Pawan Kalyan Birthday: పవన్ కల్యాణ్ బర్త్ డే వేడుకల్లో సూపర్ స్టార్.. ఎమోషనల్‌ పోస్ట్‌తో పవర్ స్టార్

పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుపుకొన్నారు. సెప్టెంబర్ 2 తేది ఆయన బర్త్ డే కావడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు, స్నేహితులు, సన్నిహితులు, సినీ ప్రముఖులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు అందజేశారు. అయితే తన జన్మదిన వేడుకల్లో పాల్గొన్న సూపర్ స్టార్‌కు పవన్ కల్యాణ్ మనస్పూర్తిగా అభినందనలు తెలుపుతూ ట్విట్టర్ ద్వారా సందేశాన్ని పంపారు. పవన్ కల్యాణ్ బర్త్ డే వేడుకల్లో పాల్గొన్న సూపర్ స్టార్ ఎవరు? పవన్ ఏమని సందేశాన్ని అందజేశారు అనే వివరాల్లోకి వెళితే..

కర్ణాటకలో కూడా పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. బెంగళూరులో ఆయన అభిమానులు జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. ఈ వేడుకల్లో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ పాల్గొన్నారు. పవన్ కల్యాణ్ అభిమానులతో కలిసి కేక్ కట్ చేసి పవర్ స్టార్‌కు విషెస్ అందజేశారు. ఈ వేడుకలకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.

Shiva Rajkumar at Pawan Kalyan Birthday Celebration

డాక్టర్ శివరాజ్ కుమార్ తన బర్త్ డే వేడుకల్లో పాల్గొన్నారనే విషయం తెలుసుకొన్న పవన్ కల్యాణ్ వెంటనే ట్విట్టర్‌లో స్పందించారు. గొప్ప స్టార్ అయినప్పటికీ.. ఎలాంటి అరమరికలు లేకుండా తన పుట్టిన రోజును ఘనంగా మార్చడంపై తన ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా అందించారు. ఈ సందర్భంగా ఆయనకు థ్యాంక్స్ చెబుతూ ఓ పోస్టును పెట్టగా అందర్నీ ఆకట్టుకొన్నది. పవన్ కల్యాణ్ తన ట్వీట్‌లో శివరాజ్ గొప్పతనాన్ని అభివర్ణించారు.

నా జన్మదిన వేడుకల్లో నా అభిమానులతోపాటు కరుణాడ చక్రవర్తి, కన్నడ లెజెండరీ యాక్టర్ స్వర్గీయ డాక్టర్ రాజ్‌కుమార్ అవరు కుమారుడు శివరాజ్ కుమార్ పాల్గొన్నడం నాకు ఎనలేని ఆనందాన్ని కలుగజేసింది. ఆయన గొప్పతనానికి, సింప్లిసిటీకి తార్కాణంగా ఇది నిదర్శనం అని శివన్నపై పవన్ కల్యాణ్ ప్రశంసల వర్షం కురిపించారు.

డాక్టర్ శివరాజ్ కుమార్‌కు కుక్కె సుబ్రమణ్యస్వామి దీవెనలు, ఆశీస్సులు ఉండాలని నేను మనస్పూర్తిగా కోరుకొంటున్నాను. ఆయనకు సకల సంతోషాలు, సంపూర్ణ ఆరోగ్యం కలుగాలని కోరుకొంటున్నాను. తన నటనా ప్రతిభతో మిలియన్ల అభిమానులకు ఆయన స్పూర్తిని అందించేలా బలాన్ని ఇవ్వాలని భగవంతుడిని కోరుకొంటున్నాను అని పవన్ కల్యాణ్ ట్విట్టర్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X