For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  NagaChaitanya :ఆ రెండు విషయాలు చెబుతున్నాం.. శేఖర్ తప్ప ఎవరూ చెప్పలేరు.. పల్లవితో మరిన్ని కధలు చెప్పాలి!

  |

  అక్కినేని హీరో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన లవ్ స్టోరీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ రోజు హైదరాబాద్ లో గ్రాండ్ గా జరుగుతుంది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అతిథులుగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి అలాగే బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ హాజరయ్యారు. ఇద్దరూ కూడా లవ్ స్టోరీ యూనిట్ మొత్తానికి ఒకరకంగా బూస్ట్ ఇచ్చారు అని చెప్పవచ్చు. అయితే దాదాపు దర్శకుడు, హీరోయిన్ సహా అందరూ మాట్లాడాక నాగచైతన్య మాట్లాడటం మొదలు పెట్టారు. అయితే నాగచైతన్య ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఏం మాట్లాడారు ? ఎలాంటి విషయాలు మనతో పంచుకున్నారు అనే వివరాల్లోకి వెళితే

  అమీర్ ఖాన్ కి కృతజ్ఞతలు

  అమీర్ ఖాన్ కి కృతజ్ఞతలు

  ప్రసంగం మొదలు పెట్టడంతో చిరంజీవికి అలాగే అమీర్ ఖాన్ కి కృతజ్ఞతలు చెబుతూ మొదలుపెట్టాడు నాగచైతన్య. చిరంజీవి గారు ఆదర్శ ప్రాయంగా నిలుస్తారని, సినిమాల్లోనే కాకుండా నిజ జీవితంలో కూడా ఆయన చేసే పనూలు చాలా ఆదర్శవంతంగా ఉంటాయి అని చెప్పుకొచ్చారు. లాల్ సింగ్ చద్దా షూటింగ్ సమయంలో అమీర్ ఖాన్ గారితో పరిచయం పెరిగిందని ట్రైలర్ చూసి చాలా ఇంప్రెస్ అయ్యాడని ఈ ఆదివారం ప్లాన్స్ ఏంటి అని అడిగితే ఇలా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతూ ఉందని చెప్పడంతో తాను కూడా వస్తాను అని అన్నారని అంతకన్నా ఏం కావాలి అంటూ ఆయన వెంటనే తీసుకు వచ్చేసాను అని చెప్పుకొచ్చారు నాగచైతన్య.. తన అభిమానులను పలకరించిన నాగచైతన్య త్వరలోనే మనం అందరం కలిసే రోజు వస్తుందని ఈ కరోనా పరిస్థితులన్నీ తగ్గిపోతే మరింత దగ్గర అవుతామని చెప్పుకొచ్చాడు.

  సినిమాని ప్రేమిస్తారు

  సినిమాని ప్రేమిస్తారు

  అయితే ఈ లవ్ స్టోరీ విషయం గురించి చెప్పాలి అంటే తన నటనా కెరీర్ ప్రారంభించిన తర్వాత ఏ పాత్ర కోసం ఇంత డెప్త్ కు వెళ్లి నటించలేదని తాను అలా నటించేలా చేసింది శేఖర్ కమ్ముల అని నాగ చైతన్య చెప్పుకొచ్చాడు. తన కెరీర్ మొత్తం మీద ఎలాంటి సినిమా కూడా తనని ఇంత ఇన్ఫ్లూ యన్స్ చేయలేదు అని సినిమా ప్రారంభించిన కొత్తలో శేఖర్ కమ్ముల స్టైల్ కొంచెం కొత్తగా అనిపించిందని రెండు మూడు వారాలు షూటింగ్ తర్వాత హానెస్టీ అనేది అర్ధం అయిందని, ఆయన ఎంతలా సినిమాని ప్రేమిస్తారు అనే విషయం తనకు అర్థమైందని చెప్పుకొచ్చారు. అలాగే తన స్నేహితులు, మిగతా ఇండస్ట్రీ వారందరికీ ఒక సలహా ఇస్తున్నా అని శేఖర్ కమ్ముల తో నటించే అవకాశం వస్తే వదులుకోవద్దు అని ఆయన చెప్పుకొచ్చారు.

   నిజమైన మనిషి బయటికి వస్తాడు

  నిజమైన మనిషి బయటికి వస్తాడు

  ఒక్కసారి శేఖర్ కమ్ములతో పని చేస్తే మనలో ఉన్న నిజమైన మనిషి బయటికి వస్తాడు అని అంటూ ఉండగా శేఖర్ కమ్ముల అదేమీ లేదని అనే ప్రయత్నం చేయగా మీరు నేర్పిస్తారు అని అనడం లేదు మేము నేర్చుకుంటాం అని అంటూ అని చెప్పుకొచ్చాడు. ఈ సినిమాలో రెండు ముఖ్యమైన విషయాల గురించి ప్రస్తావించబోతున్నారు అని ఈ రెండు విషయాలు ప్రస్తావించడం తనకు చాలా ఆనందంగా ఉందని చెప్పుకొచ్చాడు. ఈ సినిమాలో నటించినందుకు నాకు చాలా గర్వంగా ఉందని ఆయన అన్నారు. ఇలాంటి ఇష్యూస్ గురించి మనం ఇంకా మాట్లాడాలని పేర్కొన్న ఆయన, ఇంకా ధైర్యం గా ఇంకా ఓపెన్ గా మాట్లాడాలి అని అన్నారు. అయితే దీనిని శేఖర్ కమ్ముల కంటే ఎక్కువగా మరెవరూ చేయలేరు అని కూడా చెప్పుకొచ్చాడు. ఇలాంటి ఇష్యూస్ గురించి మాట్లాడాల్సిప్పుడు సెన్సిటివిటీ కావాలని ఆ సెన్సిటివిటీ శేఖర్ కమ్ముల దగ్గర మాత్రమే ఉందని చెప్పుకొచ్చారు.

  పేరు పేరునా పేరు పేరునా

  పేరు పేరునా పేరు పేరునా

  ఇక తమ నిర్మాతల గురించి మాట్లాడుతూ సినిమాను ఈ ఏడాది ఏడాదిన్నరకు పైగా హోల్డ్ చేసి మమ్మల్ని నమ్మి సినిమాను, టీం ని నమ్మి మరీ ముఖ్యంగా కంటెంట్ ను నమ్మి థియేటర్లలోనే విడుదల చేయాలని అనుకుంటున్న వారి పట్టుదలకు సలాం అంటూ నాగచైతన్య చెప్పుకొచ్చారు. ఇక సాయి పల్లవితో ఎక్స్పీరియన్స్ చాలా బాగుందని ఆమె తన లో ఉన్న నటుడిని మరింత ఎలివేట్ అయ్యేలాగా చేసిందని ఆయన చెప్పుకు రావడమే గాక ఆమెతో మరిన్ని సినిమాలు చేయాలనే కోరిక ఉందని కూడా వెల్లడించారు. అలాగే షూటింగ్ సమయంలో కొంత పేషెన్స్ చూపినందుకు థాంక్స్ కూడా చెప్పుకొచ్చాడు చైతు. అలాగే డైరెక్షన్ టీం, ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేష్, కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్, యాక్షన్ కొరియోగ్రాఫర్ శ్రీధర్, మ్యూజిక్ డైరెక్టర్ పవన్ ఇలా పేరు పేరునా చైతన్య వాళ్ళు అందరికీ థాంక్స్ చెప్పారు.

  Naga Chaitanya Samantha విడాకులు వివాదానికి చెక్.. ఎందుకీ లొల్లి !
  ప్రేమ నగర్ సినిమా కూడా

  ప్రేమ నగర్ సినిమా కూడా

  ఇక సెప్టెంబర్ 24వ తేదీ ఒక మ్యాజికల్ డేట్ లాగా అనిపిస్తోందని ఎన్నో డేట్స్ మారిన తర్వాత ఈ డేట్ ఫిక్స్ అయిందని అనుకోకుండా తాత గారు నటించిన ప్రేమ నగర్ సినిమా కూడా 50 ఏళ్ల క్రితం ఇదే రోజున విడుదలై సూపర్ హిట్ అయిందని చెప్పుకొచ్చారు. ఇది కూడా ఆ రేంజ్ లో హిట్ అయి అందరినీ అలరిస్తుందని భావిస్తున్నానని అని అన్నారు. తెలుగు ప్రేక్షకులందరూ కోవిడ్ ప్రోటోకాల్ పాటిస్తూ థియేటర్లకు రావాలని నాగచైతన్య కోరారు.

  English summary
  Naga chaitanya reveals sensational issues about love story movie in pre release event.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X