For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Pawan Kalyan: ట్రెండ్ అవుతున్న పవన్ కల్యాణ్ షూ ధర.. నిజంగా అన్ని లక్షలా?.. ఇదిగో క్లారిటీ!

  |

  టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా అప్ డేట్స్ ఉండనవసరం లేదు. ఆయన ప్రజెన్స్ ఉన్న వీడియోలు వదిలిన చాలు ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు. పవన్ కల్యాణ్ తాజాగా నటిస్తోన్న చిత్రం హరిహర వీరమల్లు. ఈ మూవీకి సంబంధించిన కొత్త షెడ్యూల్ ప్రీ ప్రొడక్షన్స్ వర్క్స్ గురించి తెలియజేస్తూ శుక్రవారం ఒక వీడియో వదిలిన సంగతి తెలిసిందే. ఈ వీడియోలో పవన్ కల్యాణ్ కనబడిన తీరుతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే ఈ వీడియోలో పవన్ వేసుకున్న షూపై, దాని ధరపై ఆసక్తి కలిగింది. ప్రస్తుతం ఈ షూ అసలు ధర గురించి నెట్టింట చర్చ జరుగుతోంది.

  ఏమాత్రం క్రేజ్​ తగ్గని హీరో..

  ఏమాత్రం క్రేజ్​ తగ్గని హీరో..

  తెలుగు రాష్ట్రాల్లో పవర్​ స్టార్​ పవన్ కల్యాణ్​కు ఉన్న క్రేజ్​ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హిట్​లు ఫ్లాప్​లు అంటూ తేడా లేకుండా ఏమాత్రం క్రేజ్​ తగ్గని హీరో ఎవరైన ఉన్నారంటే అది పవన్​ కల్యాణ్​ అనే చెప్పవచ్చు. సినిమా సినిమాకు క్రేజ్​ పెంచుకుంటూ పోయే పవన్​ కల్యాణ్​ కొత్త మూవీ వస్తుందంటే చాలు అభిమానులకు పండగే. దానికి సంబంధించి ఏదైనా అప్​డేట్​ వస్తే చాలు రచ్చ రచ్చే.

  మొగల్ కాలం నాటి కథ..

  మొగల్ కాలం నాటి కథ..

  టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను ఏఎమ్ రత్నం భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. మొగల్ కాలం నాటి కథతో రాబోతున్న ఈ సినిమాలో ఈ స్టార్ హీరో వజ్రాల దొంగగా నటిస్తున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్ డేట్ ను ఇచ్చింది చిత్రబృందం.

  కొత్త షెడ్యూల్‌కు సంబంధించిన వర్క్‌షాప్‌..

  కొత్త షెడ్యూల్‌కు సంబంధించిన వర్క్‌షాప్‌..

  ఈ సినిమా కొత్త షెడ్యూల్‌కు సంబంధించిన వర్క్‌షాప్‌ను నిర్వహిస్తున్నారు. దీనికి పవన్ కల్యాణ్ కూడా హాజరయ్యాడు. ఇందులో పవన్ కల్యాణ్ చెప్పిన ''ఉన్నతమైన భాష మాట్లాడి నీచమైన ఆలోచన.. లేదా, ముసలి భాష మాట్లాడి ఉన్నతమైన ఆలోచన.. రెండు కాంట్రాస్ట్ గా ఉంటాయి'' డైలాగ్ ఆకట్టుకుంటోంది. అంతేకాకుండా ఈ వీడియోలో ఆయన లుక్ కూడా అద్భుతంగా ఉంది.

   షూ ధర రూ. 10 లక్షలు..

  షూ ధర రూ. 10 లక్షలు..

  రెడ్ టీషర్ట్, బ్లూ జీన్స్ తో అదిరిపోయాడు పవన్ కల్యాణ్. ఈ లుక్ అందరికీ నచ్చేయడమే కాకుండా మరో వస్తువు అందిరి దృష్టిని ఆకర్షించింది. అదే పవన్ కల్యాణ్ వేసుకున్న షూ. ప్రస్తుతం ఈ షూ ధర గురించే సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ఈ షూ ధర రూ. 10 లక్షలు అని సామాజిక మాధ్యమాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

  లింక్స్ సైతం పోస్ట్..

  లింక్స్ సైతం పోస్ట్..

  మరికొందరైతే ఈ షూ కంపెనీ ఏంటీ.. అవి ఎక్కడ దొరుకుతాయి.. వంటి వివరాలను కూడా పోస్ట్ చేస్తున్నారు. ఆన్ లైన్ లో కొనాలనుకునేవారికి లింక్స్ సైతం పోస్ట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే పవన్ కల్యాణ్ ధరంచిన షూ కంపెనీ పేరు Copenhagen. ఈ షూ కంపెనీ అధికారిక సైట్ లో చూస్తే దీని ధర 119,94 యూరోస్ అని ఉంది. అయితే డచ్ భాషలో పుల్ స్టాప్ ను కామాగా రాస్తారు.

  ఇండియన్ కరెన్సీలోకి కన్వర్ట్ చేసి..

  ఇండియన్ కరెన్సీలోకి కన్వర్ట్ చేసి..

  దీంతో అందరు ఈ ధరను ఇండియన్ కరెన్సీలోకి కన్వర్ట్ చేసి పవన్ కల్యాణ్ వేసుకున్న షూ ధర రూ. 10 లక్షలు అని ప్రచారం చేస్తున్నారు. నిజానికి ఆ షూ ధర 119.94 యూరోలు. అంటే మన భారతదేశ రూపాయిలలో సుమారు రూ. 9,597. అంటే దగ్గరిగా రూ. 10 వేలు అన్నమాట. సో ఇదే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వేసుకున్న షూ ధర కథ.

  రూ. 180 కోట్ల బడ్జెట్‌..

  'హరిహర వీరమల్లు' సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందుతోంది. ఇందులో నిధి అగర్వాల్ కీలక పాత్రను చేస్తోంది. సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏఎమ్ రత్నం నిర్మిస్తున్నారు. ఈ మూవీకి భారీ స్థాయిలో రూ. 180 కోట్ల బడ్జెట్‌ను కేటాయించారనే ప్రచారం జరుగుతోంది.

  English summary
  Tollywood Power Star Pawan Kalyan Wear Shoe Worth Rs 10 Lakh During Hari Hara Veera Mallu Movie New Schedule Workshop News Goes Viral In Social Media.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X