»   » ప్రణయ్ హత్య: కులం పిచ్చోళ్లను ఏకిపారేస్తూ మంచు మనోజ్ భావోద్వేగం....

ప్రణయ్ హత్య: కులం పిచ్చోళ్లను ఏకిపారేస్తూ మంచు మనోజ్ భావోద్వేగం....

Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Manchu Manoj Tweets On Pranay Issue

  తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ పరువు హత్యపై సినీ నటుడు మంచు మనోజ్ స్పందించారు. ఈ సందర్భంగా కులం, మతం పిచ్చోళ్లను ఏకిపారే్స్తూ భావోద్వేగమైన ట్వీట్ చేశారు. మిర్యాలగూడలో మారుతిరావు అనే వ్యక్తి తన కూతురు అమృతను ప్రేమ వివాహం చేసుకున్న దళిత కులానికి చెందిన ప్రణయ్‌ను హత్య చేయించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై మంచు మనోజ్ తన మనసులోని ఆవేదనను బయట పెట్టారు.

  సినిమా రంగంలో పాటు ఇతర రంగాల్లో కూడా

  సినిమా రంగంలో పాటు ఇతర రంగాల్లో కూడా

  కులం ఫీలింగ్ ఎక్కడ ఉన్నా అది చాలా దారుణం. సినిమా పరిశ్రమలో తమ కులం హీరోలను అభిమానించడమైనా, కులం ప్రాతిపదికన పొలిటికల్ పార్టీలకు సపోర్ట్ ఇవ్వడమైనా, కులం ఆధారంగా ఏర్పడే కాలేజ్ యూనియన్స్ అయినా, మరే ఇతర కుల, మత సంఘాలైనా సమాజంలో క్రూరమైన పరిస్థితులకు కారణం అవుతున్నాయని మనోజ్ అభిప్రాయ పడ్డారు.

  వారి వల్లే ఈ దారుణాలు

  వారి వల్లే ఈ దారుణాలు

  ప్రణయ్‌తో పాటు ఎంతో మందిని బలిగొన్న ఈ పరిణామాలకు కులాలను, మతాలను అన్నిటికంటే ఎక్కువగా ప్రేమించే వ్యక్తులే. అలాంటి కులం, మతం పిచ్చోళ్లు సమాజంలో ఉండటం వల్లనే ఈ దారుణాలు చోటు చేసుకుంటున్నాయని మనోజ్ అన్నారు.

  వారి జీవితాల కంటే కులమే ఎక్కువా?

  వారి జీవితాల కంటే కులమే ఎక్కువా?

  మనిషి జీవితం కంటే మరేదీ ఎక్కువ కాదనే విషయాన్ని తెలుసుకోవడానికి ఇదే సరైన సమయం. తన తండ్రిని స్పర్శించక ముందే ఒక బిడ్డ కన్న తండ్రిని కోల్పోవడం మనస్సును కలచి వేసే అంశం. కేవలం కులం కోసం వాళ్ల జీవితాలను చిన్నాభిన్నం చేశారు. వారి జీవితాల కంటే మీకు కులమే ఎక్కువా? దీని వల్ల మీరు సాధించింది ఏమిటి? అని మనోజ్ ప్రశ్నించారు.

  మనుషులంతా ఒకటే అని ఎప్పుడు తెలుసుకుంటారు?

  మనుషులంతా ఒకటే అని ఎప్పుడు తెలుసుకుంటారు?

  మన అందరికీ ఒకే రకమైన గుండె, శరీరం ఉన్నాయి. ఒకే గాలిని పీలుస్తున్నాం, ఒకే ప్రపంచంలో జీవిస్తున్నాం. కానీ కులం పేరుతో, మతం పేరుతో వర్గాలుగా విడిపోవడం ఎందుకు? మనుషులంతా ఒకటే అనే విషయాన్ని ఈ ప్రపంచం ఎప్పుడు తెలుసుకుంటుంది? అని మనోజ్ వ్యాఖ్యానించారు.

  మన పిల్లలకు మంచి భవిష్యత్ అందిద్దాం

  మన పిల్లలకు మంచి భవిష్యత్ అందిద్దాం

  ఇలాంటి కుల పిచ్చి ఉన్న వారిని చూసి సిగ్గుపడుతున్నా. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తే కాకుండా... కులాలను అమితంగా ప్రేమించే ప్రతి ఒక్కరూ ఈ దీనికి ధ్యులే. కుల వివక్ష నశించాలి. ఈ మహమ్మారిని వెంటనే అంతం చేయాలి. మన పిల్లలకు కులం, మతం రహిత మంచి భవిష్యత్తును అందిద్దాం.... అని మనోజ్ అన్నారు.

  ప్రణయ్ ఆత్మకు శాంతి చేకూరాలి

  ప్రణయ్ భార్య అమృత, వారి కుటుంబ పరిస్థితి చూసి నా గుండె కలచి వేసింది. ప్రణయ్ ఆత్మకు శాంతి చేకూరాలి. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.... అని మనోజ్ వ్యాఖ్యానించారు.

  English summary
  Manchu Manoj tweet on Pranay Murder. Pranay and Amrita Varshini, who belongs to a forward caste, got married in January against the wishes of her family. Following the marriage, Varshini's father had threatened to kill Pranay several times as he belonged to the Scheduled Caste.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more