twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Jr NTR తల్లిదండ్రులను పొగొట్టుకొన్నాడు.. సినిమా అంటే అంత తపనా? ఎన్టీఆర్ ఎమోషనల్

    |

    ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నూతన దర్శకుడు రాజేంద్ర రెడ్డి రూపొందించిన చిత్రం అమిగోస్. నందమూరి కల్యాణ్ రామ్, అశికా రంగనాథ్ జంటగా నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 10వ తేదీన రిలీజ్‌కు సిద్దమైంది. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకు ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ..

    సినిమాకు దర్శకత్వం తర్వాతే..

    సినిమాకు దర్శకత్వం తర్వాతే..

    అమిగోస్ ఫిబ్రవరి 10న రిలీజ్ అవుతున్నందున ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కలిశాం. ఈ సినిమా గురించి మాట్లాడే ముందు ఈ చిత్ర దర్శకుడు రాజేంద్ర గురించి మాట్లాడాలి. రాజేంద్ర ఇంజీనీరింగ్ పూర్తి చేసిన తర్వాత తల్లిదండ్రులు ఉద్యోగం చేయమంటే.. సినీ పరిశ్రమకు వెళ్తానని పట్టుబట్టారు. సినిమాకు దర్శకత్వం వహించిన తర్వాతే ఇంట్లో అడుగుపెడుతాను అని చెప్పారు. సినిమా అంటే ఇంత అభిమానం ఉన్న వ్యక్తిని రాజేంద్రలో చూస్తున్నాను అని ఎన్టీఆర్ అన్నారు.

    తల్లిదండ్రులు భౌతికంగా లేకపోయినా

    తల్లిదండ్రులు భౌతికంగా లేకపోయినా

    అమిగోస్ సినిమా మొదలుపెట్టిన తర్వాత తల్లి కాలధర్మం చేశారు. సినిమా పూర్తయ్యే ముందు ఆయన తండ్రి మరణించారు. సినిమా పట్ల ఓ మనిషికి తాపత్రయం ఉంటుందా అని అనిపించింది. అమ్మ, నాన్నలు భౌతికంగా లేకపోయినా ఈ ఫంక్షన్‌లో ఉన్నారు. మీరు సాధించిన మొదటి మెట్టును చూశారు. ఫిబ్రవరి 10న సాధించే సక్సెస్‌ను కూడా చూస్తారు. మీ ఉన్నతిని చూసి గర్వ పడుతారు అని ఎన్టీఆర్ అన్నారు.

    85 ఏళ్లలో చరిత్ర సృష్టించిన మైత్రీ

    85 ఏళ్లలో చరిత్ర సృష్టించిన మైత్రీ

    అమిగోస్ మూవీ నిర్మాతలు గురించి చెప్పాలంటే.. నవీన్, రవి ప్రకాశ్ నా శ్రేయోభిలాషులు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతల గురించి నేను, కొరటాల శివ జోకులు వేసుకొంటాం. వారిద్దరికి భలే సుడి ఉంది. ఈ సంక్రాంతికి రెండు సినిమాలు తీసి.. రెండు బ్లాక్‌బస్టర్లు కొట్టారు. 85 ఏళ్ల సుదీర్ఘమై చరిత్రలో ఒకే ప్రొడ్యూసర్స్.. రెండు సినిమాలు తీసి హిట్లు కొట్టి చరిత్ర సృష్టించారు. అమిగోస్ సినిమాతో హ్యాట్రిక్ కొట్టాలని ఆకాక్షిస్తున్నాను అని ఎన్టీఆర్ అన్నారు.

    అషికా రంగనాథ్‌కు ఆహ్వానం

    అషికా రంగనాథ్‌కు ఆహ్వానం

    అమిగోస్ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన అషికా రంగానాథ్‌కు తెలుగులో ఇది తొలి చిత్రం. ఆమె తెలుగులోనే కాకుండా భారతీయ సినిమా రంగంలో రాణించాలని కోరుకొంటున్నాను. ఇంకా ఈ సినిమాక పనిచేసిన సాంకేతిక నిపుణులకు మంచి విజయం దక్కాలని కోరుకొంటున్నాను అని ఎన్టీఆర్ చెప్పారు.

    ప్రయోగాలు చేయడంలో కల్యాణ్ అన్న దిట్ట

    ప్రయోగాలు చేయడంలో కల్యాణ్ అన్న దిట్ట

    ఇక కల్యాణ్ రామ్ గురించి ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ఆయన ఏవీ చూస్తుంటే.. ఆయన నాకు సీనియర్. బాలగోపాలుడు సినిమాను నాకంటే ముందు చేశారు. మా కుటుంబంలో ఎక్కువ ప్రయోగాత్మక చిత్రాలు చేసిన వ్యక్తి కల్యాణ్ రామ్. టెక్నాలజీకి, ప్రయోగాలకు పెద్ద పీట వేసింది కల్యాణ్ రామ్ అన్నయ్యే.

    అయితే మాస్ సినిమా ఎప్పుడు చేస్తాడా అని ఎదురు చూస్తే.. బింబిసారతో భారీ హిట్ కొట్టాడు. అమిగోస్ చిత్రంలో మూడు పాత్రలు చేశారు. నేను జై లవకుశ చిత్రంలో మూడు పాత్రలు చేశాను. అలా మూడు పాత్రలు చేయడం ఎంత కష్టమో నాకు తెలుసు అని ఎన్టీఆర్ పేర్కొన్నారు.

    అభిమానులలపై చిరాకుపడిన ఎన్టీఆర్

    అభిమానులలపై చిరాకుపడిన ఎన్టీఆర్

    ఇక అమిగోస్ సినిమా పంక్షన్‌కు వచ్చిన అభిమానులు తన తదుపరి చిత్రం అప్ డేట్ చెప్పమని ఎన్టీఆర్ చిరాకు పడ్డారు. తాను మాట్లాడేటప్పుడు గొడవ చేయవద్దు. నేను అనారోగ్యంతో బాధపడుతున్నాను. నిలబడే పరిస్థితి కూడా లేదు. కాబట్టి నేను చెప్పేది జాగ్రత్తగా వినమని అభ్యర్థించారు. అభిమానులను కేకలు ఆపాలని ఎన్టీఆర్ విన్నపం చేశారు. ఆ తర్వాత అమిగోస్ సినిమా గురించి మాట్లాడారు.

    English summary
    Nandamuri Kalyan Ram's amigo pre release Event held in Hyderabad. Here is the Jr NTR emotional speech about Ashika Ranganath and Rajendra Reddy at Amigos Pre Release Event
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X