twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆయన ఇండస్ట్రీకి బ్లాక్‌బస్టర్లు ఇచ్చారు, అలాంటి వ్యక్తి చనిపోతే పట్టించుకోలేదు: మోహన్‌బాబు ఎమోషనల్

    |

    తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన సినీ రచయితల సంఘం ఘనంగా సిల్వర్ జూబ్లీ వేడుకలను జరుపుకొన్నది. ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖులు, రచయితలు, దర్శకులు, నిర్మాతలు హాజరయ్యారు. ఈ సమావేశంలో మెగాస్టార్ చిరంజీవి, మోహన్ బాబు ఉద్వేగంగా ప్రసంగించారు. ఈ వేడుకలో సినీ రచయితలు పరిశ్రమకు చేసిన సేవలను గుర్తు చేసుకొన్నారు. ఈ కార్యక్రమంలో డైలాగ్ కింగ్ మోహన్ బాబు భావోద్వేగంతో మాట్లాడుతూ..

    సరస్వతి పుత్రులను గౌరవించుకోవడం

    సరస్వతి పుత్రులను గౌరవించుకోవడం

    =సినీ రచయితలు సరస్వతి పుత్రులు. రచయితలను సత్కరించుకొనే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తాను. సినీ రచయితల వజ్రోత్సవంలో పాల్గొనే అవకాశం రావడం గొప్పగా భావిస్తున్నాను. నా కెరీర్‌లో ఎన్నో కంపెనీలలో పనిచేశాను. అలా ఓ వ్యక్తి వద్దకు వెళ్లి నాకు వేషాలు ఇవ్వమని వెంటపడి అడుకొన్నాను. అలాంటి వ్యక్తుల్లో నాకు బాగా సహాయం చేసిన వ్యక్తి రచయిత సత్యానంద్ గారు. ఆయన గురించి తెలుసుకొంటే నాకు కన్నీళ్లు వస్తాయి అని మోహన్ బాబు ఎమోషనల్ అయ్యారు.

     నా జీవితంలో ఆప్తులుగా

    నా జీవితంలో ఆప్తులుగా

    సత్యమూర్తి మహా దర్శకుడు ఆదుర్తి సుబ్బారావుకు మేనల్లుడైనా ఒదిగి ఉంటారు. అలాంటి వ్యక్తితో పరిచయం ఏరా.. ఒరేయ్ అనే స్థాయికి వెళ్లింది. అలా ప్రయాణం మధ్య ఎంతో గొప్ప అనుబంధాన్ని బలపడేలా చేసింది. ఎక్కడైనా ఎలాగైనా మాట్లాడే చనువు ఉన్న వ్యక్తితోపాటు చాలా మంది నాకు జీవితంలో ఆప్తులుగా మారాడు అని మోహన్ బాబు అన్నారు.

    ఆత్రేయతో అనుబంధం

    ఆత్రేయతో అనుబంధం

    నా జీవితంలో ఎంతో ప్రతిభావంతులు, మేధావులతో పనిచేశాను. నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న సమయంలో ఆత్రేయ, శ్రీశ్రీ, పరుచూరి బ్రదర్స్ లాంటి మహా రచయితలో పనిచేశాను. ఆత్రేయతో పనిచేసేటప్పడు ఆయనకు కావాల్సిన సిగరెట్లు, ఇతర వస్తువులు ఇవ్వడానికి కంపెనీల వాళ్లు డబ్బులు ఇచ్చేవారు. ఆ సమయంలో డబ్బులు కొట్టేసే వాడిని అని మోహన్ బాబు పేర్కొన్నారు.

    ఆత్రేయ చనిపోతే

    ఆత్రేయ చనిపోతే

    నేను స్థాపించిన బ్యానర్‌లో ఆత్రేయ, సత్యమూర్తి లాంటితో పనిచేశాను. అలాంటి ఉత్తమ రచయితలను గౌరవించడం అందరికీ తెలియదు. ఆత్రేయ లాంటి వ్యక్తి సినీ పరిశ్రమకు సిల్వర్ జూబ్లీలు, గోల్డెన్ జూబ్లీలు ఇచ్చారు. అలాంటి వ్యక్తి చనిపోతే ఎవరూ పట్టించుకోలేదు. ఎవరూ ఆయన చూడటానికి రాలేదు. చివరకు నా భార్య, కూతురు వెళ్లి దండ తీశారు. ఇలాంటి సంఘటనలు కూడా చూడాల్సి వచ్చింది అని మోహన్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు.

    కళామతల్లి నాకే అవకాశం

    కళామతల్లి నాకే అవకాశం

    సినీ పరిశ్రమలో మనకంటే ప్రతిభావంతులు, అందగాళ్లు ఉన్నా మనకే కళామతల్లి మనకు అవకాశం ఇచ్చింది. ఎంత మందో కళాకారులకు ఆశీర్వాదం ఇచ్చింది. అద్భుతమైన డైలాగులు రాసి.. నిర్మాత, దర్శకులకు అండగా నిలిచి.. నిర్మాతకు డబ్బులు రావాలని అనుకొని రాసే వారు సినీ రచయితలు అని మోహన్ బాబు అన్నారు. ఇలాంటి వ్యక్తులను సత్కరించుకోవడం నా పూర్వజన్మ సుకృతం అని అన్నారు.

    English summary
    Tollywood's Actor Mohan Babu gets emotional at TCWA Silver Jubilee Celebrations. He said that.. After Aathreya death, Nobody care him.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X