For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రుణం ఎలా తీర్చుకోవాలి.. బర్త్ డే రోజున ఎన్టీఆర్ ఎమోషనల్

  |

  దేశవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన జన్మదినాన్ని ఇంటివద్దనే ఉంటూ నిరాడంబరంగా జరుపుకొన్నారు. లాక్‌డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో అభిమానులను వేడుకలకు దూరంగా ఉండాలని రెండు రోజుల క్రితం సూచించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అభిమానులు, సన్నిహితులు, స్నేహితులు, సినీ రంగ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా ఎన్టీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఎన్టీఆర్ బర్త్ డే వేడుకలకు సంబంధించిన ట్వీట్లు కనివిని ఎరుగని రీతిలో ట్విట్టర్‌లో పోటెత్తాయి. ఈ సందర్భంగా ఎన్టీఆర్ భావోద్వేగంగా స్పందిస్తూ..

  Ram Charan నాకు తెలుసు రిటర్న్ గిఫ్ట్ బాకీ ఉన్నా.. మెగా విషెస్ వైరల్

  వేడుకలకు దూరంగా ఉండాలని

  వేడుకలకు దూరంగా ఉండాలని

  తన బర్త్ డే వేడుకల సందర్భంగా ఎన్టీఆర్ అభిమానులకు విన్నపం చేస్తూ.. కరోనా విలయతాండవం చేస్తున్న సమయంలో మీరు, మీ కుటుంబ సభ్యులు క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాను. అందరం కలిసి పోరాడితే మహమ్మారిని ఎదురించి సురక్షితంగా బయటపడతామని నమ్ముతున్నాను. కాబట్టి మీరంతా ఇంటి పట్టునే ఉండి సురక్షితంగా ఉండాలి. ప్రతీ ఏటా నా పుట్టిన రోజున మీరు చూపించే ప్రేమ, చేసే కార్యక్రమాలు ఒక ఆశీర్వచనంగా భావిస్తా. ఈ ఏడాది మాత్రం మీరు ఇంటి పట్టునే ఉంటూ అధికారుల సూచనలను పాటిస్తూ, భౌతిక దూరానికి కట్టుబడి ఉంటాలని నా విన్నపం. ఇదే మీరు నాకు ఇచ్చే అతి విలువైన బహుమతి అని వేడుకొన్నారు.

  సినీ ప్రముఖుల విషెస్

  సినీ ప్రముఖుల విషెస్

  మే 20 తేదీన 37వ జన్మదినాన్ని జరుపుకొంటున్న ఎన్టీఆర్‌కు అభిమానుల నుంచి కోట్లకొద్ది ట్వీట్లతో శుభాకాంక్షలు వెల్లివిరిసాయి. ఇక సినీ ప్రముఖులు చిరంజీవి, వెంకటేష్ దగ్గుబాటి, ఎస్ఎస్ రాజమౌళి, రాంచరణ్, రానా దగ్గుబాటి నుంచి మహేష్ బాబు, సమంత అక్కినేని, తమన్నా, కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్, దర్శకుడు ప్రశాంత్ నీల్ తదితరులు జన్మదిన శుభాకాంక్షలు అందజేశారు.

  సోషల్ మీడియాలో రికార్డు స్థాయిలో

  సోషల్ మీడియాలో రికార్డు స్థాయిలో

  సోషల్ మీడియాలో యంగ్ టైగర్ ఫ్యాన్స్ తడాఖా చూపించారు. ట్విట్టర్‌ను వేదికగా చేసుకొని Happy Birthday NTR, Happy Birthday Tarak అనే హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేశారు. దాదాపు 15 మిలియన్ల కంటే ఎక్కువ ట్వీట్స్ చేస్తూ మోత మోగించారు. ఇది ఇండియాలోనే ఏ సినీ హీరో కూడా సంపాదించలేని రికార్డు అని పేర్కొంటున్నారు.

  9 Reasons For Jr NTR Enormous Craze | Happy Birthday NTR
  ఎన్టీఆర్ ఎమోషనల్‌గా థ్యాంక్స్

  ఎన్టీఆర్ ఎమోషనల్‌గా థ్యాంక్స్

  ఇలాంటి పరిస్థితుల మధ్య ఎన్టీఆర్ ఎమోషనల్ అయ్యారు. తనకు జన్మదిన శుభాకాంక్షలు అందజేసిన వారికి ధన్యవాదాలు తెలిపారు. ట్విట్టర్‌లో ఎన్టీఆర్ ట్వీట్ చేస్తూ.. మీరు నామీద చూపిస్తున్న అభిమానం వెలకట్టలేనిది. అన్నింటా నాకు తోడుగా వస్తున్న మీరే నా బలం. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను? ఏం చేసి ఈ ప్రేమకు అర్హుడిని అవగలను? చివరి దాకా మీకు తోడుగా ఉండటం తప్ప.. My dear FANS, indebted to you for life 🙏🏻 అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు.

  English summary
  Young Tiger NTR thanks to everyone Who wishes on his 37th birthday. He tweeted that I'd like to thank my colleagues, well wishers and members of the Film Fraternity from the bottom of my heart, for the warm birthday wishes. Felt great to read all the tweets and you've made this day very special .
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more
  X