NTR 30: ఎన్టీఆర్ ఫ్యాన్స్ అదిరిపోయే వార్త.. కొరటాల శివ సినిమాకు ముహుర్తం ఫిక్స్

యంగ్ టైగర్ నందమూరి తారక రామారావు తన కెరీర్‌లో ఎన్నడూ లేని విధంగా విపత్కర పరిస్థితి ఎదుర్కొంటున్నారు. గత మూడేళ్లుగా తారక్ అభిమానులకు, ప్రేక్షకులకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అందుకు కారణం RRR సినిమాకే పరిమితం కావడం. ఎన్టీఆర్ 2018లో అరవింద సమేత వీర రాఘవ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ తర్వాత RRR సినిమాకే తన కెరీర్‌ను అంకితం చేశారు. RRR సినిమా రిలీజ్ పలుమార్లు, షూటింగ్ కూడా అనేకసార్లు వాయిదా పడటంతో మరో సినిమాను ప్రారంభించలేకపోయారు.

వాస్తవానికి ఎన్టీఆర్‌ మరోసారి త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌తో సినిమా చేయాల్సింది. కానీ అనూహ్యంగా ఆ సినిమా వాయిదా పడటంతో కొరటాల శివతో సినిమాను లైన్‌లో పెట్టారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రారంభోత్సవం, షూట్ ఇప్పటికే మొదలు కావాల్సింది. కానీ మళ్లీ కరోనావైరస్ ఈ సినిమాకు అడ్డుగా నిలిచింది.

Jr NTR and Koratal Siva date fixed for NTR 30 opening

అయితే కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో ఎన్టీఆర్ 30గా పేర్కొంటున్న సినిమా ఫిబ్రవరి 18వ తేదీన ముహుర్తం, పూజా కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. సినిమా షూట్ మార్చి 2022లో ప్రారంభించి శరవేగంగా సినిమాను ముగించే ఆలోచనలో ఉన్నారు. ఈ స్క్రిప్ట్ లాక్ చేసిన్టటు తెలిసింది. ఈ సినిమాకు ది లీడర్ అనే వర్కింగ్ టైటిల్‌తో NTR30 హ్యాష్ ట్యాగ్‌ను అభిమానులు ట్రెండ్ చేస్తున్నారు.

NTR30 చిత్రంలో హీరోయిన్‌గా అలియాభట్ నటించనున్నారు. ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందించనున్నారు అని సినీ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X