For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Ashok Galla’s Hero సినిమాకు మహేష్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?

  |

  సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కిన తొలి చిత్రం రేపు అంటే సంక్రాంతి సందర్భంగా 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్రబృందం ఈ సినిమాను గట్టిగా ప్రమోట్ చేస్తోంది. తాజాగా మహేష్ బాబు కూడా ఈ సినిమాను ప్రమోట్ చేసేందుకు ముందుకు వచ్చాడు. సినిమా చూసిన ఆయన రివ్యూ కూడా ఇచ్చేసారు. ఆ వివరాలు

  సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు

  సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు

  మహేష్ బాబు మేనల్లుడు, ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు అశోక్ గల్లా నటించిన హీరో సినిమా ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. భలే మంచి రోజు, శమంతకమణి, దేవదాస్ వంటి సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో జగపతిబాబు, నరేష్, కోట శ్రీనివాసరావు వంటి సీనియర్ నటీనటులు కూడా నటించారు. తప్పకుండా సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందుకుంటుందని చిత్ర యూనిట్ సభ్యులు కూడా నమ్మకంతో ఉన్నారు.

  క్రైమ్ లో చిక్కుకొని

  క్రైమ్ లో చిక్కుకొని

  ఇక హీరో సినిమా ట్రైలర్ కు కూడా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. యూ ట్యూబ్ లో హీరో సినిమా ట్రైలర్ భారీ స్థాయిలో వ్యూవ్స్ అందుకుంటోంది. హీరో సినిమా ట్రైలర్ చూసిన వారికి కధ మీద కొంత అవాహజన రావచ్చు. అదేంటంటే హీరో కావాలని ప్రయత్నం చేసిన ఒక కుర్రాడు అనుకోకుండా ఒక క్రైమ్ లో చిక్కుకొని ఎలా బయటపడ్డాడు అనేది ఈ సినిమా స్టోరి.

  చాలా గర్వపడుతున్నా

  చాలా గర్వపడుతున్నా

  మహేష్ బాబు తన వీడియో సందేశంలో, "నేను హీరో సినిమా చూశాను మరియు నాకు చాలా నచ్చింది. మొత్తం టీమ్‌కి, ముఖ్యంగా సినిమాలో అద్భుతంగా నటించిన అశోక్‌కి అభినందనలు. అతను గత 5 నుండి 6 సంవత్సరాలుగా పడిన కష్టానికి ప్రతిఫలం దక్కుతోంది. అశోక్, నేను నీ గురించి చాలా గర్వపడుతున్నాను. రేపటి గొప్ప రోజు కోసం ఆల్ ది బెస్ట్. " అని మహేష్ పేర్కొన్నారు.

  మద్దతు లభిస్తుందని కోరుకుంటున్నా

  మద్దతు లభిస్తుందని కోరుకుంటున్నా

  సంక్రాంతి సందర్భంగా విడుదలైన తన తండ్రి కృష్ణ చిత్రాలు చాలా వరకు బ్లాక్ బస్టర్లుగా నిలిచాయని మహేష్ బాబు తెలిపారు. "నాకు కూడా సంక్రాంతి అంటే పాజిటివ్ సెంటిమెంట్ ఉంది. ఒక్కడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సరిలేరు నీకెవ్వరు లాంటి సినిమాలు బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. అశోక్ మా కుటుంబం నుంచి పరిచయం అవుతున్నాడు. ఆయనకు నా అభిమానులు మరియు నాన్న అభిమానుల మద్దతు లభిస్తుందని కోరుకుంటున్నాను. అని మహేష్ పేర్కొన్నారు. విడుదలకు ముందు సినిమా గురించి మహేష్ బాబు ప్రోత్సాహకరమైన మాటలు 'హీరో'కి పెద్ద బూస్ట్ అవుతుందని అందరూ భావిస్తున్నారు.

  మరొక ప్రాజెక్ట్

  మరొక ప్రాజెక్ట్


  ఇక సినిమా జనవరి 15న విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో సక్సెస్ అవుతుందో చూడాలి. ఇక హీరో సినిమా విడుదల అనంతరం అశోక్ గల్లా వెంటనే మరొక ప్రాజెక్ట్ ను మొదలు పెట్టె అవకాశం ఉందని ఇప్పటికే టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగురోంది. ఇక ఆ కొత్త ప్రాజెక్ కు సంబంధించిన అఫీషియల్ ఎనౌన్స్మెంట్ కూడా త్వరలోనే రానున్నట్లు చెబుతున్నారు.

  English summary
  Mahesh Babu’s Review On Ashok Galla’s Hero Movie
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X