For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Waltair Veerayya: సుమన్ బ్లూ ఫిల్మ్ కేసుపై చిరంజీవి సంచలన వ్యాఖ్యలు.. వాడో పోరంబోకు.. శాడిజం అంటూ!

  |

  ఏమాత్రం బ్యాగ్రౌండ్ లేకుండానే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. చాలా తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకుని స్టార్‌గా ఎదిగిపోయారు మెగాస్టార్ చిరంజీవి. అప్పటి నుంచి దాదాపు నలభై ఏళ్లుగా టాలీవుడ్‌లో హవాను చూపిస్తోన్న ఆయన.. ఈ మధ్య కాలంలో రెట్టించిన ఉత్సాహంతో దూసుకుపోతోన్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు 'వాల్తేరు వీరయ్య' మూవీతో రాబోతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన చిరంజీవి.. అప్పట్లో సంచలనం అయిన హీరో సుమన్ బ్లూ ఫిల్మ్ కేసుపై క్లారిటీ ఇచ్చారు. ఆ వివరాలు మీకోసం!

  వీరయ్యగా రాబోతున్న చిరంజీవి

  వీరయ్యగా రాబోతున్న చిరంజీవి


  మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ ప్రధాన పాత్రల్లో ఎంటర్‌టైనర్ మూవీనే 'వాల్తేరు వీరయ్య'. టాలెంటెడ్ డైరెక్టర్ బాబీ తెరకెక్కించిన ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, యలమంచలి రవి శంకర్ నిర్మించారు. దీనికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో శృతి హాసన్, కేథరిన్ థ్రెస్సా హీరోయిన్లుగా నటించారు.

  షర్ట్ విప్పేసి రెచ్చిపోయిన నిధి అగర్వాల్: ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయిందా ఏంటీ!

  గ్రాండ్ రిలీజ్.. ఫ్యాన్స్ ఊచకోత

  గ్రాండ్ రిలీజ్.. ఫ్యాన్స్ ఊచకోత

  భారీ మల్టీస్టారర్‌గా రాబోతున్న 'వాల్తేరు వీరయ్య' మూవీని సంక్రాంతి కానుకగా జనవరి 13వ తేదీన ఎంతో గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఓవర్సీస్ సహా ఎన్నో ప్రాంతాల్లో టికెట్లు బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. అంతేకాదు, చాలా చోట్ల అప్పుడే టికెట్లు పూర్తిగా అమ్ముడుపోయాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో సందడి వాతావరణం కనిపిస్తోంది.

  చిరంజీవి మాత్రం ఫుల్ బిజీగానే

  చిరంజీవి మాత్రం ఫుల్ బిజీగానే

  క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న 'వాల్తేరు వీరయ్య' మూవీ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను మరింత ముమ్మరం చేసేసింది. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి సైతం వరుస ఇంటర్వ్యూలతో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే ఎన్నో ఛానెళ్లతో ఆయన చిట్ చాట్‌ను కూడా నిర్వహించారు.

  ఉల్లిపొర లాంటి డ్రెస్ మంచు లక్ష్మి షో: ఓ రేంజ్‌లో ఎద అందాలు ఆరబోత

  స్పెషల్ ఇంటర్వ్యూ.. వివాదాలు

  స్పెషల్ ఇంటర్వ్యూ.. వివాదాలు


  'వాల్తేరు వీరయ్య' చిత్రాన్ని మరింతగా ప్రేక్షకులకు చేరువ చేసే చర్యల్లో భాగంగా మెగాస్టార్ చిరంజీవి తాజాగా ప్రముఖ జర్నలిస్టుకు స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో భాగంగా సినిమాకు సంబంధించిన ఎన్నో విషయాలను వెల్లడించిన చిరంజీవి.. ఎప్పటి నుంచే తనపై వస్తున్న వివాదాలపై కూడా స్పందించారు. దీంతో ఇందులో ఎన్నో కొత్త విషయాలు తెలిశాయి.

  సుమన్ బ్లూ ఫిల్మ్ కేసుపై కూడా

  సుమన్ బ్లూ ఫిల్మ్ కేసుపై కూడా

  తాజా ఇంటర్వ్యూలో భాగంగా సదరు జర్నలిస్టు 'సుమన్ బ్లూ ఫిల్మ్ కేసు' గురించి ప్రస్తావించారు. దీనికి చిరంజీవి స్పందిస్తూ.. 'ఛీఛీ.. మేమిద్దరం మంచి స్నేహితులం. మధ్యలో ఎవడో ఒక పోరంబోకు జర్నలిస్టు అది వక్రీకరించి రాశాడు. ఇప్పటికే కొన్ని వందల సార్లు సుమన్ దీనిపై స్పందించాడు. మా ఇద్దరి మధ్య ఎలాంటివి జరగలేదు' అంటూ తొలిసారి పెదవి విప్పారు.

  Veera Simha Reddy: వీర సింహా రెడ్డిలో ఆ సీన్‌పై ట్రోల్స్.. ఇంత దారుణమా.. పల్నాటి బ్రహ్మనాయుడు అంటూ!

  శాడిజం అంటూ చిరు ఘాటుగా

  శాడిజం అంటూ చిరు ఘాటుగా

  తర్వాత చిరంజీవి 'అసలు ఆ వార్తలు పుట్టించినోడిది శాడిజం అనాలి. ఇప్పటికీ సుమన్‌కు నేను విషెస్ చెబుతుంటాను. 80 దశకం రీ యూనియన్‌లో మేము కలుస్తాం. మాట్లాడుకుంటాం. నవ్వుకుంటాం. ఏ వాళ్లకు తృప్తిగా ఉండదా? అది కాదు అంటున్నా ఇంకా పెంచుతూనే ఉన్నారు. అసలు దీని గురించి మాట్లాడుకోవడం కూడా సిగ్గుచేటు' అంటూ ఆయన మాట్లాడారు.

  ఏ తప్పూ పట్టలేరు అంటూనే

  ఏ తప్పూ పట్టలేరు అంటూనే

  అనంతరం చిరంజీవి కొనసాగిస్తూ.. 'ఏ తప్పూ చేయకపోయినా ఇలాంటివి సృష్టించి పైశాచిక ఆనందం పొందుదామని కొందరు చూస్తుంటారు. కానీ, నేను ఎలాంటి తప్పులు చేయను. నా నుంచి తప్పులు ఎవరూ పట్టలేదు. ఇలాంటి పట్టుకుని వాటిని సాగిదీసుకుంటూ పోయినా నాకు ఇబ్బంది లేదు' అని చెప్పారు. దీంతో చాలా ఏళ్లుగా ఉన్న ఈ వివాదానికి పుల్‌స్టాప్ పెట్టేశారాయన.

  English summary
  Megastar Chiranjeevi Recently Participated In an Interview. In This Chit Chat He Gives Clarity on Hero Suman Blue Film Case.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X