ట్విట్టర్ లో మహేష్ మరో రికార్డ్.. దరిదాపుల్లో కూడా లేకుండా.. ఎక్కడా తగ్గేదేలే.!
అభిమానులు ముద్దుగా ప్రిన్స్ అని పిలుచుకునే మహేష్ బాబుకి సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఆయన సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ చేయగానే దానికి విపరీతమైన రెస్పాన్స్ కూడా లభిస్తుంది.. మరీ ముఖ్యంగా ట్విట్టర్ విషయంలో అయితే ఆయన ఎప్పటికప్పుడు తన రికార్డును తానే బద్దలు కొట్టుకుంటూ ఉంటారు.. తాజాగా అలాంటి రికార్డ్ ఒకటి మళ్ళీ మొదలైంది. ఆ వివరాల్లోకి వెళితే

సోషల్ మీడియాలో యాక్టివ్
సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉంటారు అన్న సంగతి తెలిసిందే. ఆయన ట్విట్టర్ ద్వారా అనేక విషయాలను తన అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. తన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ మాత్రమే కాక తన ఫ్యామిలీ విషయాలు అలాగే తన అనుభవాలను, తనకి నచ్చిన అన్ని అంశాలను పంచుకుంటూ ఉంటారు.

ఫ్యాన్స్ కూడా యమా యాక్టివ్
ఇక మహేష్ ఫ్యాన్స్ కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా మహేష్ ఎలాంటి కంటెంట్ పెట్టినా సరే దానికి మంచి రీచ్ తీసుకువస్తూ ఉంటారు. ఎప్పటికప్పుడు తమ హీరో గురించి ఇంటర్నెట్ లో ట్రెండ్ సృష్టిస్తుంటారు. టాలీవుడ్ అందరి హీరోల కంటే ట్విట్టర్ లో అత్యధిక ఫాలోవర్స్ కలిగిన వారి సంఖ్యలో మహేష్ బాబు ముందు ఉన్నాడు. ఆయనకు ట్విట్టర్లో 11.4 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.
మరో రికార్డు
తాజాగా ట్విట్టర్ లో మహేష్ మరో రికార్డ్ సాధించాడు. మహేష్ చేసిన ట్వీట్స్‌కి 24 సార్లు 100K లైక్స్ రాగా, ఈ విషయంలో ఆయనకు అగ్రస్థానం దక్కింది. తర్వాతి స్థానంలో జూనియర్ ఎన్టీఆర్ చేసిన ట్వీట్స్‌కి 6 సార్లు 100K లైక్స్, రానా దగ్గుబాటి చేసిన ట్వీట్స్‌కి 3 సార్లు 100K లైక్స్, ఆ తరువాత పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్స్‌కి 2 సార్లు, నితిన్ చేసిన ట్వీట్స్‌కి 2 సార్లు, అల్లు అర్జున్ చేసిన ట్వీట్స్‌కి 2 సార్లు 100K లైక్స్ వచ్చాయి. ఇక రామ్ చరణ్, నాని ఒక్కసారి మాత్రమే ఈ ఫీట్ సాధించారు.
Recommended Video

సినిమాల విషయానికి వస్తే
ఇక సినిమాల విషయానికి వస్తే మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా కరోనా సెకండ్ వేవ్ వలన వాయిదా పడింది. సీనియర్ నటుడు, మహేష్ తండ్రి కృష్ణ పుట్టిన రోజు ఈ సినిమాకు సంబంధించిన ఏదైనా అప్డేట్ వస్తుందేమో అని అంచనాలు వేస్తున్నారు. ఇక ఇవి కాకుండా, త్రివిక్రమ్ శ్రీనివాస్, రాజమౌళి, అనిల్ రావిపుడలతో సినిమాలు లైన్ లో పెట్టారు.


Click it and Unblock the Notifications











