Mahesh Babu కూడా తప్పుకున్నాడు.. 'సర్కారు వారి పాట' విషయంలో షాకింగ్ నిర్ణయం!
టాలీవుడ్ ఇండస్ట్రీలో గత కొన్ని నెలల క్రితం వరుసగా రిలీజ్ డేట్స్ ను ఎనౌన్స్ చేయడంతో మళ్ళీ పాత రోజులు వచ్చాయని అందరూ ఎంతగానో ఆనందించారు. కరోనా పెరుగుతున్నా కూడా జాగ్రత్తలు తీసుకొని సినిమా షూటింగ్స్ కూడా కొనసాగించారు. ఇక మంచి సినిమా వస్తే ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ కూడా గట్టిగానే ఉంటుందని మరోసారి రుజువయ్యింది.
అయితే కరోనా ఉన్నప్పటికీ కొంతమంది భవిష్యత్తుపై నమ్మకంతో ముందుగానే రిలీజ్ డేట్స్ పై క్లారిటీ ఇచ్చారు. అందులో మహేష్ బాబు కూడా ఉన్నాడు. ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు రావాల్సిన సర్కారు వారి పాట సినిమా గత ఎడాది నుంచి వాయిదా పడుతున్న విషయం తెలిసిందే. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ అయితే కొంచెం కూడా పూర్తవ్వలేదు. దుబాయ్ లో ఒక యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ చేశారు.

అలాగే గోవాలో కొన్ని సీన్స్ ను షూట్ చేస్తున్న సమయంలోనే కరోనా వలన నిలిపి వేయాల్సి వచ్చింది. ఇంకా చాలా కీలకమైన సన్నివేశాలను పూర్తి చేయాల్సి ఉంది. ఇక సినిమాను 2022 సంక్రాంతికి విడుదల చేయాలని అనుకున్నారు. కానీ ప్లాన్స్ మొత్తం తారుమరవ్వడంతో సినిమాను సమ్మర్ కు షిఫ్ట్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే కొన్ని పెద్ద సినిమాలు సమ్మర్ ను టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. ఇక మహేష్ బాబు కూడా అప్పుడే వస్తుండడంతోతో బాక్సాఫీస్ ఫైట్ మామూలుగా ఉండదు. వీలైనంత వరకు మహేష్ అయితే పోటీ లేకుండానే సోలోగా రావడానికి ప్రయత్నం చేసాడు. మరి సర్కారు వారి పాట విషయంలో ఎలా జరుగుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











