ఆ వ్యాధితో బాధపడుతున్నా.. హీరో రాజశేఖర్ ఎమోషనల్

సాధారణంగా సినీ రంగంలో ఉన్న నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణులు తమకున్న అనారోగ్య సమస్యలను అస్సలు బయటపెట్టరు. సీక్రెట్‌గా ట్రీట్‌మెంట్ తీసుకుంటూ, ఎప్పటికీ విషయం బయటపడకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే ఇటీవలికాలంలో దీనికి భిన్నంగా పరిస్ధితులు కనిపిస్తున్నాయి. నటీనటుల్లో ప్రత్యేకించి హీరోయిన్లు తమకున్న అనారోగ్యాలను బయటపెడుతున్నారు. స్టార్ హీరోయిన్ సమంత తాను మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు ప్రకటించి కలకలం రేపారు. సమంత లాంటి స్టార్ ఇచ్చిన ధైర్యంతో పలువురు ముద్దుగుమ్మలు తమ ఆరోగ్య సమస్యలను తెలియజేస్తున్నారు.

అరుదైన వ్యాధులతో తారలు సతమతం
అగ్ర కథనాయిక అనుష్క శెట్టి .. సూడో బల్బర్ అనే సిండ్రోమ్‌తో బాధపడుతున్నారు. ఈ వ్యాధి ఉన్నవారు తమ నవ్వును కంట్రోల్ చేసుకోలేరు. చిన్న కారణానికే నవ్వడం, కనీసం 10 నుంచి 15 నిమిషాల పాటు నవ్వుతూనే ఉండటం దీని లక్షణాలు. తమిళ నటి, సింగర్ ఆండ్రియాకి ఆటో ఇమ్యూన్ స్కిన్ కండీషన్ అనే వ్యాధి ఉందట. ఇది ఉన్న వారికి కనుబొమ్మలు, వెంట్రుకలు బూడిద రంగులోకి మారిపోతాయట. ఇక పలువురు తారలు క్యాన్సర్‌ వంటి మహమ్మారితో పోరాటం చేస్తున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లోకి చేరారు టాలీవుడ్ సీనియర్ నటుడు, యాంగ్రి యంగ్‌మెన్ డాక్టర్ రాజశేఖర్.

Hero Rajashekhar revealed his health problem in sharwanand s Biker Glimpse Launch Event

పవర్‌ఫుల్ రోల్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా
డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యామంటూ పలువురు నటులు చెబుతారు. కానీ మెడిసిన్ చదివి డాక్టర్‌గా ప్రాక్టీస్ చేస్తూనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి లక్షలాది మంది అభిమానులను సంపాదించారు రాజశేఖర్. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వంటి స్టార్స్‌ టాలీవుడ్‌ను ఏలుతున్న సమయంలో తమిళనాడు నుంచి వచ్చి సంచలన విజయాలు సాధించారు డాక్టర్ రాజశేఖర్. పోలీస్ పాత్రలతో పాటు పవర్‌ఫుల్ రోల్స్‌కు కేరాఫ్‌గా నిలిచారు రాజశేఖర్. తన నటనతో ఎంతో మంది యువత పోలీస్ యూనిఫాం ధరించి దేశ సేవలో నడిచేందుకు ప్రేరణగా నిలిచారు. యాక్షన్ సినిమాలే కాదు, ఫ్యామిలీ, రొమాంటిక్, లవర్ బాయ్‌గానూ అలరించారు.

బైకర్‌లో రాజశేఖర్ కీలకపాత్ర
ఆ తర్వాత ఎందుకో రాజశేఖర్ స్లో అయ్యారు. రెండేళ్లకో మూడేళ్లకో ఓ సినిమా అన్నట్లుగా నెట్టుకొస్తున్నారు. అయితే రాజశేఖర్ పని అయిపోయిందని అంతా అనుకుంటున్న సమయంలో పీఎస్‌వీ గరుడ వేగ సినిమాతో హిట్ అందుకుని తన సత్తా నిరూపించుకున్నారు. కానీ మళ్లీ ఆయనకు వరుస ఫ్లాపులు ఎదురయ్యాయి. చివరిసారిగా ఎక్స్‌ట్రా ఆర్డినరీ మెన్ సినిమాలో కనిపించారు రాజశేఖర్. ఇక ఆయన సినిమాలకు దూరమయ్యారని భావిస్తుండగా షాకిచ్చారు రాజశేఖర్. శర్వానంద్ హీరోగా నటిస్తున్న బైకర్‌లో ఈ యాంగ్రీ యంగ్‌మెన్ కీలకపాత్ర పోషిస్తున్నట్లుగా ఇటీవల గ్లింప్స్‌ చూస్తే తెలిసింది. దాంతో రాజశేఖర్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా బైకర్ గ్లింప్స్‌ రిలీజ్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఖాళీగా ఇంట్లో ఉంటే జైలే
ఫారిన్‌లో సాంగ్ షూటింగ్ చేస్తుండగా.. అక్కడి ఫోటోగ్రాఫర్‌తో పనిచేయించారు. మీరు ఎన్నేళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నారు? ఏమేం సినిమాలు చేస్తున్నారు అని అడిగారు. నేను నా ప్లాన్స్ అన్ని చెప్పగా... మీరు వెరీ లక్కీ అండీ అని ఆ ఫోటోగ్రాఫర్ చెప్పారు. ఇంకా మీరు పనిచేస్తున్నారు.. వెరీ లక్కీ అని అన్నారు. అప్పుడు దాని గురించి నేను పెద్దగా పట్టించుకోలేదు. కానీ నిజంగా వర్క్ లేకుండా ఇంట్లో ఉంటే అది జైలే.. నాకు కరోనా వచ్చిన తర్వాత, నా పనులు నేను చేసుకోలేక నడవలేను అన్న పరిస్ధితుల్లో ఉన్నప్పుడు ఎలాగైనా బయటపడాలని కష్టపడి 2, 3 నెలల్లో నడిచి కోలుకున్నా. 6 నెలల్లో కంప్లీట్‌గా తయారైపోయాను, కానీ నాకు వర్క్ కావాలి.. నేను హీరోగా చేస్తున్నప్పుడు లుక్ ఎలా ఉండాలి? ఎలా తయారవ్వాలి అని ప్లాన్ ఉండేది? అలా 100 సినిమాలు చేసి అలిసిపోయాను అని రాజశేఖర్ చెప్పారు.

క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అవకాశాలు వచ్చాయి
ఆ తర్వాత ఏం చేయాలి? హీరోగా చేయడం మేటర్ కాదు, ఇంకా మిగిలిన మంచి రోల్స్ కూడా చేద్దామని అనుకున్నా. ఈ విషయం తెలిసి నాతో సినిమాలు చేయడానికి చాలామంది వచ్చారు. కానీ ఆ సినిమాల కథలు నేను విన్నప్పుడు ఇది చేయకుండా ఉంటేనే బెటర్ అనిపించి, చాలా సినిమాలను వదులుకున్నా. ఇలా నిరాశగా ఉన్నప్పుడు అభి వచ్చి బైకర్ ఫిల్మ్ స్టోరీ చెప్పాడు. శర్వానంద్ గారు హీరోగా ఉన్నప్పుడు నేను మరో రోల్ చేస్తే బాగుంటుందా అని అనిపించి, సబ్జెక్ట్ బాగుందని ఆ సినిమా చేయడానికి ఒప్పుకున్నా. ఈ సినిమా చాలా బాగా రావడంతో తృప్తి కలిగిందని రాజశేఖర్ అన్నారు.

ఆ వ్యాధితో బాధపడుతున్నా
ఇవాళ ఫంక్షన్ ఉంది, మీరు వచ్చి మాట్లాడాలని అభిగారు చెబితే.. నేనొచ్చి ఏం మాట్లాడేది, నాకు మామూలుగానే ఇరిటేబుల్ బౌల్ సిండ్రోమ్. ఎప్పటి నుంచో సఫర్ అవుతున్నా.. ఆయన ఈవెంట్ గురించి చెప్పగానే నాకు యాంగ్జయిటీ, నా కడుపు చెడిపోయింది.. వచ్చి చెడగొట్టబోతున్నాని ఒక ఐడియాకి వచ్చేశా. వచ్చి ఏదో మాట్లాడాలి కాబట్టి మనసులో ఉన్నది చెబుతున్నా. శర్వానంద్ గారు బాగా సహకరిస్తారు, గౌరవిస్తారు. మొన్న షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆయనని కలిశాను.. ఫస్టాఫ్ డబ్బింగ్ చెప్పాను, చూశాను.. సూపర్‌గా చేశారు, నాకు గూస్‌బంప్స్ వచ్చాయి.. ఈ సినిమా చేసినందుకు చాలా థ్యాంక్స్ చెప్పారు. నాకు పెద్ద అవార్డ్ వచ్చినట్లు నేను ఫీలయ్యానని రాజశేఖర్ తెలిపారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. రాజశేఖర్ త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

More from Filmibeat

Read more about: rajashekhar sharwanand movie news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X