For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మరో గొప్ప పని చేసిన బాలయ్య: ఏకంగా ఇంటినే వాళ్లకు ఇచ్చేశాడు.. ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే సమయమిది

  |

  దాదాపు నలభై ఏళ్లుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో హవాను చూపిస్తున్నారు నటసింహా నందమూరి బాలకృష్ణ. వందకు పైగా చిత్రాల్లో నటించిన ఆయన.. ఎన్నో విజయాలను అందుకున్నారు. పరాజయాలు వచ్చినా కృంగిపోకుండా ధృడంగా ఉన్నారు. సినిమాల్లో సత్తా చాటుతోన్న ఆయన సేవ కార్యక్రమాల్లోనూ ముందే ఉంటున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఈ క్రమంలోనే తాజాగా మరో గొప్ప పనిని చేశారాయన. దీంతో బాలయ్య అభిమానులు ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. ఇంతకీ ఆయన ఏం చేశారు? ఆ వివరాలు మీకోసం!

  అదితి రావ్ హైదరి.. లెగ్స్ అందాలు కనిపించేలా సెక్సీ స్టిల్స్

  వరుస ఫ్లాపులు.. తగ్గేదేలేదు అనేలా

  వరుస ఫ్లాపులు.. తగ్గేదేలేదు అనేలా

  కెరీర్ ఆరంభం నుంచే హిట్లు ప్లాపులు అనే తేడా లేకుండా ఒకదాని తర్వాత ఒకటి ఇలా సినిమాలు చేస్తూ వెళ్తున్నారు నటసింహా నందమూరి బాలకృష్ణ. ఇలా 2019లో ఆయన ఏకంగా మూడు సినిమాలు చేశారు. అయితే, అవన్నీ బాక్సాఫీస్ ముందు దారుణమైన పరాజయాలను చవి చూశాయి. అయినప్పటికీ ఏమాత్రం వెనక్కి తగ్గని బాలయ్య.. మరిన్ని సినిమాలు చేస్తున్నారు.

  చీరలో కూడా గ్లామర్ తో కవ్విస్తున్న నివిషా

  అఖండగా వచ్చేందుకు సిద్ధమవుతూ

  అఖండగా వచ్చేందుకు సిద్ధమవుతూ

  వరుస పరాజయాలతో సతమతం అవుతోన్న బాలయ్య.. ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న పట్టుదలతో ఉన్నారు. ఇందుకోసం కలిసొచ్చిన దర్శకుడు బోయపాటి శ్రీనుతో ‘అఖండ' అనే సినిమా చేస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రగ్యా జైస్వాల్, పూర్ణ హీరోయిన్లు. శ్రీకాంత్ విలన్. థమన్ సంగీతం అందిస్తున్నాడు.

  అమ్రిత అయ్యర్.. నవ్వుతోనే మాయ చేస్తున్న హాట్ బ్యూటీ

  వీడియోతో చరిత్ర సృష్టించిన బాలయ్య

  వీడియోతో చరిత్ర సృష్టించిన బాలయ్య

  ‘అఖండ' మూవీని బాలకృష్ణ కెరీర్‌లో భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. అంతేకాదు, ఇందులో ఎంతో మంది బడా నటులను తీసుకున్నారు. అలాగే, ఈ మూవీలో నటసింహం అఘోరా పాత్రలోనూ కనిపించబోతున్నారు. వీటితో పాటు ఈ మూవీతో హిట్ కొట్టాలన్న లక్ష్యంతో ఎన్నో సాహసాలు చేస్తున్నారు. ఇక, ఆ మధ్య వచ్చిన టీజర్‌తో టాలీవుడ్‌లో సరికొత్త చరిత్రను సృష్టించారాయన.

  హాట్ బ్యూటీగా దృశ్యం మూవీ చిన్నారి.. ఎస్తేర్ అనిల్ ఫొటోలు వైరల్

  మరో కుర్ర దర్శకుడితో సినిమాకు రెడీ

  మరో కుర్ర దర్శకుడితో సినిమాకు రెడీ

  బోయపాటి శ్రీనుతో చేస్తున్న సినిమా పట్టాలపై ఉండగానే.. ‘క్రాక్'తో భారీ విజయాన్ని అందుకున్న ఎనర్జిటిక్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నందమూరి బాలకృష్ణ ఓ సినిమా చేయబోతున్నారు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ ఇటీవలే ప్రకటించింది. ఇప్పటికే ఈ స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయిందని తెలుస్తోంది. దీంతో నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.

  షూటింగ్ లేని సమయంలో ఆ పనితో

  షూటింగ్ లేని సమయంలో ఆ పనితో

  ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కరోనా ప్రభావం విపరీతంగా ఉంది. దీంతో సినిమాల షూటింగులు అన్నీ ఆగిపోయాయి. దీంతో నందమూరి బాలకృష్ణ ఎక్కువ సమయంలో తన బసవ తారకం క్యాన్సర్ ఆస్పత్రిలోనే గడుపుతున్నారు. అలాగే, హైదరాబాద్ నుంచే తన నియోజకవర్గం హిందూపురంలోని ప్రజల బాగోగులు తెలుసుకుంటున్నారు. మొత్తానికి సేవా కార్యక్రమాలపై దృష్టి సారించారు.

  అక్కడా ఇక్కడా.. అన్నీ తానై చూస్తూ

  అక్కడా ఇక్కడా.. అన్నీ తానై చూస్తూ

  కరోనా సమయంలో నందమూరి బాలకృష్ణ చాలా మందికి అండగా ఉంటున్నారు. ఇప్పటికే హిందూపురం నియోజకవర్గానికి ఎన్నో మెడికల్ కిట్లను పంపించిన ఆయన.. స్వయంగా ఖర్చు చేసుకుని ఎన్నో సదుపాయాలను కూడా సమకూర్చారు. అదే సమయంలో ఇటీవలే హైదరాబాద్‌లోనూ 20 లక్షల రూపాయలతో మెడికల్ సదుపాయాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

  ఏకంగా ఇంటినే వాళ్లకు ఇచ్చేశాడుగా

  ఏకంగా ఇంటినే వాళ్లకు ఇచ్చేశాడుగా

  రోజు రోజుకూ కరోనా ప్రభావం పెరుగుతోన్న నేపథ్యంలో ఆస్పత్రులన్నీ ఫుల్ అయిపోయాయి. ఇలాంటి సమయంలో నందమూరి బాలకృష్ణ తన గెస్ట్ హౌస్‌ను కోవిడ్ కేర్ సెంటర్‌గా మార్చేశారు. అక్కడ దాదాపు వంద మందికి పైగానే పెషేంట్లు ఉండేలా బెడ్లు, వాటికి ఆక్సీజన్ సిలిండర్లు ఏర్పాటు చేసినట్లు తెలిసింది. బాలయ్య చేసే ఈ పనుల్లో ఫ్యాన్స్ కూడా వాలంటీర్లుగా చేస్తున్నట్లు టాక్.

  English summary
  Tollywood Senior Hero Nandamuri Balakrishna Now Busy with Covid Care Works. In this time he Allotted his House for Covid Patients.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X