స్పై కాప్‌గా నందమూరి బాలకృష్ణ: సీనియర్ డైరెక్టర్‌ సినిమాలో తొలిసారి అలా!

గత ఏడాది వరుసగా మూడు సినిమాలు పరాజయం పాలవడంతో ఈ సారి కచ్చితంగా హిట్ కొట్టాలన్న పట్టుదలతో ఉన్నారు నటసింహా నందమూరి బాలకృష్ణ. ఈ క్రమంలోనే ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో సినిమా చేస్తున్నాడు. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాణంలో రూపొందుతోన్న ఈ సినిమా ఇప్పటికే మొదటి షెడ్యూల్‌ షూటింగ్‌ను కూడా పూర్తి చేసుకుంది. బాలకృష్ణ కెరీర్‌లోనే భారీ బడ్జెట్ మూవీగా వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఎన్నో అంచనాలు ఉన్నాయి. దీని తర్వాత ఆయన చేయబోయే ప్రాజెక్టులపై ఎన్నో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

'లారీ డ్రైవర్', 'రౌడీ ఇన్‌స్పెక్టర్', 'సమరసింహా రెడ్డి', 'నరసింహా నాయుడు' సూపర్ డూపర్ హిట్ల తర్వాత సీనియర్ డైరెక్టర్ బీ గోపాల్‌తో నందమూరి బాలకృష్ణ సినిమా చేయబోతున్నారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, ఈ మూవీ కోసం సీనియర్ రైటర్ సాయి మాధవ్ బుర్రా ఇప్పటికే ఓ పవర్‌ఫుల్ స్టోరీని సిద్ధం చేశారని, ఇందులో నటసింహం.. రజినీకాంత్ తరహాలో తండ్రి పాత్రను పోషిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే, ఆ మధ్య ఈ సినిమాను ఆపేశారని కూడా అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దీని గురించి తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది.

Nandamuri Balakrishna Spy Cop Role in B. Gopal Movie

తాజా సమాచారం ప్రకారం... ఈ సినిమాను త్వరలోనే అధికారికంగా ప్రకటించబోతున్నారట. అంతేకాదు, ఈ సినిమాలో బాలకృష్ణ స్పై కాప్‌ (సీక్రెట్ పోలీస్)గా కనిపించబోతున్నాడని కూడా తెలుస్తోంది. ఆయన పాత్ర ఎంతో హైలైట్‌గా ఉంటుందని, గతంలో ఎన్నడూ చూడని విధంగా ఈ చిత్రంలో కనిపిస్తారని అంటున్నారు. దీంతో ఈ హిట్ కాంబినేషన్ కోసం నందమూరి ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఎనర్జిటిక్ డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్‌తోనూ బాలయ్య 'బలరామయ్య బరిలోకి దిగితే' అనే మూవీ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X