twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మంచి చేద్దామని వచ్చాం, ఆ గొడవల సంగతి మాకు తెలియదు: హీరో రాజశేఖర్

    |

    ఇటీవల జరిగిన 'మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్' ఎన్నికల్లో శివాజీ రాజా ప్యానల్ మీద నరేష్ ప్యానల్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. కొత్తగా ఎన్నికైన నరేష్ ప్యానల్ మార్చి 22న ప్రమాణ స్వీకారం చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తయిన తర్వాత... 'మా'జీ అధ్యక్షుడు శివాజీ రాజా వివాదానికి తెర లేపారు. తాను మార్చి 31 వరకు పదవిలో ఉంటాను, అప్పటి వరకు 'మా' ప్రెసిడెంట్ సీటును ఎవరూ టచ్ చేయడానికి వీల్లేదని, అవసరం అయితే తాను కోర్టుకు వెళతానని చెప్పినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కొత్తగా ఎన్నికైన ప్యానల్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. నరేష్ ప్యానల్ నుంచి ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంటుగా ఎన్నికైన హీరో రాజశేఖర్ మాట్లాడుతూ ఎమోషనల్‌గా రియాక్ట్ అయ్యారు.

    మంచి చేద్దామని వచ్చాం, ఆ గొడవల సంగతి మాకు తెలియదు

    మంచి చేద్దామని వచ్చాం, ఆ గొడవల సంగతి మాకు తెలియదు

    ఏదైనా మంచి పని చేద్దామనే ఉద్దేశ్యంతో నేను, జీవిత ‘మా' ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. అందరి మద్దతుతో గెలించాం. ‘మా'లో వివాదాల గురించి మాకు పూర్తిగా తెలియదు. నరేష్ అప్పుడప్పుడు కొన్ని విషయాలు చెబుతుండేవారు.

    ఆకతాయి ఆటలు ఆపు...

    ఆకతాయి ఆటలు ఆపు...

    గతంలో జరిగిన గొడవలు, వివాదాల గురించి మరిచిపోదాం. ఎన్నికలు పూర్తయ్యాయి. అందరి మద్దతుతో గెలుపొందిన మమ్మల్ని పని చేయడానికి అనుమతించండి. మేము చార్జ్ తీసుకోకుండా అడ్డ కోవడం సరికాదు. ఈ వయసులో ఇలాంటి ఆకతాయి ఆటలు ఆడటం ఎవరికీ మంచిదికాదు.

    శివాజీ రాజా నీకో దండం

    శివాజీ రాజా నీకో దండం

    శివాజీ రాజా మీకు ఒక నమస్కారం... మనం అందరం కలిసి పని చేద్దాం. ముందు నుంచీ మేము చెబుతున్నది అదే. ఎందుకంటే ఇది ఒక ప్యానల్ మెంబర్స్ మాత్రమే చేస్తే అయ్యే పని కాదు. అందరూ కలిసి కట్టుగా చేస్తేనే అభివృద్ధి సాధ్యం. నేను దీన్ని సిన్సియర్‌గా కోరుకున్నా.

    మాతో కలిసి స్నేహంగా పని చేయాలని కోరుకుంటున్నా

    మాతో కలిసి స్నేహంగా పని చేయాలని కోరుకుంటున్నా

    ముహూర్తం మార్చి 22 కాకపోతే ఏప్రిల్ 1 తర్వాత పెట్టుకుందాం. మీరు ఆ తర్వాత అయినా మాతో కలిసి స్నేహంగా పని చేయాలని కోరుకుంటున్నారు. అంతా కలిసి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ను ఒక స్థాయి తీసుకెళదామని... రాజశేఖర్ కోరారు.

    English summary
    Hero Rajasekhar Emotional Speech at MAA Press Meet. Rajasekhar requested Shivaji Raja to cooperate MAA development.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X