Megastar Chiranjeevi: చిన్నారి డ్యాన్స్ చూసి మురిసిపోయిన మెగాస్టార్.. పూనకాలు లోడింగ్ అంటూ..

మెగాస్టార్ చిరంజీవి ఇటీవల వాల్తేరు వీరయ్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. బాబీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. ఇక సినిమాకు విడుదలైన మొదటి రోజునే పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. మెగాస్టార్ గతంలో క్రియేట్ చేసిన రికార్డులను కూడా ఈ సినిమాతో బ్రేక్ చేసే విధంగా ముందుకు వెళుతున్నారు.

అయితే ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూస్తున్న మెగాస్టార్ ఎంతగానో ఆనందపడుతున్నారు. అంతేకాకుండా చిన్న వయసు వారి నుంచి పెద్దవారి వరకు అందరూ కూడా ఈ సినిమాలోని పాటలను సన్నివేశాలను చూసి చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నట్లుగా ఆయన తెలియజేశారు. అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో కూడా ఒక వీడియోను పోస్ట్ చేస్తూ తన ఆనందాన్ని వ్యక్తపరిచారు.

Megastar chiranjeevi shared cute little girl dance video on social media

ఒక చిన్నారి పాప పూనకాలు లోడింగ్ పాట చూస్తూ థియేటర్లోనే చిందులు వేసిన విధానం మెగాస్టార్ ను ఎంతగానో ఆకట్టుకుంది. పునకాలు లోడింగ్ అనే పాట నెక్స్ట్ జనరేషన్ కు కూడా చాలా బాగా నచ్చేసింది అని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అని ఆయన సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. ఇక ఆ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. మెగాస్టార్ చిరంజీవి గతంలో కూడా తన పాటలకు చిందులు వేసిన చిన్నపిల్లల వీడియోలను కూడా ఇదే తరహాలో సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ తన ఆనందాన్ని వ్యక్తపరిచారు.

ఇక దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించిన విషయం తెలిసిందే. పూనకాలు లోడింగ్ పాట థియేటర్లలో ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటుంది. మొదట్లో ఈ పాటపై కొంత ట్రోలింగ్ వచ్చినప్పటికీ థియేటర్లో చూసిన ఫాన్స్ మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక సోమవారం రోజు కూడా ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉన్నట్లు అర్థమవుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X