twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శ్రీదేవి బుగ్గల మాదిరిగా.. కొరికి తినాలనిపించలేదా? ఆ విషయాన్ని బయటపెట్టిన చిరంజీవి

    |

    గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై గోపిచంద్, రాశీ ఖన్నా జంటగా బన్నీ వాసు నిర్మాతగా మారుతి దర్శకుడిగా రూపొందించిన చిత్రం పక్కా కమర్షియల్. ఈ సినిమా జూలై 1వ తేదీన రిలీజ్ కానున్నది. ఈ క్రమంలో ప్రమోషనల్ కార్యక్రమాల్లో భాగంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్మించారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా చిరంజీవి మాట్లాడుతూ..

    రావు రమేష్‌ను కలువలేదు

    రావు రమేష్‌ను కలువలేదు

    రావు రమేశ్‌తో కలిసి నటించలేదు, వ్యక్తిగతంగా కలిసిన సందర్భాలు చాలా తక్కువ ఉంటాయనుకొంటాను. కానీ ఆయన తండ్రి రావు గోపాల్ రావును నేను చిన్న మామయ్య అని పిలిచే వాడిని. నాకు అల్లు రామలింగయ్య మామయ్య అయితే.. చిన్న మామయ్య నాకు రావు గోపాల్ రావు నాకు చిన్న మామయ్య అని పిలిచే వాడిని. షూటింగ్ సమయంలో రావు గోపాల రావుతో కలిసి భోజనం చేసే వాడిని. ఇంటి నుంచి రావు రమేష్ తల్లి మాకు భోజనం, స్పెషల్ వంటకాలు పంపించేది.

    రావు గోపాల్ రావు ఫ్యామిలీ గురించి

    రావు గోపాల్ రావు ఫ్యామిలీ గురించి

    అయితే రావు గోపాల్ రావు గారికి ఇంటి నుంచి ఒకసారి వంకాయ కూర చేసి పంపించారు. అయితే ఏం తింటాం లే అని అనుకొంటే.. అందేంటి.. వంకాయ కూర గురించి అలా తక్కువగా చేసి మాట్లాడకు. మీ అత్తయ్య గారు ప్రేమతో చిరంజీవి బాబుకు పెట్టండి అని పంపించారు. ఆ వంకాయలను చూస్తే.. శ్రీదేవి బుగ్గల్లా కనిపించడం లేదా? అలాంటి వాటిని వదలాలని ఎందుకు అనిపించిందయ్యా అని స్వర్గీయ రావు గోపాల రావును అనుకరిస్తూ చిరంజీవి స్టేజ్‌పై మాట్లాడటంతో అభిమానులు ఆనందంలో మునిగిపోయారు.

    వంకాయ కూర గురించి చెబుతూ..

    వంకాయ కూర గురించి చెబుతూ..

    అయితే వంకాయ కూర గురించి మరింతగా చెబుతూ.. మీరు కుర్రాళ్లు.. అలాంటి దానిని నోట్లో పెట్టుకొని చటుక్కున ఎందుకు కొరకాలనిపించలేదు. దానిని కొరికి నమిలి మింగేయాలి అంటూ నాతో చెప్పేవారు. ఇక చికెన్ తొడలను మరో రకంగా అభివర్ణిస్తూ భోజనాన్ని ఆస్వాదిస్తూ తినే వారు.. మాకు తినిపించేవారు అని రావు గోపాల రావును గుర్తు చేసుకొని చిరంజీవి ఎమోషనల్ అయ్యారు.

    రావు రమేష్ తల్లి చేసే తులసి చారు గురించి

    రావు రమేష్ తల్లి చేసే తులసి చారు గురించి

    రావు రమేష్ గారి తల్లి వంకాయ కూర మాత్రమే కాదు.. తులసి చారు కూడా బాగా చేసేవారు. ఆ చారు తీసుకొచ్చి.. మీ కోసం పెట్టారని ప్రేమగా తినిపించేవారు. అలాంటి రావు గోపాల్ రావు స్పూర్తి తీసుకొని.. గొప్ప నటుడిగా అవ్వడానికి రకరకాల పాత్రలు చేస్తూ.. అందరి మన్ననల్ని పంచుతూ.. రావు గోపాల్ రావు లేని లోటును రావు రమేష్ తీరుస్తున్నారు. చిన్నవాడైన రావు రమేష్ ఇంకా అత్యున్నత స్థానాలకు చేరుకోవాలని మనస్పూర్తిగా కోరుకొంటున్నాను అని చిరంజీవి అన్నారు.

    నాతో సినిమా చేస్తావా? అంటూ చిరంజీవి

    నాతో సినిమా చేస్తావా? అంటూ చిరంజీవి

    రావు రమేష్ గురించి చిరంజీవి మాట్లాడుతూ.. మీకు కుదిరితే నాతో ఒక సినిమా చేయాలి అని అన్నారు. దాంతో రావు రమేష్ ఆనందంతో మునిగిపోయారు. అయ్య బాబోయో అంటూ చేతులు జోడించారు. నాతో ఎందుకు చేయడం లేదు.. ఏ కారణం అయి ఉంటుందని అడిగితే.. నవ్వుల్లో మునిగిపోయారు. డైలాగ్ డెలివరీ చెప్పడంలో మీ నాన్న టైమింగ్‌ను మ్యాచ్ చేస్తుంటావు అని ప్రశంసల్లో ముంచెత్తారు.

    English summary
    Gopi Chand's Pakka Commercial pre release event held in hyderabad. Chiranjeevi is the chief guest for this movie functions. In the occassion, Chiranjeevi made emotional speach.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X