Don't Miss!
- Sports
అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన టీమిండియా స్టార్ ఓపెనర్!
- Lifestyle
హీమోగ్లోబిన్ తక్కువైతే ప్రమాదమే..కార్డియాక్ అరెస్ట్ కు కారణం అవుతుంది. కాబట్టి, ఈ ఆహారాలు తినండి..
- News
అధికారం ఎవడబ్బ సొత్తు కాదు: కేసీఆర్ సర్కారుపై పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలనం
- Technology
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
- Finance
Q3 Results: అదరగొట్టిన L&T.. మిస్ కొట్టిన టెక్ మహీంద్రా.. గెయిల్ కు ఎదురుదెబ్బ..
- Automobiles
భారతీయ మార్కెట్లో Hero XOOM ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల: ప్రైస్, వేరియంట్స్ & కలర్ ఆప్సన్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
అనుపమ పరమేశ్వరన్ కంటతడి.. 18 పేజేస్ క్లైమాక్స్ విషయంలో.. నిఖిల్ సిద్దార్థ్
ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ జీఏ 2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 18 పేజేస్. కార్తీకేయతో ప్యాన్ ఇండియా హీరోగా మారిన నిఖిల్ సిద్దార్థ , అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్నారు. ఈ సినిమాను బన్నీ వాసు నిర్మిస్తున్నారు. మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. ఈ సినిమాను క్రిస్టమస్ కానుకగా డిసంబర్ 23న రిలీజ్ అవుతున్నది. ఈ నేపథ్యంలో నిఖిల్ సిద్దార్థ మీడియాతో మాట్లాడుతూ...
అనుపమ పరమేశ్వరన్‌తో నాకు వరుసగా రెండో సినిమా. కార్తీకేయ 2 చిత్రంలో కూడా కలిసి నటించాం. ఇప్పుడు 18 పేజేస్ మూవీలో నటించడం వెనుక ఆమె మేనేజర్ కారణం. నేను రెండు సినిమాలు చేస్తున్నానని తెలిసి.. అనుపమ మేనేజర్ నాతో, ఆమెతో కో ఆర్డినేట్ చేశారు. కార్తీకేయ 2 సినిమాకు అనుపమ పరమేశ్వరన్ చాలా యాప్ట్. 18 పేజేస్ సినిమాలో రోల్ వేరు. తెర మీద మా ఇద్దరి బాండింగ్ బాగుంటుంది. అయితే ఈ సినిమాకు అనుపమను అనుకొన్నప్పుడు.. బన్నీ వాసును నేను అడిగాను.. అనుపమతో నాకు రెండో సినిమా. మీకు ఒకేనా అని అడిగాను. అయితే గీతా ఆర్ట్స్ కూడా ఫర్వాలేదని చెప్పారు. దాంతో అనుపమ ఈ సినిమాలోకి అలా వచ్చింది అని నిఖిల్ తెలిపారు.

18 పేజేస్ సినిమా యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. తల్లిదండ్రులు, పిల్లల మధ్య ఎమోషన్స్ ఉంటాయి. తప్పకుండా ప్రతీ ఒక్కరిని ఈ సినిమా ఆకట్టుకొంటుందనే విశ్వాసం ఉంది. ఈ సినిమా విజయంతో 2022 ఘనంగా ముగించాలని కోరుకొంటున్నాను. అందుకే కొంత టెన్షన్‌గా ఉంది అని నిఖిల్ అన్నారు.
18 పేజేస్ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ ఇటీవల అనుపమ పరమేశ్వరన్ పూర్తి చేసింది. క్లైమాక్స్‌లో సీన్లు చూసి అనుపమ కంటతడి పెట్టింది. అలా కంటతడితోనే ఆమె తన ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు పెట్టింది. మా ఇద్దరి పాత్రల మధ్య బాండింగ్ చాలా వర్కవుట్ అయింది. స్క్రీన్ మీద మీరు చూస్తే.. ఈ సినిమాలో మా బాండింగ్ ఎలా ఉంటుందో మీకే అర్ధం అవుతుంది అని నిఖిల్ చెప్పారు.
కార్తీకేయ 2 సక్సెస్ తర్వాత సినిమా కథలను ఎంచుకోవడం పెద్ద ఛాలెంజ్. సినిమాలో ఎక్సైటింగ్ ఎలిమెంట్స్ లేకపోతే ఆడియెన్స్ థియేటర్‌కు రావడం లేదు. అందుకే సినిమా కథలు ఆడియెన్స్ ఎక్సైటింగ్‌గా ఉండేలా చూసుకొంటున్నాను అని నిఖిల్ తెలిపారు. స్పై అనే ప్యాన్ ఇండియా సినిమా చేస్తున్నాను. బాలీవుడ్ నుంచి చాలా ఆఫర్లు వచ్చాయి. కానీ అవన్నీ పరిశీలనలో ఉన్నాయి.