది తెలుసుకోవాలి
- Automobiles
భారత్ బెంజ్ ప్రవేశపెట్టిన 8 కొత్త వాహనాలు, ఇవే.. చూసారా..!
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
సినిమా ఆగిపోలేదు.. సాయి పల్లవి, నేను నటిస్తాం.. రానా!
విలక్షణమైన పాత్రలు ఎంచుకుంటూ రానా దూసుకుపోతున్నాడు. బాహుబలి, ఘాజి, నేనే రాజు నేనే మంత్రి లాంటి చిత్రాలలో నటిస్తూ అభిమానులకు ఎప్పటికి గుర్తుండిపోయే పాత్రలు అందిస్తున్నాడు. ప్రస్తుతం రానా కొన్ని బహుభాషా చిత్రాలలో నటిస్తున్నాడు. తాజాగా విడుదలైన ఎన్టీఆర్ బయోపిక్ లో రానా నారా చంద్రబాబు నాయుడు పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. తాజాగా రానా మరో విభిన్నమైన చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
నీదీ నాది ఒకే కథ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు వేణు ఊడుగుల మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. రానా, సాయి పల్లవి కాంబినేషన్ లో వేణు అడుగుల ఆసక్తికరమైన చిత్రానికి ప్లాన్ చేశాడు. ఈ చిత్రానికి విరాటపర్వం 1992అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. చాలా రోజులుగా ఈ చిత్రం గురించి వార్తలు వస్తున్నాయి. కానీ సినిమా మాత్రం ప్రారంభం కాకపోవడంతో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయిందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

దీనిపై తాజాగా రానా స్పందించిన క్లారిటీ ఇచ్చాడు. వేణు ఊడుగుల దర్శత్వంలో చిత్రం ఆగిపోలేదని తెలిపాడు. ఈ చిత్రంలో తాను, సాయి పల్లవి కలసి నటిస్తున్నట్లు రానా క్లారిటీ ఇచ్చాడు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రకటన త్వరలో వెలువడనుంది.