నాపై బాలీవుడ్ కుట్ర.. 16 కోట్లు నష్టపోయా.. షాకింగ్ విషయాలను బయటపెట్టిన గోవిందా
యాక్షన్ సినిమాల్లో సరికొత్త కామెడీ టైమింగ్ తో అప్పట్లో ఎంతగానో క్రేజ్ అందుకున్న నటులలో గోవిందా ఒకరు. ఆయన సినిమాలకు ఓపెనింగ్స్ తోనే పెట్టిన పెట్టుబడికి రెండితల లాభాలు వచ్చేవి. అందుకే గోవింద్ తో నిర్మాతలు ఒకేసారి రెండు మూడు సినిమాలు చేసేవారు. అయితే కొన్నాళ్లకు క్రేజ్ తగ్గడంతో సినిమాలు కూడా తగ్గించేశారు. అయితే ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో గోవింద్ మోసానికి గురైనట్లు చెప్పాడు. తెలిసిన వాళ్లే మోసం చేశారని చెప్పాడు.

ఏడాదిలో 10కి పైగా సినిమాలు
గోవిందా అసలు పేరు గోవింద్ అరుణ్ అహుజా. ఇక అభిమానుల్లో గోవిందా అంటూ క్రేజ్ రావడంతో అదే స్క్రీన్ నేమ్ గా మారిపోయింది. అయితే 150కి పైగా సినిమాల్లో నటించిన ఈ యాక్టర్ 1986 నుంచి సినిమా ఇండస్ట్రీలో ఉంటున్నారు. మొదట్లో ఏడాదికి 10కి పైగా సినిమాలు చేసిన టాలెంటెడ్ నటులలో ఆయన ఒకరు.

అప్పట్లో వరుసగా ఇండస్ట్రీ హిట్స్
80వ దశకంలో యాక్షన్ హీరోగా ప్రారంభమైన ఆయన 90వ దశకంలో మాత్రం కామెడీ హీరోగా తనను తాను సరికొత్తగా ప్రెజెంట్ చేసుకున్నాడు. జాన్ సే ప్యారా (1992), దులారా (1994), ఖుద్దర్ (1994) అండోలన్ (1995) వంటి బాక్సాఫీస్ హిట్స్ తో అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేశారు.

సోలోగా సక్సెస్ లేకపోవడంతో..
కమర్షియల్ గా కామెడీ హీరోగా క్లిక్కవ్వడంతో కంటిన్యూగా అదే ఫార్మాట్ లో సినిమాలు తీశారు. కొన్ని సౌత్ సినిమాలను కూడా బాలీవుడ్ లో రీమేక్ చేసి హిట్ కొట్టాడు. రాజా బాబు (1994), కూలీ నెంబర్ 1 (1995), హీరో నం 1 (1997) లాంటి సినిమాలు కూడా ట్రెండ్ సెట్ చేశాయి. అయితే 2000వ సంవత్సరం తరువాత గోవిందా ఎక్కువగా క్లిక్కవ్వలేకపోయాడు. సల్మాన్ తో చేసిన పార్ట్‌నర్ లాంటి సినిమాలు మాత్రమే హిట్టయ్యాయి. కానీ సోలోగా సక్సెస్ అందుకోలేదు.

కుట్ర జరిగింది..
అయితే ఆర్థికంగా బాగా కుదుటపడిన సమయంలో బాలీవుడ్ లో కొన్ని విభాగాలకు చెందిన వ్యక్తులు తనపై 'కుట్ర' చేశారని గోవిందా ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. ఆ కుట్ర కారణంగానే బాలీవుడ్ లో ఫామ్ కోల్పోవాల్సి వచ్చిందనిఆర్థిక నష్టాలు కూడా ఎదురైనట్లు చెప్పారు. ఇక తనతో తరచు సినిమాలు చేసేవారు కూడా నన్ను దూరం పెట్టిన సందర్భాలు ఎదురయ్యాయని అన్నారు.

16కోట్లు కోల్పోయాను
గోవింద టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ, "గత 14-15 సంవత్సరాలలో కొందరి కారణంగా వ్యాపారాలలో భారీగా పెట్టుబడి పెట్టాను. అయితే అందులో మోసం జరగడం వలన సుమారు 16 కోట్లు కోల్పోయాను. సోదరభావ నాటకంతో కుట్ర పన్నారు. నా సినిమాలకు థియేటర్లకు రానివ్వలేదు. నా కెరీర్‌ను కావాలనే పడగొట్టారు. అయితే వాటిని పట్టించుకోకుండా ఇప్పుడు 2021లో సరికొత్తగా కెరీర్ ప్రారంభించడానికి నేను సిద్ధంగా ఉన్నాను" అని ఈ సీనియర్ హీరో వివరణ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











