India
  For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  F3 తరువాత మరో మల్టీస్టారర్ తో రాబోతున్న అనిల్ రావిపూడి.. పవర్ఫుల్ హీరోలతో బిగ్ ప్లాన్?

  |

  ఇటీవల కాలంలో తెలుగు చిత్ర పరిశ్రమలో నెవర్ బిఫోర్ అనేలా సరికొత్త కాంబినేషన్స్ తెరపైకి వస్తున్న విషయం తెలిసిందే. ఒకప్పుడు మల్టీస్టారర్ సినిమాలు అంటే చాలా అరుదుగా వచ్చేవి. ఇప్పుడు మన దర్శకులు మాత్రం ఏడాదికో మల్టీస్టారర్ సినిమా చూపిస్తున్నారు. ఇద్దరు హీరోలను వెండితెరపై చూపించడానికి నిర్ణతలు కూడా ఎక్కువ ఆసక్తిని చూపిస్తున్నారు. ఇక అందరు హీరోలు కూడా చాలా ఫ్రెండ్లీగా మల్టీస్టారర్ సినిమాలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. ఇక దర్శకుడు అనిల్ రావిపూడి మరో మల్టీస్టారర్ సినిమాను తెరపైకి తీసుకురావడానికి ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. ఆ వివరాల్లోకి వెళితే..

  ధైర్యాన్ని నింపిన RRR

  ధైర్యాన్ని నింపిన RRR

  RRR తో రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ సరికొత్త మల్టీస్టారర్ ట్రెండ్ కు శ్రీకారం చుట్టారు. మెగా నందమూరి హీరోల కలయికలో వచ్చిన ఈ బిగ్ బడ్జెట్ సినిమా RRR బాక్సాఫీస్ వద్ద సరికొత్త సంచలనం సృష్టిస్తోంది. దీంతో రాబోయే ఈ రోజుల్లో మిగతా స్టార్ హీరోలు కూడా మల్టీస్టారర్ సినిమాలు చేయడానికి ఇదొక ధైర్యం అనే చెప్పాలి.

  F2 ఫ్రాంచైజ్

  F2 ఫ్రాంచైజ్

  దర్శకుడు అనిల్ రావిపూడి ఇదివరకే ఎఫ్ 2 సినిమాలో విక్టరీ వెంకటేష్ ను అలాగే వరుణ్ తేజ్ ను ఇద్దరినీ కూడా మంచి కామెడీతో హైలెట్ చేసే విధానం అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పుడు మళ్లీ ఆ ఇద్దరూ హీరోలతోనే F2 ఫ్రాంచైజ్ ను కొనసాగిస్తూ F3 అనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. తప్పకుండా ఆ సినిమా కూడా అందరినీ ఆకట్టుకుంటుందని దర్శకుడు నమ్మకంతో ఉన్నాడు.

  బలయ్యాతో తదుపరి సినిమా

  బలయ్యాతో తదుపరి సినిమా

  ఇక F2 సినిమా తర్వాత అనిల్ రావిపూడి నందమూరి బాలకృష్ణ తో వర్క్ చేయబోతున్న విషయం తెలిసిందే. అసలైతే తన మొదటి సినిమా తర్వాత బాలకృష్ణ తో సినిమా చేయాల్సి ఉంది. కానీ అప్పుడు సరైన సమయం సెట్ కాకపోవడంతో కుదరలేదు. ఇక ఈ సారి ఎలాగైనా బాలకృష్ణ తో సినిమా చేయాలనే అనిల్ రావిపూడి ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ పనులను కూడా పూర్తి చేసుకున్నాడు.

  మరో మల్టీస్టారర్?

  మరో మల్టీస్టారర్?

  ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం నందమూరి బాలకృష్ణ తో అనిల్ రావిపూడి చేయబోయే సినిమాలో మరో హీరో కూడా కనిపించబోతున్నట్లు గా మాట్లాడుకుంటున్నారు. ఆ హీరో ఎవరు అనే విషయం ఇంకా తెలియలేదు. కానీ అనిల్ రావిపూడి మాత్రం తనకు అత్యంత సన్నిహితులైన వారిలో ఒక హీరో ని సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

   ఆ హీరోలతో చర్చలు

  ఆ హీరోలతో చర్చలు

  అనిల్ రావిపూడి సాయి ధరమ్ తేజ్ తో కూడా ఆ మధ్య ఒక సారి పై చర్చ జరిగినట్లుగా టాక్ వచ్చింది. బహుశా బాలయ్య సినిమా కోసమే అతన్ని సంప్రదించి ఉండవచ్చు అని అందరూ అనుకున్నారు. అంతేకాకుండా రవితేజ తో కూడా ఇదివరకే కొన్ని కథల పై అనిల్ చర్చలు జరిపాడు. అనిల్ ఫోకస్ అయితే ఎక్కువగా మాస్ రాజా పైనే ఉన్నట్లు సమాచారం. ఇక బాలకృష్ణ రవితేజ కాంబినేషన్ అంటే తప్పకుండా ఇండస్ట్రీలో అంచనాలు అమాంతం పెరిగి పోతాయి అని చెప్పవచ్చు. మరి ఈ టాక్ ఎంతవరకు నిజమో తెలియాలంటే అఫీషియల్ క్లారిటీ వచ్చే వరకు ఎదురు చూడాల్సిందే.

  English summary
  Director anil ravi pudi another multi starrer project planing
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X