twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తెలుగు మీడియా ప్రతినిధులకు స్టార్ హీరో క్షమాపణలు... అందువల్లే కుదరలేదంటూ ఎమోషనల్

    |

    కిచ్చా సుదీప్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈగ సినిమాతో తెలుగు ప్రేక్షకులందరికీ పరిచయమైన సుదీప్ ఆ తరువాత అనేక సినిమాల్లో భాగమయ్యారు. అయితే ఇప్పుడు ఒక ఆయన ఒక పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆయన మీడియాకు క్షమాపణలు చెప్పడం ఆసక్తికరంగా మారింది. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే

    ఈగతో

    ఈగతో

    కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈగ సినిమాలో ఆయనను విలన్ గా నటింపజేసిన రాజమౌళి తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం చేశారు. ఇక ఆ సినిమా తర్వాత ఆయన బాహుబలి, సైరా వంటి సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో కనిపించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. తెలుగు నుంచి హీరోలు ఎలా అయితే పాన్ ఇండియా స్థాయికి ఎలా పెడుతున్నారో ఇప్పుడు కర్ణాటక నుంచి కూడా అదే విధంగా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు.

    కేజీఎఫ్ స్పూర్తితో

    కేజీఎఫ్ స్పూర్తితో

    కన్నడలో రూపొందిన కేజిఎఫ్ సిరీస్ సూపర్ హిట్ కొట్టడంతో ఇప్పుడు కన్నడ హీరోలు కూడా తమకు కూడా మార్కెట్ ఉందని పాన్ ఇండియా సినిమాలు చేయడానికి ముందుకు వస్తున్నారు. అందులో భాగంగానే సుదీప్ హీరోగా విక్రాంత రోణ అనే ఒక సోషల్ ఫాంటసీ మూవీ రూపొంది. ఈ సినిమా జులై 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆయన సౌత్ రాష్ట్రాలలో పర్యటించాల్సింది.

    సౌత్ లో

    సౌత్ లో

    చెన్నై, కొచ్చి, హైదరాబాదులో ఈరోజు ప్రెస్మీట్లు నిర్వహించాల్సి ఉంటుందంటూ మీడియా ప్రతినిధులకు ముందు సమాచారం అందించారు. అయితే సుదీప్ అనారోగ్యం పాలవడంతో ప్రెస్ మీట్ లు క్యాన్సిల్ చేస్తున్నట్లుగా అధికారిక ప్రకటన వెలువరించారు. అయితే ఈ విషయం గురించి మరి సుదీప్ ఏమనుకున్నాడో ఏమో తెలియదు గానీ తన సోషల్ మీడియా వేదికగా ఆయన ఈ విషయం మీద చెన్నై, కొచ్చి అలాగే హైదరాబాద్ మీడియా ప్రతినిధులకు క్షమాపణలు అంటూ ఒక పోస్ట్ పంచుకున్నారు.

    క్షమాపణలు

    క్షమాపణలు


    చెన్నై సహా హైదరాబాద్, కొచ్చి మీడియా ప్రతినిధులకు క్షమాపణలు చెబుతున్నాను, నా అనారోగ్య కారణాలవల్ల ప్రెస్ మీట్ క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. వీలైనంత త్వరగా కోలుకొని మిమ్మల్ని కలవాలని ఆశిస్తున్నాను. లవ్ యు ఆల్ అంటూ సుదీప్ చెప్పకు వచ్చారు. నిజానికి 'విక్రాంత్ రోణ' యూనిట్ లో కీలక వ్యక్తులను కొంత కాలంగా అనారోగ్యం పట్టి పీడిస్తోంది. కొద్ది రోజుల క్రితం ఈ మూవీ నిర్మాత మంజునాథ్ గుండెపోటుతో హాస్పిటల్ లో చేరారు.

    వరుసగా

    వరుసగా

    ఆ సమయంలో ఆయన భార్య షాలినీ... మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్నారు. ఇక 'విక్రాంత్ రోణ' సెన్సార్ కార్యక్రమాలు కూడా ఈ మధ్యనే పూర్తయ్యాయి. ఈ మూవీకి యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చారు. మూవీ రన్ టైమ్ ను కూడా 2.28 నిమిషాలకు లాక్ చేశారు. ఈ యేడాది కన్నడ నుండి వచ్చిన 'కేజీఎఫ్ -2' ఘన విజయం సాధించడంతో.... 'విక్రాంత్ రోణ'పై కూడా పాజిటివ్ బజ్ ఏర్పడింది.

    English summary
    kiccha Sudeep says sorry to Hyderabad Kochi and Chennai media persons regarding my cancellation of Vikrant Rona press meet in three states.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X