For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రేప్ కేసుపై తెలుగు హీరో అరెస్ట్.. జైళ్లో కాదు, క్యారవాన్ లో అంటూ భార్య రచ్చ

  |

  సినీ ఇండస్ట్రీ అంటే రంగుల ప్రపంచం. అక్కడ కలర్ ఫుల్ గా లైఫ్ లీడ్ చేయాలని ఎంతోమంది కలలు కంటారు. కానీ ఒక్కోసారి ఆ రంగుల కలలు చీకట్లోకి నెట్టేస్తాయి. పైకి కలర్ ఫుల్ గా కనిపించే ఈ సినీ రంగంలో ప్రేమాయణాలు, వివాహేతర సంబంధాలు, క్యాస్టింగ్ కౌచ్ లు సర్వసాధారణం. అయితే ఇటీవల ఓ టాలీవుడ్ హీరో ప్రేమ పేరుతో తనను వంచించి అత్యాచారం చేశాడని, జూనియర్ ఆర్టిస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కొన్ని నెలలుగా పరారీలో ఉన్న ఆ హీరోను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఇప్పుడు ఆ హీరో భార్య పోలీస్ స్టేషన్ ఎదుట హడావిడి చేసింది. ప్రస్తుతం ఈ టాపిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

  కలలు నెరవేర్చుకునే క్రమంలో..

  కలలు నెరవేర్చుకునే క్రమంలో..

  సినిమా అనే రంగుల ప్రపంచంలో వెలిగిపోవాలని ఎంతో మంది కలలు కంటుంటారు. ఈ కలలు నెరవేర్చుకునే క్రమంలో ప్రేమలు, మోసాలు, అఫైర్లు వంటివి అనేకం చోటుచేసుకుంటాయి. తాజాగా ఇలాంటి సంఘటన చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో తనను మోసం చేసి అత్యాచారం చేశాడంటూ టాలీవుడ్ హీరోపై ఓ జూనియర్ ఆర్టిస్ట్ కేసు పెట్టింది. దీంతో రంగప్రవేశం చేసిన పోలీసులు గత కొంతకాలంగా పరారీలో ఉన్న ఆ హీరోను పట్టుకుని అరెస్ట్ చేశారు. ఈ కేసు విషయంపై పోలీసులు మాట్లాడుతూ.. 'కొత్తగా మా ప్రయాణం' అనే సినిమాతో ప్రియాంత్ రావు అనే వ్యక్తి తెలుగు హీరోగా పరిచయం అయ్యాడు.

  పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి..

  పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి..

  ఈ సినిమా షూటింగ్ సమయంలో ఒక జూనియర్ ఆర్టిస్ట్ తో ప్రియాంత్ రావుకు పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమకు దారితీసింది. పరిచయమైన రెండు నెలల తర్వాత ఆమెకు ప్రియాంత్ ప్రపోజ్ చేయడంతో ఆమె కూడా ప్రియాంత్ రావు ప్రేమను అంగీకరించింది. అప్పటి నుంచి వారి మధ్య ప్రేమాయణం సాగింది. ఒకరోజు హైదరాబాద్ నగర శివారులోని ప్రగతి రిసార్ట్ కు తీసుకెళ్లిన ప్రియాంత్ ఆ జానియర్ ఆర్టిస్ట్ ను పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి ఆమెకు శారీరకంగా దగ్గరయ్యాడు. అప్పటినుంచి ఆ జూనియర్ ఆర్టిస్ట్ ను శారీరకంగా వాడుకుంటూ వస్తున్నాడు. అయితే ఈ మధ్య కాలంలో బాధితురాలు ప్రెగ్నెంట్ కావడంతో ప్రియాంత్ ఆమెకు మొహం చాటేశాడు.

  అబార్షన్ కోసం మెడిసిన్..

  అబార్షన్ కోసం మెడిసిన్..

  ఇప్పుడు కరెక్ట్ కాదని చెబుతూ అబార్షన్ కోసం ఆమెకు మెడిసిన్ కూడా ఇవ్వడంతో ఆమె అనారోగ్యం పాలైంది. అంతేకాకుండా ఈ విషయం బయటకు తెలిస్తే తనను చంపేస్తానని బెదిరిస్తూ ఉండటంతో బాధితురాలు జులై 9న హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అప్పటి నుంచి ప్రియాంత్ కోసం గాలించారు. అయితే అనేక రోజుల తర్వాత పట్టుబడిన ప్రియాంత్ రావును అరెస్ట్ చేశారు. అయితే తాజాగా ప్రియాంత్ రావు భార్య అంటూ అతని కోసం పోలీసు స్టేషన్ ఎదుట హల్ చల్ చేసింది ఓ మహిళ. సార్ మా ఆయన సినిమా హీరో. లాకప్ లో దోమలు, ఈగలు, వేడితో ఇబ్బందులు పడుతున్నాడు.

  రాత్రంతా ఉండటానికి అనుమతి ఇవ్వండి..

  రాత్రంతా ఉండటానికి అనుమతి ఇవ్వండి..


  దయచేసి క్యారవాన్ లో ఉండటానికి అనుమతి ఇవ్వండి అంటూ పోలీసులకు చెప్పసాగింది. అంతేకాకుండా పోలీస్ స్టేషన్ దగ్గరికి క్యారవాన్ కూడా తీసుకొచ్చాను. రాత్రంతా అందులో ఉండటానికి అనుమతి ఇవ్వండి అని కోరింది. ఆమె విన్నపానికి పోలీసులు షాక్ అయ్యారు. చట్టం అందుకు ఒప్పుకోదని చెప్పగా క్యారవాన్ పోలీస్ స్టేషన్ ఆవరణలోనే ఉంచుతామని, సిబ్బంది ఎందుకని ఎదురు ప్రశ్నించింది ఆ మహిళ. రూల్స్ ఒప్పుకోవమ్మా.. అంటూ పోలీసులు నచ్చజెప్పినా గంటపాటు తన భర్తను క్యారవాన్ లో ఉంచేందుకు పోలీసులను బతిమిలాడింది ఆ మహిళ. తర్వాత ఏదో ఒకటి చెప్పి ఆమెను పంపించడంతో ఊపిరి పీల్చుకున్నారు పోలీసులు. కాగా 'కొత్తగా మా ప్రయాణం' హీరో ప్రింయాంత్ రావుపై జూబ్లీ హిల్స్ పోలీసు స్టేషన్ లో రేప్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయింది.

  English summary
  Rape Case Filed On Kothaga Maa Prayanam Heroine Priyanth Rao And His Wife Requested Police To Stay Her Husband In Caravan Not In Jail.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X