For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  హీరో నానికి షాక్.. గ్యాంగ్ లీడర్ టైటిల్ ఇవ్వం.. మెగా హీరోకే ఇస్తాం.. కొత్త మలుపు తిరిగిన వివాదం

  |
  Title Controversy On Gang Leader Title | Filmibeat Telugu

  మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన గ్యాంగ్ లీడర్ టైటిల్ వివాదంలో చిక్కుకున్నది. తాజాగా నేచురల్ స్టార్ నాని, దర్శకుడు విక్రమ్ కె కుమార్, మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో రూపొందే సినిమాకు గ్యాంగ్ లీడర్ అనే టైటిల్‌ను ఖరారు చేసిన విషయం తెలిసిందే. నాని బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన ఈ టైటిల్‌పై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. గ్యాంగ్ లీడర్ అనే టైటిల్ తమ బ్యానర్లో రిజిస్టర్ చేసుకున్నామని, అదే పేరుతో తాము సినిమా కూడా ప్రారంభించామని చిత్ర నిర్మాత, హీరో మోహన కృష్ణ ఫిలిం చాంబర్లో జరిగిన ప్రెస్ మీట్లో తెలియజేశారు. మాణిక్యం మూవీస్ బ్యానర్ మీద తెలంగాణ, ఏపీ ఫిలిం చాంబర్లో టైటిల్ రిజిస్ట్రేషన్ చేసుకున్నామని తెలిపారు. మోహనకృష్ణ ఏమన్నారంటే...

   గ్యాంగ్ లీడర్ టైటిల్ మాదే

  గ్యాంగ్ లీడర్ టైటిల్ మాదే

  "మాణిక్యం మూవీస్ బ్యానర్లో గతంలో బావా మరదలు అనే సినిమా నిర్మించాం. ఇప్పుడు నాయుడు గారి అబ్బాయి నిర్మిస్తున్నాం. త్వరలోనే గ్యాంగ్ లీడర్ అనే సినిమా చేయబోతున్నాం. ఇందులో నేనే హీరోగా, నిర్మాతగా సెట్స్ మీదకు వెళ్ల బోతున్నాం. అక్టోబర్‌లోనే గ్యాంగ్ లీడర్ అనే టైటిల్ రిజిస్ట్రేషన్ చేశాం.

   చిరంజీవి వీరాభిమానిని

  చిరంజీవి వీరాభిమానిని

  ఉగాది పండుగ రోజున ఈస్ట్ గోదావరిలో దాదాపు 40 రోజులపాటు షూటింగ్‌కు ప్లాన్ చేశాం. చిరంజీవి బర్త్‌డే సందర్భంగా ఆగస్ట్ 22న సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం. నేను చిరంజీవి గారికి వీరాభిమానిని. గ్యాంగ్ లీడర్ టైటిల్‌తో ఏ మెగా హీరో సినిమా చేసినా ఇచ్చేస్తాను. వేరే వాళ్లకు ఇచ్చే ప్రసక్తి లేదు అని మోహనకృష్ణ స్పష్టం చేశారు.

  పర్మీషన్ లేకుండా ఎలా అనౌన్స్ చేస్తారు?

  పర్మీషన్ లేకుండా ఎలా అనౌన్స్ చేస్తారు?

  గ్యాంగ్ లీడర్ టైటిల్ కావాలని మైత్రీ మూవీ మేకర్స్ నుంచి కాల్ చేశారు. కానీ నేను టైటిల్ ఇవ్వను, ఎవరికీ అమ్మనని చెప్పాను. వాళ్లు చాలా రకాలుగా ట్రై చేశారు. కానీ టైటిల్ మాకే దక్కింది. అయినప్పటికీ నాని బర్త్ డే రోజు మా టైటిల్‌తో పబ్లిసిటీ చేసుకున్నారు. నా పర్మీషన్ తీసుకోకుండా ఎలా టైటిల్ ను ఎనౌన్స్ చేస్తారు. ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకున్నారో తెలియదు. చాంబర్ రూల్స్ కు విరుద్దంగా టైటిల్ ను ఎలా ఏనౌన్స్ చేస్తారు. నేను చాంబర్ లో కంప్లైంట్ ఇచ్చాను.

  మా టైటిల్ తీసుకోవడం కరెక్ట్ కాదు

  మా టైటిల్ తీసుకోవడం కరెక్ట్ కాదు

  గ్యాంగ్ లీడర్ టైటిల్ మాకే వచ్చింది. ఏపీ, తెలంగాణ చాంబర్స్ మాకే అనుకూలంగా ఉన్నాయి. నేను రిజిస్ట్రేషన్ చేసి మూడు నెలలు అవుతుంది. ఉగాది నుంచి షూటింగ్ కు వెళ్తున్నాం. రూ.3 కోట్ల బడ్జెట్‌తో సినిమా చేస్తున్నాం. చిరంజీవి గారి టైటిల్ పెట్టడం వల్ల చాలా ఫండింగ్ వచ్చింది. రూ.50 లక్షల రూపాయలు అడ్వాన్స్ కూడా వచ్చింది. అనుమతి లేకుండా టైటిల్ తీసుకోవడం కరెక్ట్ కాదు.

   లీగల్‌గా మేమే కరెక్ట్ ఉన్నాం

  లీగల్‌గా మేమే కరెక్ట్ ఉన్నాం

  టాలీవుడ్‌లో పెద్ద ప్రొడ్యూసర్ అవ్వాలని వచ్చాను. చిరంజీవి గారి టైటిల్‌కు ఎలాంటి ఆటంకం లేకుండా మంచి పేరు తీసుకోవాలని కథ రెడీ చేశాం. టైటిల్ విషయంలో లీగల్‌గా మేం కరెక్ట్ గా ఉన్నాం. తుమ్మల పల్లి రామసత్యనారాయణ, సముద్ర, నట్టి కుమార్, ముత్యాల రాందాసు లాంటి పెద్దలు కూడా మాకు సపోర్ట్‌గా ఉన్నారు. ఏపీ ఎలక్షన్స్ అయ్యాక... 16 సినిమాలు తీసిన పెద్ద బ్యానర్‌తో కలిసి మా బ్యానర్లో సినిమాలు తీసి యంగ్ టాలెంట్ ని ఎంకరేజ్ చేయబోతున్నాం అని మోహనకృష్ణ అన్నారు.

  తెర ముందు, తెర వెనుక

  తెర ముందు, తెర వెనుక

  నటీనటులు, సాంకేతికవర్గం
  టైటిల్ - గ్యాంగ్ లీడర్ (మళ్లీ మొదలవుతుంది రచ్చ)

  నటీనటులు - సుమన్, నాగబాబు, తనికెళ్ల భరణి, ఎల్.బి.శ్రీరామ్, గీతా సింగ్, జబర్ దస్త్ అప్పారావు, రంగస్థలం మహేష్, చిత్రం శ్రీను, నల్ల వేణు, ఆర్.పి, జబర్దస్త్ బాబి, వరహరిబాబు, లడ్డూ, బాలాజి, చత్రపతి శేఖర్ తదితరులు


  నిర్మాత - శింగులూరి మోహన్ రావు

  డైరెక్టర్ - సిహెచ్. రవి కిశోర్ బాబు

  హీరో - బావ మరదలు ఫేమ్ మోహన్ కృష్ణ

  మ్యూజిక్ డైరెక్టర్ - రమేష్ నాయుడు

  ఎడిటర్ - నందమూరి హరి

  కెమెరామెన్ - మురళి

  ఫైట్ మాస్టర్ - రామ్ సుంకర

  డ్యాన్స్ మాస్టర్ - మహేష్

  పోస్ట్ ప్రొడక్షన్ - సారథి స్డూడియోస్

  పబ్లిసిటీ డిజైనర్ - అజయ్

  English summary
  Natural star Nani 24th movie titled as Gang leader. This title announced on eve of Nani's Birthday. Mythri movies are producing, Vikram K kumar is director. Anirudh will be music Director.but Producer, Hero Mohan Krishna revealed that Gang leader titled rights with us.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more