ఆవిడ చనిపోయారని మరిచిపోయా.. ఫోన్ చేస్తారేమో అనుకొని.. మహేష్ ఎమోషనల్

స్వర్గీయ విజయ నిర్మల జయంతి వేడుకల సందర్భంగా సూపర్‌స్టార్ మహేష్ బాబు భావోద్వేగానికి గురయ్యారు. కొద్ది నెలల క్రితం విజయ నిర్మల అనారోగ్యానికి గురై మరణించిన సంగతి తెలిసిందే. విజయ నిర్మల జయంతి సందర్భంగా ఆమె విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ వేడుకకు మురళీ మోహన్, కృష్ణంరాజు, మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా విజయ నిర్మలను తలచుకొని ఎమోషనల్ అయ్యారు.

విజయ నిర్మల విగ్రహావిష్కరణ

విజయ నిర్మల విగ్రహావిష్కరణ


విగ్రహావిష్కరణ అనంతరం విజయ నిర్మల గురించి మాట్లాడుతూ.. ఆమెను తలుచుకొని ఎమోషనల్ అయ్యారు. విజయ నిర్మల గారు గొప్ప వ్యక్తి. నా సినిమాలు విడుదలైనప్పుడు మా నాన్నతో కలిసి ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేవారు. షో నుంచి బయటకు రాగానే ఆ సినిమా గురించి పూర్తిగా వెల్లడించేవారు. నా నటనను ప్రశసించేవారు. నా సినిమా హిట్ అయినందుకు కంగ్రాట్స్ చెప్పేవారు అని మహేష్ బాబు తెలిపారు.

సరిలేరు నీకెవ్వరు రిలీజ్ తర్వాత

సరిలేరు నీకెవ్వరు రిలీజ్ తర్వాత

అయితే సరిలేరు నీకెవ్వరు సినిమా రిలీజ్ తర్వాత ఎప్పటిలానే నాన్న నాకు ఫోన్ చేసి సినిమా గురించి మాట్లాడారు. ఆయన నా నటన గురించి, ఫెర్ఫార్మెన్స్ గురించి విపులంగా సమీక్షించారు. ఆ సమయంలో విజయ నిర్మల గారు కూడా ఫోన్ చేస్తారేమో అనుకొన్నాను. కానీ ఆ తర్వాత ఆమె ఈ లోకంలో లేరనే విషయం గుర్తుకు వచ్చింది. విజయ నిర్మల గారు ఎక్కడ ఉన్నా చాలా సంతోషంగా ఉంటారని అనుకొంటున్నాను అని మహేష్ బాబు అన్నారు.

అనారోగ్యంతో విజయ నిర్మల

అనారోగ్యంతో విజయ నిర్మల


దివంగత విజయ నిర్మల 2019 జూన్‌లో అనారోగ్యానికి గురయ్యారు. కాంటినెంటల్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మరణించారు. అప్పట్లో ఆమె మరణవార్త విని సినీలోకం దిగ్బ్రాంతి గురైన సంగతి తెలిసిందే. విజయ నిర్మల కెరీర్ విషయానికి వస్తే 200కు పైగా చిత్రాల్లో నటించారు. 44 చిత్రాలకు దర్శకత్వం వహించారు.

Recommended Video

Mahesh Babu, Krishna And Gautham Ghattamaneni To Come Together For A Movie?
200 కోట్ల క్లబ్‌లో మహేష్

200 కోట్ల క్లబ్‌లో మహేష్

ఇక మహేష్ కెరీర్ విషయానికి వస్తే.. సరిలేరు నీకెవ్వరు సినిమా జనవరి 11న సంక్రాంతి కానుకగా రిలీజై ఘన విజయం సాధించింది. బాక్సాఫీస్ వద్ద దాదాపు 200 కోట్లు గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది. మహేష్ బాబు కెరీర్‌లోనే అతిపెద్ద హిట్లలో ఒకటిగా నిలిచింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X