twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నందమూరి హరికృష్ణ చివరి కోరిక తీరుద్దాం: మంచు మనోజ్

    By Bojja Kumar
    |

    నందమూరి హరికృష్ణ చివరి కోరిక తీరుద్దాం అంటూ మంచు మనోజ్ పిలుపునివ్వడంతో పలువురు ఫ్యాన్స్ తమవంతు బాధ్యత నిర్వర్తించడానికి ముందుకు వస్తున్నారు. నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించడానికి ముందు అభిమానులను ఉద్దేశించి ఓ లేఖ రాసిన సంగతి తెలిసిందే. కేరళ వరద విషాదం నేపథ్యంలో తన అరవై రెండవ పుట్టినరోజు జరుపుకోవడం లేదని, అభిమానులు, మిత్రులు, శ్రేయోభిలాషులు కూడా తన పుట్టినరోజు వేడుక జరుపవద్దని సూచించారు. తన పుట్టినరోజు సందర్భంగా పెట్టే ఖర్చును కేరళ వరద బాధితుల కోసం ఇవ్వాలని ఆయన లేఖలో పేర్కొన్నారు.

    చివరికోరిక తీరుద్దాం: మంజు మనోజ్

    చివరికోరిక తీరుద్దాం: మంజు మనోజ్

    ఈ విషయమై మంచు మనోజ్ ట్వీట్ చేస్తూ.... ‘హరికృష్ణగారి చివరి కోరిక తీరుద్దాం. ఆయన పుట్టినరోజు వేడుకలను జరుపకుండా అందుకు పెట్టే ఖర్చును కేరళ వరద బాధితులకు విరాళంగా ఇద్దామని సూచించారు.

    తన వంతుగా రూ. 5 లక్షల సహాయం

    తన వంతుగా రూ. 5 లక్షల సహాయం

    హరికృష్ణగారి చివరి కోరిక మేరకు తనవంతుగా రూ. 5 లక్షల సహాయం కేరళకు అందించబోతున్నట్లు మంచు మనోజ్ ప్రకటించారు. నందమూరి అభిమానులు, తెలుగు సినిమా అభిమానులు కూడా కేరళ బాధితులకు సహాయం చేస్తారని భావిస్తున్నట్లు తెలిపారు.

    దేవుడు కఠినాత్ముడు

    దేవుడు కఠినాత్ముడు

    తారక్, కళ్యాణ్ రామ్ అన్న, వారి కుటుంబాన్ని అలా చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. దేవుడు నిజంగా కఠినాత్ముడు. వారికి కుటుంబానికి మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. నా చివరి వరకు నేను మీతో ఉంటాను. హరికృష్ణగారి ఆత్మకు శాంతి చేకూరాలి... అని మనోజ్ ట్వీట్ చేశారు.

    ఆ బాధ తట్టుకోలేక

    ఆ బాధ తట్టుకోలేక

    హరికృష్ణ మరణించిన రోజు టీవీలో యాక్సిడెంట్ దృశ్యాలు ప్రసారం చేస్తుండటంతో... అవి చూసి తట్టుకోలేక మీడియాను మనోజ్ రిక్వెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ విజువల్స్ పదే పదే చూపించి మమ్మల్ని మరింత బాధపెట్టవద్దని మనోజ్ కోరారు.

    English summary
    "For him,from us.Let’s fulfill #HariKrishnaGarusLastWish of not celebrating his bday & donate all the money to #KeralaReliefFund. I did my bit yet will be giving away 5L in his memory.Hoping all Nandamuri & TFI fans to do their bit by giving life to millions." Manchu Manoj tweeted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X