Don't Miss!
- News
టీడీపీ అడ్రస్ గల్లంతు.. మంత్రి బొత్స కామెంట్స్
- Sports
రియాన్ పరాగ్ ఫీల్డింగ్ మస్తుందిగా.. అతని జోష్ అదిరిపోయిందన్న శ్రీలంకన్ స్టార్
- Finance
క్రిప్టో మార్కెట్ లాభాల్లోనే ఉంది, కానీ బిట్ కాయిన్ 30,000 డాలర్లకు దిగువనే
- Lifestyle
విరేచనాలు ఎక్కువ అయ్యిందా? ఈ టీలో ఏదైనా తాగితే వెంటనే ఆగిపోతాయి ...
- Automobiles
Eeco ప్రియులకు గుడ్ న్యూస్.. ఎందుకో ఇక్కడ చూడండి
- Technology
ఆపిల్ వాచ్‌లో ఎయిర్టెల్ Wynk మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌కి యాక్సెస్!!
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఆ స్టార్ హీరో సినిమాలో నాని స్పెషల్ రోల్.. సెట్టయితే బీభత్సమే..?
నేచురల్ స్టార్ నాని ఇలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద మినిమమ్ వసూళ్లను అందుకుంటాయి. అందుకే చాలా మంది నిర్మాతలు నానితో సినిమా చేయడం సేఫ్ జోన్ అని ఆలోచిస్తారు. నాని మూడేళ్ల తర్వాత డేట్స్ ఇస్తానని చెప్పినా కూడా ఇప్పుడే అడ్వాన్స్ ఇవ్వడానికి కూడా చాలామంది నిర్మాతలు లైన్లో ఉన్నారు. కానీ ఈ హీరో మాత్రం వీలైనంత వరకు తొందర పడకుండా ముందుగా కదా సెట్ అయితేనే తదుపరి నిర్ణయాలు తీసుకుంటున్నాడు.
అనవసరంగా ఒకరి కోసం సినిమా చేయాలని కమిట్మెంట్ తీసుకోవడం లేదు. గతంలో అలా కమిట్మెంట్ తీసుకోవడం వల్లనే కొన్ని వరుస అపజయాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక ప్రస్తుతం నాని ఫోకస్ మొత్తం కూడా పని శ్యామ్ సింగరయ్ పైనే ఉంది.

రెండు సినిమాలు ఓటీటీలోనే
గత ఏడాది వచ్చిన వి సినిమా తో పాటు టక్ జగదీష్ సినిమా కూడా ఓటీటీ లో డైరెక్ట్ గా విడుదలైన విషయం తెలిసిందే. ఆ సినిమాలపై ఎంతో నమ్మకం పెట్టుకొని థియేటర్స్ లో విడుదల చేయాలని అనుకున్నాడు. కానీ కరోనా కారణంగా నిర్మాతలు అమెజాన్ ప్రైమ్ లో వేసుకోవలసి వచ్చింది. అయినప్పటికీ నాని అనుకున్నంత స్థాయిలో అయితే విజయాన్ని అందుకోలేక పోయారు. అలా విడుదలైన రెండు సినిమాలు రెండూ కూడా పూర్తిగా నెగటివ్ టాక్ ను సొంతం చేసుకున్నాయి.

ఆ సినిమాపై ఫోకస్
రెండు సినిమాల విషయంలో నాని చాలా అప్సెట్ అవ్వాల్సి వచ్చింది. ఇక తదుపరి సినిమా విషయంలో మాత్రం నాని చాలా బలమైన నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నాడు. ఎలాగైనా శ్యామ్ సింగరాయ్ సినిమాను థియేటర్స్ లో విడుదల చేయాలని అనుకుంటున్నాడు. ఇప్పటికే పలుమార్లు నిర్మాతలకు కూడా చర్చలు జరిగాయి ఇక ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులు కూడా ని ఇది వరకే పూర్తిచేసుకున్నాడు.

షూటింగ్ ఫినిష్ అయినా ట్తగ్గట్లేదుగా
ఇక ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మొదలైనట్లు తెలుస్తోంది. అయితే నాని తన పని పూర్తి అయినప్పటికీ కూడా సినిమాకు సంబంధించిన ప్రతి విషయంలో కూడా దర్శకుడి తో చర్చలు జరుపుతున్నాడు. ఇక ఈ సినిమాతో బిజీగా ఉంటూనే మరోవైపు అంటే సుందరానికి.. అనే సినిమాను కూడా ఫినిష్ చేస్తున్నాడు. ఆ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.

విజయ్ సినిమాలో స్పెషల్ రోల్
ఇక ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక టాక్ గట్టిగానే వినిపిస్తోంది. నాని కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో కూడా స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. విజయ్ ఇటీవల తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లితో ఒక సినిమా చేసేందుకు ఒప్పుకున్న విషయం తెలిసిందే. సినిమాలు నిర్మాత దిల్ రాజు తెలుగు తమిళంలో ఒకేసారి ద్విభాషా చిత్రంగా భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు.
ఇక అందులో నానిని ఒక ప్రత్యేకమైన పాత్ర కోసం సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉందట. ఆ పాత్రలో నెగిటివ్ షేడ్స్ ఉంటాయని కథనాలు వస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే అఫీషియల్ గా క్లారిటీ వచ్చే వరకు వేయిట్ చేయాల్సిందే.