మానవత్వాన్ని చాటుకొన్న మహేష్ బాబు.. తండ్రి పుట్టిన రోజున బుర్రిపాలెంలో ఫ్రీ వ్యాక్సిన్
సమాజ సేవ చేయడంలోను, మానవత్వం ప్రదర్శించడంలోను సూపర్‌స్టార్ మహేష్ బాబు ఎప్పుడు ముందుంటారనేది చాలా సందర్భాల్లో రుజువు అయింది. గతంలో తన తండ్రి పుట్టిన ఊరు బుర్రిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ది చేయడానికి ముందుకు వచ్చారు. తాజాగా మరోసారి బుర్రిపాలెం గ్రామ ప్రజలపై మహేష్ చూపించిన ప్రేమానురాగాలపై హర్షం వ్యక్తమవుతున్నది. బుర్రిపాలెంలో మహేష్ ఏం చేశారంటే..
బ్రా లేకుండా షర్ట్ బటన్స్ విప్పేసి.. షాక్ ఇచ్చిన కావ్య తప్పర్

బుర్రిపాలెంలో ఉచితంగా వ్యాక్సినేషన్
తన తండ్రి, సూపర్ స్టార్ మహేష్‌బాబు పుట్టిన రోజును పురస్కరించుకొని మరోసారి సమాజసేవకు అంకితం అయ్యారు. ప్రస్తుతం కరోనావైరస్ విజృంభిస్తున్న సమయంలో బుర్రిపాలెం గ్రామ ప్రజలకు ఉచితంగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆంధ్రా హాస్పిటల్‌లో సహకారంతో ఈ గొప్ప కార్యక్రమాన్ని భుజానికి ఎత్తుకొన్నారు.

గతంలో 1000 మంది చిన్నారులకు
అంతేకాకుండా గుండె జబ్బుతో బాధపడే 1000 మంది చిన్నారులకు హార్ట్ ఆపరేషన్స్ చేయించడంలో తన మానవత్వాన్ని ప్రదర్శించి ప్రజల దృష్టిలో రియల్ హీరో అయ్యారు. హీల్ ఏ చైల్డ్ ఫౌండేషన్ ద్వారా చిన్నారులకు హార్ట్ సర్జరీలనే కాకుండా వైద్య ఖర్చులను కూడా భరిస్తుండటం తెలిసిందే.

బుర్రిపాలెంను దతత్త తీసుకొన్న శ్రీమంతుడు
ఇక గతంలో శ్రీమంతుడు అనే చిత్రంలో నటించిన తర్వాత గ్రామ దత్తత అనే అంశాన్ని స్పూర్తిగా తీసుకొన్నారు. ఆ సమయంలో ఏపీలోని బుర్రిపాలెం, తెలంగాణలోని సిద్దాపురం గ్రామాన్ని దత్తత తీసుకొన్నారు. ఆ గ్రామాల్లో పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాలు పంచుకొంటూ తన సేవా దృక్పథాన్ని చాటుకొంటున్నా

ఆ రెండు కార్యక్రమాలు వాయిదా
సాధారణంగా, తన తండ్రి కృష్ణ పుట్టిన రోజున తన సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను, లేదా మరో అంశాన్ని ప్రేక్షకులకు అందించేవారు. వాస్తవానికి సర్కారు వారి పాట, త్రివిక్రమ్ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ ఇవ్వాలని మహేష్ బాబు టీమ్ భావించింది. కానీ ఈ ఏడాది కరోనావైరస్ పరిస్థితులు దారుణంగా ఉండటం, తమ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన పీఆర్వో, జర్నలిస్టు బీఏ రాజు మరణంతో కొన్ని కార్యక్రమాలను వాయిదా వేశారు.
Recommended Video

హీరో సుధీర్ బాబు ఇంట్లో బర్త్ డే వేడుకలు
ఇదిలా ఉండగా, కృష్ణ బర్త్ డే వేడుకులను నిరాడంబరంగా హీరో సుధీర్ బాబు ఇంట్లో జరిపించారు. ఈ వేడుకకు కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. ఈ వేడుకల్లో ఎంపీ గల్లా జయదేవ్, నటులు నరేష్, నిర్మాత, కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు, కృష్ణ సతీమణి, కృష్ణ అల్లుడు సంజయ్ స్వరూప్ తదితరులు హాజరయ్యారు.


Click it and Unblock the Notifications











