Don't Miss!
- News
గవర్నర్ పై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం..!?
- Sports
ఇదో చెత్త పిచ్.. టీ20లకు పనికిరాదు: హార్దిక్ పాండ్యా
- Lifestyle
హాట్ అరోమా ఆయిల్ మేనిక్యూర్ గురించి మీకు తెలుసా? రఫ్ హ్యాండ్స్ ని చేతిని మృదువుగా చేస్తుంది!
- Finance
BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
ఎట్టకేలకు దిగొచ్చిన దిల్ రాజు: మెగా హీరో కోసం భారీ ఖర్చుకు సిద్ధం
తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న బడా ప్రొడ్యూసర్లలో దిల్ రాజు ఒకరు. విపరీతమైన కష్టంతో డిస్ట్రిబ్యూటర్ స్థాయి నుంచి సినిమా నిర్మాతగా ఎదిగారు. ఈ క్రమంలోనే మాంచి టేస్ట్ ఉన్న నిర్మాతగా పేరొందారు. కొంత కాలం వరకూ వరుస హిట్లతో దూసుకుపోయిన ఆయన.. ఈ మధ్య కాలంలో అంతగా సక్సెస్ కాలేకపోతున్నారు. గత ఏడాది భారీ విజయాలను అందుకున్న దిల్ రాజును.. ఈ ఏడాది వచ్చిన 'జాను', 'ఇద్దరి లోకం ఒకటే' చిత్రాలు తీవ్రంగా నిరాశ పరిచాయి. ఈ నేపథ్యంలో ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారాయన.
సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో 'F3' చేయబోతున్నట్లు ప్రకటించారు దిల్ రాజు. సంక్రాంతి కానుకగా విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకున్న మూవీ 'F2'. విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్ నటించిన ఈ మల్టీ స్టారర్ మూవీని సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించాడు. దిల్ రాజు నిర్మించిన 'F2' భారీ వసూళ్లను రాబట్టి సంక్రాంతి విజేతగా నిలిచింది. దీంతో ఈ సినిమాకు సీక్వెల్ తీస్తున్నారు. ఈ సినిమా కోసం బడ్జెట్‌ను భారీ స్థాయిలో పెంచేశారట దిల్ రాజు. ఇందులో భాగంగానే అందరి రెమ్యూనరేషన్లు సైతం హైక్ చేసినట్లు సమాచారం.

సాధారణంగా నాలుగు నుంచి ఐదు కోట్ల రూపాయలు చార్జ్ చేసే వరుణ్ తేజ్.. 'F3'లో నటించేందుకు గానూ రూ. 10 కోట్లు డిమాండ్ చేసినట్లు ప్రచారం జరిగింది. అయితే, తాజా సమాచారం ప్రకారం.. అతడికి రూ. 8 కోట్లు ఇచ్చేందుకు దిల్ రాజు ముందుకొచ్చాడట. అలాగే, విక్టరీ వెంకటేష్‌కు రూ. 13 కోట్లు, దర్శకుడు అనిల్ రావిపూడికి రూ. 10 కోట్లు ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. అలాగే, హీరోయిన్లకు డిమాండ్‌ను బట్టి రెమ్యూనరేషన్ హైక్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.