Naveen Polishettyకి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు.. వాచ్‌మెన్ స్వీకరించారంటూ
టాలీవుడ్‌లో జాతి రత్నాలు సినిమాతో నవీన్ పోలిశెట్టి భారీ హిట్‌ను ఖాతాలో వేసుకోవడమే కాకుండా మంచి పాపులారిటీ సంపాదించుకొన్నారు. కామెడీ, ఎమోషన్స్ పండిస్తూ తనకంటూ ప్రేక్షకుల్లో ఓ వర్గాన్ని అభిమానులుగా మరిచిపోయారు. కామెడీ టైమింగ్ మాత్రమే కాకుండా భావొద్వేగమైన పాత్రల్లో రాణిస్తారనే విషయం బాలీవుడ్‌లో చిచ్చోరే సినిమాతో రుజువు చేశాడు. అయితే టాలీవుడ్‌లో ఆయనకు మంచి పేరు తెచ్చి పెట్టిన ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమా ఓ రేంజ్‌ను అందిస్తే.. ఇప్పుడు ఆ సినిమా అరుదైన అవార్డును అందించింది.
ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ చిత్రంలో ఉత్తమ నటన ప్రదర్శించినందుకు గాను నవీన్ పోలిశెట్టికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు లభించింది. కోవిడ్ కారణంగా ఆ అవార్డును అందుకోలేకోవడంతో నేరుగా నిర్వాహకులు ఇంటికి పంపించారు. అయితే ఆ సమయంలో అవార్డును తన అపార్ట్‌మెంట్ వాచ్‌మెన్ తీసుకోవడం జరిగింది. ఆ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ఈ రోజు నా ఇంటికి వచ్చింది. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాలో నా ప్రతిభను గుర్తించి ఈ అవార్డును ఇచ్చారు. కోవిడ్ ఆంక్షల కారణంగా నేను స్వీకరించలేకపోయాను. దాంతో ఆ అవార్డును నా ఇంటికి పంపించారు. ఆ సమయంలో నేను ఇంట్లో లేను. దాంతో మా వాచ్‌మెన్ తీసుకొన్నాడు. నా కెరీర్‌లో ఇదే తొలి ఉత్తమ నటుడి అవార్డు అంటూ నవీన్ పొలిశెట్టి ఎమోషనల్ అయ్యారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ట్వీట్ చేసి అభిమానులు, నెటిజన్లతో పంచుకొన్నారు.
నవీన్ పోలిశెట్టి వ్యకిగత విషయానికి వస్తే.. సామాజిక సృహ కూడా ఎక్కువే. కరోనా లాక్ డౌన్ కారణంగా ఉద్యోగం కోల్పోయిన యువ నిరుద్యోగికి అండగా నిలిచి జాబ్ వచ్చేలా సహకరించారు. తన రిక్వెస్ట్ మేరకు ఓ రెస్టారెంట్‌లో ఉద్యోగం రావడంపై ఇటీవల ట్విట్టర్‌లో స్పందించారు.
నవీన్ పోలిశెట్టి కెరీర్ విషయానికి వస్తే.. లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టినప్పటికి.. పెద్దగా గుర్తింపు రాలేదు. ఆ తర్వాత డీ ఫర్ దోపిడి, మహేష్ బాబు నటించిన 1 నేనొక్కడినే చిత్రాల్లో నటించినా పెద్దగా రాణించలేదు. కానీ ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమా హీరోగా నిలబెట్టేలా చేసింది. ఆ తర్వాత నవీన్ వెనుకకు తిరిగి చూసుకోలేదు. హిందీలో సుశాంత్ సింగ్ రాజ్‌తో చిచ్చోరే, ఆ తర్వాత జాతిరత్నాలు సినిమాతో భారీ విజయాలను అందుకొన్నారు. జాతి రత్నాలు సినిమా కమర్షియల్ హీరోగా ఎదిగాడు. ఆ సినిమా 4 కోట్ల రూపాయలతో రూపొందిస్తే.. సుమారు 70 కోట్లు సాధించింది. ఇక చిచ్చోరే సినిమా రూ.200 క్లబ్‌లో చేరింది.
ఇక జాతి రత్నాలు సినిమా తర్వాత పలు సినిమాల్లో నటించేందుకు సిద్దమయ్యారు. అనుష్కశెట్టితో కలిసి ఓ సినిమాలో నటించేందుకు సిద్ధమవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఓ సినిమా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇలా ప్రతిభతో ఆకట్టుకొంటున్న నవీన్ పోలిశెట్టి మరెన్నో అవార్డులు, రివార్డులు అందుకోవాలని ఫిల్మీబీట్ తెలుగు కోరుకొంటున్నది.


Click it and Unblock the Notifications











