మహేష్ బాబు రియల్ బిహేవియర్ ఎలాంటిదో చెప్పడానికి ఈ వీడియో ఒక్కటి చాలు!

Recommended Video

మహేష్ బాబు రియల్ బిహేవియర్ ఎలాంటిదో చెప్పడానికి ఈ వీడియో ఒక్కటి చాలు!

మహేష్ బాబు సినిమాల్లో, ఆడియో ఫంక్షన్లు, ఏదైనా బ్రాండ్ ప్రమోషన్లలో తప్ప ఎక్కడా కనిపించరు. దీంతో చాలా మందికి మహేష్ బాబు రియల్ బిహేవియర్ ఎలా ఉంటుందో తెలియదు. ఆయన ఎవరితోనూ పెద్దగా మాట్లాడరని, ఆయన ఒక ఇంట్రోవర్ట్ అనే ప్రచారం సైతం ఉంది. అయితే సూపర్ స్టార్‍‌తో పని చేసిన స్టార్స్ మాత్రం పలు ఇంటర్వ్యూల్లో మహేష్ బాబు గురించి చాలా గొప్పగా చెప్పడం చూశాం. ఆయన అందరితోనూ చాలా జోవియల్‌గా ఉంటారని, చాలా స్మార్ట్ పర్సన్ అని, ముఖ్యంగా ఆయన సెన్సాఫ్ హ్యూమర్ గ్రేట్ అంటూ ప్రశంసిస్తుంటారు. దీనికి ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచే వీడియో ఒకటి లీకైంది.

ఈ వీడియో ఒక్కటి చాలు

మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ‘మహర్షి'లో అల్లరి నరేష్ కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. ఆ మధ్య నరేష్ బర్త్ డే సైతం సెట్స్ లోనే సెలబ్రేట్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి లీకైంది. మహేష్ బాబు రియల్ బిహేవియర్ ఎలా ఉంటుందో చెప్పడానికి ఈ ఒక్క వీడియో చాలు.

మహేష్ బాబు గురించి నరేష్

మహేష్ బాబు గురించి నరేష్


ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అల్లరి నరేష్ స్పందిస్తూ.... మహేష్ బాబు గురించి బయట చాలా మందికి తెలియదు. ఆయనతో ఒకసారి పని చేస్తే ఎవరైనా ఆయనపై ఉన్న అభిప్రాయాన్ని మార్చుకుంటారు. ఆయన చాలా జోవియల్ పర్సన్ అని తెలిపారు.

 కీలకమైన పాత్రలో నరేష్

కీలకమైన పాత్రలో నరేష్

మహర్షిలో నేను పోషించే పాత్రలో చాలా మంచి ఎమోషన్స్ ఉంటాయి. ఇప్పటి వరకు 45 రోజులు మహేష్ బాబుతో కలిసి పని చేశాను. ఇంకా 100 రోజులు పని చేయాల్సి ఉంది. మళ్లీ అక్టోబర్లో మా ఇద్దరి కాంబినేషన్లో షూటింగ్ మొదలవుతుందని తెలిపారు అల్లరి నరేష్ ఇటీవల వెల్లడించారు.

మహర్షి

మహర్షి

మహర్షి సినిమా విషయానికొస్తే.... వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రం మహేష్ బాబు కెరీర్లో 25వ చిత్రం. అశ్వినీదత్, దిల్ రాజు, పివిపి నిర్మిస్తున్న ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్. ఏప్రిల్ 5, 2019లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X