For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నందమూరి ఫ్యాన్స్ కాలర్ ఎగిరేసేలా బింబిసార.. ఆ భయం వెంటాడింది అంటూ ఎన్టీఆర్ ఎమోషనల్

  |

  యువ దర్శకుడు వశిష్ట దర్శకత్వంలో కల్యాణ రామ్, సంయుక్త మీనన్, క్యాథరీన్ త్రెసా నటించిన బింబిసార చిత్రం ఆగస్టు 5వ తేదీన రిలీజ్ కానున్నది. ఈ క్రమంలో యూనిట్ హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఏర్పాటు చేసిన బింబిసార ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ..

  దర్శకుడు ఎలా హ్యాండిల్ చేస్తారో అని

  దర్శకుడు ఎలా హ్యాండిల్ చేస్తారో అని


  సుమారు రెండున్నర సంవత్సరాల క్రితం కల్యాణ్ రామ్ అన్న కాల్ చేసి.. నాన్న ఒక మంచి కథ విన్నాను. ఒకసారి నువ్వు వింటే బాగుంటుందని అన్నాడు. దర్శకుడు వశిష్ట నాకు ముందు వేణుగా పరిచయం. వేణు కథ చెప్పిన తర్వాత నాలో ఒక భయం మొదలైంది. ఇంత పెద్ద కథను, భారీ బడ్జెట్ సినిమాను కొత్త దర్శకుడు ఎలా హ్యాండిల్ చేస్తాడో అనే భయం నాలో కలిగింది. ఇప్పటికే ఈ సినిమాను నేను మీ అందరికంటే ముందే చూశాను. ఎంత కసితో అయితే తన ఆ రోజు బింబిసార కథను చెప్పాడో.. అంతకంటే గొప్పగా సినిమాను తెరపైన మలిచాడు అని ఎన్టీఆర్ అన్నాడు.

  ఎంత గొప్పగా రూపొందించారంటే

  ఎంత గొప్పగా రూపొందించారంటే


  బింబిసార కథ, కథనాలు తెలుసు. కథలో ఏం జరుగబోతుందో తెలుసు. ఈ మూవీ గురించి అంతా తెలిసినా.. నేను సినిమా చూసేటప్పుడు నేను గురైన ఎక్సైట్‌మెంట్‌.. థియేటర్లో ప్రేక్షకుడు కూడా గురవుతాడని నేను బలంగా నమ్ముతున్నాను. ఈ సినిమానే ఇంత గొప్పగా రూపొందించారంటే.. భవిష్యత్‌లో ఎంత గొప్ప సినిమాలు చిత్రీకరించబోతాడో అనే విషయానికి బింబిసార మూవీ ఒక టీజర్. హ్యాట్సాఫ్ వేణు. బింబిసార కేవలం నీ ఫ్యూచర్‌కు ఒక ట్రైలర్. ఈ సినిమా రిలీజ్ తర్వాత ఇంకా చాలా మాట్లాడుకొందాం అని ఎన్టీఆర్ తెలిపారు.

   చోటా కే నాయుడు కొత్తగా

  చోటా కే నాయుడు కొత్తగా


  బింబిసార సినిమాకు గొప్ప సాంకేతిక నిపుణులు పనిచేశారు. అందులో చోటా కే నాయుడు ఒకరు. ఆయనతో ఎన్నో గొప్ప సినిమాలు చేశాను. నాకు బింబిసార సినిమా చూసినప్పుడు కొత్త చోటా కే నాయుడు కనిపించాడు. ఈ సినిమాకు ఎంత ప్రాణం పోశాడో మీరే థియేటర్లలో చూస్తారు. అలాగే ఈ చిత్రంలో పనిచేసిన నటీనటులు, ఈ సినిమాకు శక్తిని అందించిన సాంకేతిక నిపుణులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని ఎన్టీఆర్ అన్నారు.

  బింబిసారకు కీరవాణి వెన్నముక

  బింబిసారకు కీరవాణి వెన్నముక


  ప్రస్తుతం సినిమా అద్బుతంగా ఉండే తప్ప థియేటర్‌కు రావడం లేదు. అలాంటి పరిస్థితుల్లో బింబిసార రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా ప్రేక్షకులకు విభిన్నమైన అనుభూతిని కలిగిస్తుంది. ఈ సినిమా విషయానికి వస్తే.. ఒక వెలితి కనిపిస్తున్నది. అది ఎవరో కాదు. కీరవాణి. మామూలుగా సినిమా రిలీజ్ అవుతుందంటే ఒక భయం ఉంటుంది. బింబిసార రిలీజ్ అవుతుందంటే.. భయం కాకుండా ఆతృత ఉంది. అందుకు కారణం కీరవాణి గారు. ఆయన బింబిసార మూవీకి ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్బుతంగా ఉంది. ఈ సినిమాకు ఆయన వెన్నుముకగా నిలిచారు. థ్యాంక్యూ కీరవాణి గారు. ఈ సినిమా బాధ్యతను మీరు షేర్ చేసుకొని మాకు మరింత నమ్మకం కలిగించారు

  బింబిసారకు ముందు.. ఆ తర్వాత

  బింబిసారకు ముందు.. ఆ తర్వాత


  ఇదే వేదిక మీద గతంలో చాలా సార్లు చెప్పాను. మీకు నచ్చే వరకు సినిమాలు చేస్తాను. మీరు కాలర్ ఎగరవేసే విధంగా సినిమాలు చేస్తానని అన్నాను. మీరు బింబిసార మూవీ చూసిన తర్వాత నందమూరి కల్యాణ్ రామ్‌ మీ కాలర్‌ను ఎంత ఎత్తుతాడో మీరే చూస్తారు. కల్యాణ్ రామ్ కెరీర్.. బింబిసారకు ముందు.. బింబిసారకు తర్వాత అనే విధంగా ఉంటుంది. మామూలుగా ఆయన చాలా కష్టపడుతాడు. ఎప్పడూ సినిమాలో కనిపించదు. ఆయన సోదరుడిగా నేను ఆయన కష్టాన్ని చూశాను కాబట్టి.. ఆయన ఈ సినిమాకు తన రక్తాన్ని ధారపోసుకొన్నాడు. కల్యాణ్ రామ్ లేకుంటే.. బింబిసార సినిమాకు న్యాయం చేయగల నటుడు ఎవరు లేరు. ఉండరు కూడా. చాలా కష్టపడి చేశాడు అని ఎన్టీఆర్ ఎమోషనల్ అయ్యాడు

   మా తాత, నాన్న ఇచ్చిన సంపద మీరు

  మా తాత, నాన్న ఇచ్చిన సంపద మీరు


  సినీ పరిశ్రమకు గడ్డుకాలం అని అంటున్నారు. మంచి సినిమా వస్తే.. ఆదరిస్తారు అని నిరూపించారు. బింబిసార సినిమాను ఆదరించాలి. అలాగే ఈ సినిమాతోపాటు విడుదలవుతున్న మరో చిత్రం సీతారామం చిత్రాన్ని కూడా ఆదరించాలని కోరుకొంటున్నాను. మీరు ఇంటికి వెళ్లేటప్పుడు జాగ్రత్తగా వెళ్లండి.ఇంటి వద్ద మీ కోసం కుటుంబ సభ్యులు వేచి చూస్తుంటారు. మాకు ఆస్తులు వద్దు మీరే మాకు సంపద. మా తాత గారు.. మా నాన్న గారు వదిలి వెళ్లిన సంపద మీరు. జీవితాంత మీకు రుణపడి ఉంటాం. జీవితాంతం మిమ్మల్ని మా గుండెలో పెట్టుకొంటాం అని ఎన్టీఆర్ తన ప్రసంగాన్ని ముగించారు.

  English summary
  Kalyan Ram's Bimbisara movie is set to release on August 5th. In this occasion, unit organise pre release event in Hyderabd. In this event, NTR speaks emotionally.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X