Don't Miss!
- Sports
IND vs NZ: ఇషాన్ కిషన్ పిల్ల చేష్టలపై ఐసీసీ సీరియస్.. కాపాడిన అంపైర్లు! లేకుంటే..?
- News
ఎమ్మెల్యేల ఎరకేసు: బీఎల్ సంతోష్, తుషార్ లకు సిట్ నోటీసులపై స్టే పొడిగింపు; ఎప్పటివరకంటే!!
- Finance
IPO Stock: చెలరేగిపోతున్న స్టాక్.. నెలలోనే షేరుకు రూ.100 లాభం.. మీ దర్గర ఉందా..?
- Lifestyle
Republic Day 2023: పిల్లల కోసం రిపబ్లిక్ డే స్పీచ్ ఐడియాలు.. ఈ టిప్స్ పాటిస్తే ప్రైజ్ మీదే
- Automobiles
భారత్‌లో Aura ఫేస్‌లిఫ్ట్ విడుదల చేసిన హ్యుందాయ్: ధర & వివరాలు
- Technology
స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్ & ఎలక్ట్రానిక్ గాడ్జెట్లపై రిపబ్లిక్ డే ఆఫర్లు!
- Travel
రాయలసీమలో దాగిన రహస్యాల మూట.. గుత్తి కోట!
HBD Sudheer Babu భవ్యోపేతంగా సుధీర్‌బాబు ప్రీ లుక్.. కండలు తిరిగిన బాడీతో కిర్రాక్ స్టిల్
విభిన్నమైన పాత్రలు, విలక్షణమైన నటనతో ఆకట్టుకొంటున్న యువ హీరోల్లో సుధీర్ బాబు అంటే అందులో ఎలాంటి సందేహాలు, అనుమానాలు అక్కర్లేదు. ప్రతీ సినిమాలో తన పాత్రకు ప్రాణం పెట్టి కృషి చేస్తాడు. పాత్ర పరిధి మేరకు తన ఆహార్యాన్ని, బాడీని, బాడీ లాంగ్వేజ్‌ను మార్చుకొనడానికి వెనుకడారు. ఆయన నటించిన చిత్రాలు, ఆయన చేసిన పాత్రలు.. సినిమాపై ఆయనకు ఉన్న అంకిత భావాన్ని తెలియజేస్తాయి. అలాంటి కమిట్‌మెంట్, డెడికేషన్ ఉన్న హీరో సుధీర్ కుమార్ జన్మదినం మే 11 తేదీ. ఈ సందర్భంగా అభిమానులు, సినీ వర్గాలు, నిర్మాత, దర్శకులు ఆయనకు ఘనంగా శుభాకాంక్షలు అందించారు.
సుధీర్ బాబు జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రముఖ నిర్మాణ సంస్థ భవ్య క్రియేషన్స్ చిత్రం బర్త్ డే విషెస్ అందించింది. #Sudheer16 మూవీకి సంబంధించి కండలు తిరిగిన ఫోటోను ఆవిష్కరించింది. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉండబోతుందో అనే విషయాన్ని భవ్య క్రియేషన్స్ అభిమానులకు రుచి చూపించింది.
అద్బుతమైన దేహధారుడ్యంతో తలకిందులుగా ఉన్న సుధీర్ బాబు ఫస్ట్ లుక్ ఫ్యాన్స్‌కు కిర్రాక్ అనిపించింది. సుధీర్ బాబు ఫిట్‌నెస్ ఫ్రీక్‌కు అద్దం పట్టింది. ఇంకా పేరు పెట్టని చిత్రానికి మహేష్ దర్శకత్వం వహిస్తుండగా.. ఫీల్‌గుడ్ చిత్రాలను ప్రేక్షకులకు అందించే ప్రముఖ నిర్మాత వీ ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతున్నది.

#Sudheer16 సినిమాలో శ్రీకాంత్, ప్రేమిస్తే ఫేమ్ భరత్, గోపరాజు రమణ, జెమినీ సురేష్, మైమ్ గోపి, సంజయ్ స్వరూప్ తదితరులు నటిస్తున్నారు. ప్రతిభావంతులైన టెక్నిషియన్స్ పనిచేస్తున్నారు. ఎడిటర్‌గా ప్రవీణ్ పుడి, సినిమాటోగ్రాఫర్‌గా అరుల్ విన్సెంట్, ఆర్ట్ డైరెక్టర్‌గా వివేక్ అన్నామలై పని చేస్తున్నారు.